Krishna Kowshik
భార్య భర్తల మధ్య కోపతాపాలు సహజం. ఇవి కొన్ని సార్లు పీక్స్ స్టేజ్ కు వెళుతుంటాయి. చివరకు విడిపోవాలన్నంత వరకు అభిప్రాయ బేధాలు వస్తుంటాయి. ఇవే పిల్లల పాలిట శాపాలుగా మారుతున్నాయి.
భార్య భర్తల మధ్య కోపతాపాలు సహజం. ఇవి కొన్ని సార్లు పీక్స్ స్టేజ్ కు వెళుతుంటాయి. చివరకు విడిపోవాలన్నంత వరకు అభిప్రాయ బేధాలు వస్తుంటాయి. ఇవే పిల్లల పాలిట శాపాలుగా మారుతున్నాయి.
Krishna Kowshik
భార్యా భర్తల మధ్య గొడవలు వస్తే.. ముందుగా బలౌతుంది పిల్లలే. ఇంట్లో ఏ సమస్య వచ్చినా దంపతులిద్దరు మధ్య మాట మాట పెరిగి ఒకరినొకరు తిట్టుకోవడం, కొట్టుకోవడం చేస్తున్నారు. ఆ తర్వాత తమ కోపాన్ని అంతా పిల్లలపై ప్రదర్శిస్తూ ఉంటారు. వారిని ఇష్టమొచ్చినట్లుగా హింసిస్తుంటారు. ఒక్కోసారి ఈ గొడవల కారణంగా ప్రపంచం సరిగా చూడని చిన్నారులు సైతం ప్రాణాలు పోయిన ఘటనలు జరిగాయి. క్షణికావేశంలో భర్త కొట్టాడని భార్య, భార్య తిట్టిందని భర్త అనుచిత నిర్ణయాలు తీసుకుని.. వీరితో పాటు పిల్లల జీవితాలను కూడా కాలరాస్తున్నారు. తాజాగా భర్తతో గొడవలు అయ్యి సంసారం విడాకుల వరకు వెళ్లడంతో తీవ్ర మనో వేదనకు గురైన భార్య.. దారుణ నిర్ణయం తీసుకుంది.
భర్త విడాకుల కోసం కోర్టు మెట్టెక్కడంతో మనస్తాపానికి గురైన ఓ మహిళ.. తన ఇద్దరు పిల్లలతో కలిసి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన తమిళనాడులోని దిండుగల్‌లో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే.. దిండుగల్ జిల్లా తాడి కొంబు పరిధిలోని కామాక్షిపురం శక్తినగర్‌లో జీవిస్తున్నారు భార్య భర్తలు.. శ్రీనివాసన్,మేనక. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు హిందు మహావిని(16), తన్యశ్రీ(11) ఉన్నారు.ఈ ఇద్దరు పిల్లలు స్థానికంగా సీబీఎస్‌ఈ పాఠశాలలో పది, ఆరు తరగతులు చదువుతున్నారు. మహావిని ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తోంది. కాగా, కొద్ది రోజుల నుండి శ్రీనివాసన్, మేనక మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో తనకు విడాకులు కావాలంటూ కోర్టు మెట్టెక్కాడు. అయితే నందవనం రోడ్డులో తాను నడుపుతున్న టూ వీలర్ సర్వీస్ సెంటర్‌లో వాటర్ మోటార్ పనిచేయక పోవడంతో సోమవారం ఇంట్లో ఉన్న మోటారును తీసుకెళ్లేందుకు శ్రీనివాసన్ ప్రయత్నించాడు.
అయితే మేనకతో పాటు పిల్లలు మహా విని, తన్యశ్రీ తండ్రిని అడ్డుకున్నారు. శ్రీనివాసన్ చేసిన పనిపై మేనక మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సోమవారం సాయంత్రం అతడిని పోలీసులు పిలిపించి చీవాట్లు పెట్టారు. దీంతో కచ్చితంగా విడాకులు ఇచ్చేస్తానంటూ భార్యను బెదిరించాడు. ఇంట్లో ఉండకూడదని నిర్దారించుకున్న శ్రీనివాసన్.. అదే రోజు రాత్రి పోలీసు స్టేషన్ నుంచి బట్టలు తెచ్చుకునేందుకు అతడి ఇంటికి వెళ్లాడు. ఇంటి తలుపులు కొట్టినా తెరవకపోవడంతో ఇరుగు పొరుగు వారి సాయంతో కిటికి తలుపులు పగుల కొట్టి చూశారు. ఒక్కసారిగా షాక్ తిన్నాడు శ్రీనివాసన్. భార్య, ఇద్దరు కుమార్తెలు ఉరివేసుకుని కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు శ్రీనివాసన్‌ను విచారించగా తాను అప్పటి వరకు పోలీసు స్టేషన్‌లోనే ఉన్నట్లు చెప్పాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే భర్త విడాకులు ఇచ్చేందుకు సిద్ధం అవ్వడంతోనే మనస్తాపానికి గురై.. కన్న బిడ్డలతో సహా ఆమె ఇలా చేసిందని స్థానికులు చర్చించుకుంటున్నారు.