Kartik Purnima 2023 All About IT: కార్తీక పౌర్ణమికి దీపం వెలిగించాల్సింది భార్యా? భర్తా? శాస్త్రం ఏమి చెప్తోంది?

కార్తీక పౌర్ణమికి దీపం వెలిగించాల్సింది భార్యా? భర్తా? శాస్త్రం ఏమి చెప్తోంది?

కార్తీక పౌర్ణమిని పరమ పవిత్రమైన పర్వదినంగా భావిస్తారు. శివకేశవులకు ఇష్టమైన ఈ రోజు నాడు 365 వత్తులతో దీపం వెలిగిస్తారు. మరి ఇంతకు ఈ దీపాన్ని భార్య వెలిగించాలా.. భర్త వెలిగించాలా.. శాస్త్రాలు ఏం చెబుతున్నాయి అంటే..

కార్తీక పౌర్ణమిని పరమ పవిత్రమైన పర్వదినంగా భావిస్తారు. శివకేశవులకు ఇష్టమైన ఈ రోజు నాడు 365 వత్తులతో దీపం వెలిగిస్తారు. మరి ఇంతకు ఈ దీపాన్ని భార్య వెలిగించాలా.. భర్త వెలిగించాలా.. శాస్త్రాలు ఏం చెబుతున్నాయి అంటే..

హిందువులు అత్యంత పవిత్రంగా భావించే మాసం కార్తీకం. శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకంటాయి. శివ, కేశవుల నామ స్మరణతో ఆలయాలు మారుమోగిపోతాయి. ఇక ఈమాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంది. కార్తీక పూర్ణిమ నాడు శ్రీ మహా విష్ణువు మత్స్యావతారంలో నీటిలో నివసిస్తాడని చాలా మంది నమ్ముతారు. అందుకే ఈ పర్వదినం రోజున గంగా నదిలో లేదా ఇతర ప్రవహించే నదిలో స్నానం చేస్తారు. మరోవైపు ఇదే పూర్ణిమను త్రిపుర పూర్ణిమ అని కూడా అంటారు. ఇదే రోజునే శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడని పురాణాల్లో పేర్కొనబడింది.

ఇవన్నీ ఒక ఎత్తయింతే కార్తీక పౌర్ణమి రోజున దీపారాధన చేయడం వల్ల ఎంతో మంచి జరుగుతుందని.. యాగం చేసినంత ఫలితం లభిస్తుందని చాలా మంది విశ్వాసం. మిగత రోజుల్లో ఎలా ఉన్నా సరే.. చాలా మంది కార్తీక మాసంలో మాత్రం ప్రతి రోజు దీపారాధన చేస్తారు. మరి ఇంత పవిత్రంగా భావించే కార్తీక పౌర్ణమి ఈ ఏడాది ఎప్పుడు వచ్చిందింటే..

నవంబర్ 27వ తేదీన కార్తీక పౌర్ణమి శుభ సమయాలు ప్రారంభమవుతాయి. కార్తీక పౌర్ణమి తిథి నవంబర్ 26 మధ్యాహ్నం 3:53 నిమిషాలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అనగా 27 నవంబర్, సోమవారం మధ్యాహ్నం 2 : 45 నిమిషాలకు ముగుస్తుంది. ఇక కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులతో దీపం వేలిగిస్తారు.

365 వత్తులతో ఎందుకు దీపం వెలిగించాలంటే..

ఈ ఉరుకులపరుగుల జీవితంలో ప్రతి రోజు దేవుడికి దీపం పెట్టడం అందరికి సాధ్యం కాదు. అలాంటి వారు కార్తీక మాసంలో పౌర్ణమి రోజున 365 వత్తులు వెలిగించడం వల్ల సంవత్సరం అంతా దీపారాధన చేసినదానితో సమానం అని చెబుతున్నారు పెద్దలు. అందుకే కార్తీక పౌర్ణమి నాడు 365 వత్తులతో దీపం వెలిగిస్తారు.

దీపం ఎవరు వెలిగించాలంటే..

సాధారణంగా మన దగ్గర పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు అంటే.. అదంతా ఆడవారి భాధ్యత అని భావిస్తారు. కానీ వాస్తవంగా దీపం పెట్టాల్సింది ఇంటి యజమాని అంటే భర్త అని తెలిపారు ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు. శాస్త్రాల్లో కూడా దీపారాధన గురించి చెప్పేటప్పుడు ధర్మపత్ని సమేతస్యా అని చెప్పారని తెలిపారు. కనుక కార్తీక పౌర్ణమి నాడు.. ఇంటి యజమాని పంచె కట్టుకుని ఆలయానికి వెళ్లి.. ఆవునేతితో 365 వత్తుల గుత్తి దీపాన్ని వెలిగించాలి అని చెప్పారు. లేదంటే దోషం కలుగుతుంది అన్నారు.

Show comments