Jasprit Bumrah: చరిత్ర సృష్టించిన బుమ్రా.. IPLలో ఏకైక బౌలర్​గా అరుదైన రికార్డు!

ముంబై ఇండియన్స్ ఏస్ పేసర్ జస్​ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. ఇన్నేళ్ల ఐపీఎల్ హిస్టరీలో ఎవరికీ సాధ్యం కాని అరుదైన ఫీట్​ను అందుకున్నాడు.

ముంబై ఇండియన్స్ ఏస్ పేసర్ జస్​ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. ఇన్నేళ్ల ఐపీఎల్ హిస్టరీలో ఎవరికీ సాధ్యం కాని అరుదైన ఫీట్​ను అందుకున్నాడు.

ముంబై ఇండియన్స్ ఏస్ పేసర్ జస్​ప్రీత్ బుమ్రా చెలరేగిపోయాడు. ఐపీఎల్-2024లో ఇప్పటిదాకా ఆడిన 4 మ్యాచుల్లో 6 వికెట్లే తీశాడతను. వికెట్లు పడకపోయినా అతడి ఎకానమీ 6 లోపే ఉంది. బుమ్రా బౌలింగ్​ను జాగ్రత్తగా ఆడుతున్న బ్యాటర్లు.. ఇతర బౌలర్లను అటాక్ చేయబోయి దొరికిపోతున్నారు. దీంతో కసి మీద ఉన్న పేసుగుర్రం తన కోపం మొత్తాన్ని ఆర్సీబీ మీద చూపించాడు. ఆ టీమ్​తో జరుగుతున్న మ్యాచ్​లో బుమ్రా తన విశ్వరూపం చూపించాడు. వికెట్ల మీద వికెట్లు తీస్తూ బెంగళూరు బ్యాటర్లను గడగడలాడించాడు. ఓపెనర్ విరాట్ కోహ్లీతో వికెట్ల వేటను మొదలుపెట్టాడు బుమ్రా. ఆ తర్వాత మరో నలుగురికి పెవిలియన్​ దారి చూపించాడు. ఈ మ్యాచ్​తో అతడు చరిత్ర సృష్టించాడు.

స్టార్ బ్యాటర్​ కోహ్లీ (3)ని మ్యాజికల్ డెలివరీతో బోల్తా కొట్టించిన బుమ్రా.. ఆ తర్వాత ఆసీబీ కెప్టెన్ ఫాఫ్​ డుప్లెసిస్ (61)​ను కూడా వెనక్కి పంపాడు. ఇన్నింగ్స్ ఆఖర్లో మహిపాల్ లోమ్రోర్ (0)​తో పాటు సౌరవ్ చౌహాన్ (9), వైఖాఖ్ విజయ్ కుమార్ (0)ను పెవిలియన్​కు పంపాడు. 5 వికెట్ హాల్​ను పూర్తి చేసుకున్నాడు బుమ్రా. అయితే ఈ మ్యాచ్​తో అతడో అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్​ హిస్టరీలో అత్యధిక సార్లు 3 వికెట్లు తీసిన బౌలర్​గా నిలిచాడు బుమ్రా.

క్యాష్ రిచ్ లీగ్​లో మూడు వికెట్లు తీయడం బుమ్రాకు ఇది 20వ సారి కావడం గమనార్హం. ఈ లిస్ట్​లో టాప్​లో ఉన్న లసిత్ మలింగ (19 సార్లు)ను అధిగమించాడు. ఈ మ్యాచ్​తో మరో రికార్డును కూడా బుమ్రా తన అకౌంట్​లో వేసుకున్నాడు. ఆర్సీబీ మీద 5 వికెట్లు తీసిన ఫస్ట్ బౌలర్​గా అతడు నిలిచాడు. ఓవరాల్​గా ఈ మ్యాచ్​లో 4 ఓవర్లు వేసిన బుమ్రా.. 21 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. మరి.. ఆర్సీబీపై బుమ్రా బౌలింగ్ వేసిన తీరు మీకు ఎలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Virat Kohli: సోషల్ మీడియాకు భయపడుతున్న కోహ్లీ! అసలు కింగ్​కు ఏమైంది?

Show comments