Telugu Gilrls In USA: భారతీయులు.. అందులోనూ తెలుగోళ్ల పరువు తీశారు.. ఈ అమ్మాయిలు చేసిన పనికి..

భారతీయులు.. అందులోనూ తెలుగోళ్ల పరువు తీశారు.. ఈ అమ్మాయిలు చేసిన పనికి..

Telugu Gilrls In USA: చూడ్డానికి చక్కగా ఉన్నారు. బాగా చదువుకున్నారు. కానీ ఏం లాభం? పాడు బుద్ధి కారణంగా పరువు తీసుకున్నారు. వాళ్ళ పరువు మాత్రమే తీసుకోకుండా.. భారతీయుల పరువు అందులోనూ తెలుగోళ్ల పరువు తీసి పడేశారు.

Telugu Gilrls In USA: చూడ్డానికి చక్కగా ఉన్నారు. బాగా చదువుకున్నారు. కానీ ఏం లాభం? పాడు బుద్ధి కారణంగా పరువు తీసుకున్నారు. వాళ్ళ పరువు మాత్రమే తీసుకోకుండా.. భారతీయుల పరువు అందులోనూ తెలుగోళ్ల పరువు తీసి పడేశారు.

భారతదేశం.. అందులోనూ తెలుగోళ్ళకి విదేశాల్లో మంచి పేరు ఉంది. వీళ్ళు ఎక్కడున్నా బాగా బతుకుతారు. ఒకరి జోలికి వెళ్ళరు. కయ్యానికి కాలు దువ్వరు అన్న పేరు ఉంది. అక్కడక్కడా కొంతమంది చిల్లర పనులు చేసేవారు ఉంటారు. కానీ మెజారిటీ తెలుగోళ్లు ప్రపంచ దేశాల్లో ఏ మూలకు వెళ్లినా గానీ ఎవరినీ బాధపెట్టకుండా జీవిస్తుంటారు. అయితే ఇక్కడ మీరు చూస్తున్న ఈ అమ్మాయిలు మాత్రం అందుకు భిన్నం. బాగా చదువుకున్నారు. చదువుకున్న జ్ఞానం ఏమైపోయిందో మరి.. ఇదేం పాడు బుద్ధి అనేలా ప్రవర్తించారు. భారతీయుల పరువు అందులోనూ తెలుగోళ్ల పరువు తీశారు. తల్లిదండ్రులను తలదించుకునేలా చేశారు. అసలేం జరిగిందంటే?   

 ఉన్నత చదువుల కోసమని అమెరికా వెళ్లిన ఇద్దరు తెలుగు అమ్మాయిలు అక్కడ చేతివాటం చూపించారు. దీంతో అక్కడి పోలీసులు తమ చేతివాటం చూపించారు. ఓ ఇంగ్లీష్ పత్రిక ప్రచురించిన కథనం ప్రకారం.. డల్లాస్ లోని మాసీ మాల్ లో ఈ అమ్మాయిలిద్దరూ దొంగతనం చేశారు. హైదరాబాద్, గుంటూరుకి చెందిన ఈ అమ్మాయిలిద్దరూ ఉన్నత చదువుల కోసమని స్టడీ వీసా మీద అమెరికా వెళ్లారు. న్యూజెర్సీలో స్టీవెన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరారు. అయితే ఈ ఇద్దరిలో ఒక అమ్మాయి గతంలో పలు దొంగతనాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. గతంలో ఇలానే పలు దొంగతనాలు చేసి దొరికిపోయింది. పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆమె బతిమిలాడి బెయిల్ మీదకు బయటకు వచ్చింది. అయినా కూడా మారని ఆ అమ్మాయి మరో అమ్మాయితో కలిసి షాపింగ్ మాల్ లో దొంగతనం చేస్తూ దొరికిపోయింది.

ఇదే తరహాలో ఈఫిల్ ఏప్రిల్ నెలలో ఒక స్టోర్ లో ఇద్దరు తెలుగు యువతులు షాపింగ్ చేసిన అనంతరం బిల్లు చెల్లించకుండా పారిపోతుండగా పట్టుబడ్డారు. పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో.. దొంగిలించిన వస్తువులకు రెట్టింపు ధర చెల్లిస్తామని బతిమిలాడారు. మరలా ఇలా చేయమంటూ బతిమిలాడారు. ఆ వీడియో అప్పట్లో వైరల్  మరో ఇద్దరు అమ్మాయిలు దొంగతనం చేస్తూ దొరికిపోయారు. కాగా ఈ సంఘటనపై నెటిజన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనమేంటి.. మన దేశం ఏంటి? మీరు చేసే పనులేంటి? భారతదేశం పరువు తీస్తున్నారు.. అందులోనూ తెలుగోళ్ల పరువు తీస్తున్నారు అంటూ మండిపడుతున్నారు. అసలు వీళ్ళు లగ్జరీ లైఫ్ కి అలవాటు పడి దొంగతనాలు చేస్తున్నారా? లేక నిజంగానే అక్కడ పరిస్థితులు బాగోక ఇలా చేస్తున్నారా? అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 

Show comments