Nidhan
కోల్‌కతా నైట్ రైడర్స్ ఓపెనర్ సునీల్ నరైన్ మాస్ హిట్టింగ్తో చెలరేగిపోయాడు. రాజస్థాన్ బౌలర్లను అతడు ఊచకోత కోశాడు.
కోల్‌కతా నైట్ రైడర్స్ ఓపెనర్ సునీల్ నరైన్ మాస్ హిట్టింగ్తో చెలరేగిపోయాడు. రాజస్థాన్ బౌలర్లను అతడు ఊచకోత కోశాడు.
Nidhan
కోల్‌కతా నైట్ రైడర్స్ ఓపెనర్ సునీల్ నరైన్ మరోసారి చెలరేగిపోయాడు. రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో విశ్వరూపం చూపించాడు. 49 బంతుల్లోనే 100 పరుగుల మార్క్‌ను చేరుకున్నాడు. 29 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదిన నరైన్.. మిగిలిన 50 పరుగుల్ని అందుకోవడానికి 20 బంతులే తీసుకున్నాడు. 11 బౌండరీలు బాదిన ఈ కరీబియన్ వీరుడు.. 6 భారీ సిక్సులు కొట్టాడు. ఆకాశమే హద్దుగా బ్యాట్‌తో వీరంగం సృష్టించాడు. ముఖ్యంగా స్టార్ స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్‌ను టార్గెట్ చేసుకొని భారీ షాట్లు బాదాడు. ఇతడి దెబ్బకు వాళ్లిద్దరూ కలసి ఏకంగా 103 పరుగులు సమర్పించుకున్నారు. దీన్ని బట్టే నరైన్ విధ్వంసం ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు.
నరైన్‌కు తోడుగా అంగ్క్రిష్ రఘువంశీ కూడా అదరగొట్టాడు. 18 బంతుల్లోనే 30 పరుగులు చేశాడతను. పద్దెనిమిదేళ్ల రఘువంశీ బౌండరీలు మీద బౌండరీలు బాదుతూ రాజస్థాన్ బౌలర్లతో ఆటాడుకున్నాడు. ఒకవైపు అతడు చెలరేగుతుండటంతో మరోవైపు నరైన్ ఊచకోత కోయడం కంటిన్యూ చేశాడు. వీళ్లిద్దరి దెబ్బకు ఆర్ఆర్ బౌలర్ల గుడ్లు తేలేశారు. ఆ తర్వాత రఘువంశీ ఔటైనా నరైన్ మాత్రం ఆగలేదు. మరింత జోరు పెంచి సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. కాగా, అప్పట్లో కేకేఆర్‌కు ఓపెనర్‌గా వచ్చి రాణించాడు నరైన్. అలాంటోడ్ని మళ్లీ ఈ సీజన్లో అదే పొజిషన్లో ఆడిస్తున్నారు. దీన్ని యూజ్ చేసుకొని విధ్వంసక ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడుతున్నాడు నరైన్. దీనికి కేకేఆర్ కొత్త మెంటార్ గౌతం గంభీర్‌కు క్రెడిట్ ఇవ్వాల్సిందే. మరి.. నరైన్ మెరుపు సెంచరీపై మీ ఒపీనియన్‌ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
SUNIL NARINE WAS 79(44) AND THEN HE SMASHED:
1,6,4,6,4 and he completed his Maiden IPL and T20 Hundred – TAKE A BOW, NARINE. pic.twitter.com/yHVp9v9Fcx
— CricketMAN2 (@ImTanujSingh) April 16, 2024
MAIDEN T20 CENTURY BY SUNIL NARINE…!!!! 💥
One of the finest ever knocks for KKR – the GOAT of KKR has delivered with the bat. What a knock! 👏 pic.twitter.com/rHzqee51dN
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 16, 2024