Today Gold&Silver Price 13th July 2023: పసిడి ప్రియులకు అలర్ట్‌.. నేడు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి!

పసిడి ప్రియులకు అలర్ట్‌.. నేడు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి!

బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగవు. అంతర్జాతీయ మార్కెట్‌లో తలెత్తే పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడ మన దగ్గర పసిడి రేటు మారుతుంటుంది. ఇక గత కొన్ని రోజులుగా గ్లోబల్‌ బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధర పెరిగినా.. మన దగ్గర మాత్రం దిగి రావడం విశేషం. ఈ వారం ప్రారంభం నుంచి మన దేశంలో బంగారం ధర తగ్గడం లేదా స్థిరంగా కొనసాగడం చేస్తోంది. వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. ప్రస్తుతం మన దగ్గర వివాహాల సీజన్‌ కాకపోవడంతో.. బంగారానికి డిమాండ్‌ పడిపోయింది. దానికి తగ్గట్లుగానే పసిడి రేటు పతనమవుతూ వస్తోంది. దాంతో చాలా మంది ఇప్పుడు బంగారం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరి నేడు దేశీయంగా, అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

నేడు గ్లోబల్‌ మార్కెట్‌లో బంగారం ధర భారీగా పెరిగింది. దానికి అనుకూలంగానే మన దగ్గర కూడా పసిడి రేటు స్వల్పంగా పైకి ఎగబాకింది. నేడు హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్‌ పుత్తడి 10 గ్రాముల ధర 200 రూపాయలు పెరిగింది. నేడు భాగ్యనగరంలో 22 క్యారెట్‌ 10 గ్రాముల బంగారం ధర 54,650 రూపాయలకు చేరుకుంది. అలానే 24 క్యారెట్‌ మేలిమి బంగారం ధర 10 గ్రాముల మీద 210 పెరిగి 59,620 రూపాయల వద్ద ట్రేడవుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధర పెరిగింది. హస్తినలో నేడు 22 క్యారెట్‌ బంగారం రేటు 10 గ్రాముల మీద 200 రూపాయలు పెరిగి.. 54,800 రూపాయలుగా ఉంది. అలానే 24 క్యారెట్‌ మేలిమి బంగారం ధర 59,770 రూపాయల వద్ద ట్రేడవుతోంది.

ఇక నేడు బంగారం ధర పెరిగితే.. అందుకు భిన్నంగా వెండి ధర మాత్రం పడిపోయింది. నేడు హైదరాబాద్‌లో కిలో వెండి రేటు రూ. 100 తగ్గి.. ప్రస్తుతం రూ. 77 వేలు పలుకుతోంది. హైదరాబాద్‌లో వెండి ధర దిగి వస్తే.. ఢిల్లీలో మాత్రం పెరిగింది. నేడు దేశ రాజధాని ఢిల్లీలో చూసుకుంటే కిలో వెండి ధర రూ. 200 పెరిగి ప్రస్తుతం రూ. 73,600 పలుకుతోంది. గ్లోబల్ మార్కెట్లో చూసుకుంటే బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే ఇవాళ గోల్డ్ రేటు 20 డాలర్ల పైనే పెరగడం గమనార్హం. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1958.35 డాలర్లకు చేరింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం సిల్వర్ రేటు ఔన్సుకు 24.16 డాలర్ల వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

Show comments