Nidhan
సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుస విజయాల్లో ఓ తెలుగోడు కీలకపాత్ర పోషిస్తున్నాడు. అచ్చం హిట్‌మ్యాన్ రోహిత్‌ను తలపిస్తున్న ఆ బ్యాటర్.. క్రీజులోకి దిగిందే ఆలస్యం విధ్వంసక షాట్లతో రెచ్చిపోతున్నాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుస విజయాల్లో ఓ తెలుగోడు కీలకపాత్ర పోషిస్తున్నాడు. అచ్చం హిట్‌మ్యాన్ రోహిత్‌ను తలపిస్తున్న ఆ బ్యాటర్.. క్రీజులోకి దిగిందే ఆలస్యం విధ్వంసక షాట్లతో రెచ్చిపోతున్నాడు.
Nidhan
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. సారథిగానూ, ఆటగాడిగానూ ఎంతో మంది యువ ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. బ్యాట్‌తో అతడు చేసే విధ్వంసం అంతా ఇంతా కాదు. భారత జట్టు తరఫునే కాదు.. ఐపీఎల్‌లోనూ హిట్‌మ్యాన్ అవసరమైనప్పుడల్లా విశ్వరూపం చూపిస్తుంటాడు. నీళ్లు తాగినంత అలవోకగా బంతిని స్టాండ్స్‌లోకి పంపిస్తుంటాడు. అతడు బ్యాటింగ్ చేస్తుంటే సిక్సులు కొట్టడం ఇంత ఈజీనా అని అనిపిస్తుంది. రోహిత్ క్రీజులో ఉన్నాడంటే ప్రత్యర్థి జట్టులో ఎంత తోపు బౌలర్ ఉన్నా బౌలింగ్ చేయాలంటే చెమటలు పట్టాల్సిందే. అలాంటి హిట్‌మ్యాన్‌కు వారసుడ్ని తానేనని అంటున్నాడో బ్యాటర్. మరి.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో నయా రోహిత్‌గా పేరు తెచ్చుకున్న ఆ ప్లేయర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
సన్‌రైజర్స్‌లో మరో రోహిత్ వచ్చేశాడు. అతడే విశాఖపట్నం కుర్రాడు, బ్యాటింగ్ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి. ఈ ఐపీఎల్లో వరుసగా అదిరిపోయే పెర్ఫార్మెన్స్‌లతో దుమ్మురేపుతున్నాడీ తెలుగు తేజం. చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఆఖర్లో వచ్చి బడా షాట్స్‌తో మెరిశాడు నితీష్. విన్నింగ్ షాట్‌గా సిక్స్ కొట్టి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. ఆ మ్యాచ్‌లో అతడికి ఎక్కువ బంతులు ఆడే అవకాశం రాలేదు. కానీ అతడి ప్రతిభను గుర్తించిన ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ పంజాబ్‌తో మ్యాచ్‌లో ప్రమోషన్ ఇచ్చింది. బ్యాటింగ్ ఆర్డర్లో పైకి పంపింది. ఫోర్త్ డౌన్లో వచ్చిన నితీష్ 37 బంతుల్లో 64 పరుగులు చేశాడు. ఇందులో 4 బౌండరీలతో పాటు 5 భారీ సిక్సులు ఉన్నాయి. బౌలింగ్‌లోనూ తడాఖా చూపించిన ఈ తెలుగు కుర్రాడు కీలక సమయంలో జితేష్ శర్మ (19)ను ఔట్ చేశాడు. అయితే నితీష్ బ్యాటింగ్ అచ్చం రోహిత్ శర్మను తలపించడం హైలైట్ అనే చెప్పాలి.
రోహిత్ మాదిరిగా ఫస్ట్ బాల్ నుంచే అగ్రెసివ్‌గా బ్యాటింగ్ చేస్తున్నాడు నితీష్ రెడ్డి. దొరికిన బాల్‌ను దొరికినట్లు బౌండరీకి లేదా స్టాండ్స్‌కు పంపిస్తున్నాడు. అతడు కొట్టే సిక్సులకు బంతులు గ్యాలరీల్లో కూర్చున్న ఆడియెన్స్ దగ్గరకు వెళ్లి పడుతున్నాయి. దాన్ని బట్టే అతడి భుజ బలం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పుల్ షాట్స్ కూడా హిట్‌మ్యాన్ స్టైల్లో అలవోకగా బాదేస్తున్నాడీ 20 ఏళ్ల కుర్రాడు. బాల్ కాస్త లెగ్ సైడ్ పడినా పుల్ షాట్‌తో విరుచుకుపడుతున్నాడు. బౌన్సర్లను కూడా ఇదే షాట్‌తో బౌండరీలుగా మలుస్తున్నాడు నితీష్. దీంతో అందరూ అతడ్ని మరో రోహిత్ అని మెచ్చుకుంటున్నారు. పుల్ షాటే కాదు.. లాఫ్టెడ్ షాట్ కూడా హిట్‌మ్యాన్ మాదిరిగానే పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు. రివర్స్ స్వీప్ నితీష్ అమ్ములపొదిలో మరో అస్త్రంలా మారింది. ఇదే షాట్‌తో జడేజా బౌలింగ్‌లో సిక్స్ బాదాడతను. ఇదంతా చూస్తున్న నెటిజన్స్.. హిట్‌మ్యాన్‌కు నితీషే సరైన వారసుడని అంటున్నారు. మరి.. నితీష్ పెర్ఫార్మెన్స్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.
He Can Bat , He Can Bowl and He Can Field 🤞
Nitish Kumar Reddy 🔥 #Sunrisers pic.twitter.com/wE20Efa03Z
— Nanii!! (@narasimha_chow2) April 9, 2024