గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. నేడు ఎంతంటే?

Gold and Silver Rates: గత నెల బంగారం ధరలు తగ్గుముఖం పట్టినా.. మార్చి నెలలో ఆకాశమే హద్దుగా పెరుగుతూ వస్తుంది. గత పది రోజుల నుంచి ధరలు స్వల్పంగా పెరుగుతూ వస్తున్నాయి.

Gold and Silver Rates: గత నెల బంగారం ధరలు తగ్గుముఖం పట్టినా.. మార్చి నెలలో ఆకాశమే హద్దుగా పెరుగుతూ వస్తుంది. గత పది రోజుల నుంచి ధరలు స్వల్పంగా పెరుగుతూ వస్తున్నాయి.

బంగారం ఎంతో విలువైన వస్తువు.. అందుకే దీనికి ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉంది. దేశంలో కొంత కాలంగా బంగారం కొనుగోలు బాగా పెరిగిపోయింది. దీంతో డిమాండ్ కూడా అదే స్థాయిలో పెరిగిపోయింది. అంతర్జాతీయ మార్కెట్ లో తరుచూ మార్పులు జరుగుతున్నాయి.. దాని ప్రభావం పసిడి, వెండిపై పడుతుంది. ఈ కారణంతోనే బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయి. జనవరి, ఫిబ్రవరిలో బంగారం ధరలు కాస్త తగ్గాయి. కానీ మార్చి నాటికి మళ్లి ధరలు ఊపందుకున్నాయి. దీంతో పసిడి కొనుగోలుదారులు మళ్లీ ఆలోచనలో పడ్డారు. నేడు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మార్చి నెల నుంచి ఆకాశమే హద్దుగా పెరుగుతూ వెళ్లిన పసిడి ధర.. ఈ వారం కాస్త తగ్గుముఖం పట్టింది. గురువారం మళ్లీ పెరిగిన ధర శుక్రవారం స్థిరంగా కొనసాగుతూ వచ్చిది. శనివారం పసిడి ధర స్వల్పంగా తగ్గింది. సమ్మర్ సీజన్ లో పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలు ఉండటంతో మహిళలు జ్యులరీ షాపులకు క్యూ కడుతున్నారు. తమకు నచ్చిన ఆభరణాలు కొనుగోలు చేస్తున్నారు. కానీ పెరిగిపోతున్న పసిడి ధరలు చూసి బెంబేలెత్తిపోతున్నారు. గత ఏడాది 10 గ్రాముల బంగారం రూ.60 వేల మార్క్ దాటితే.. ఈ ఏడాది రూ.65 వేల మార్క్ దాటింది. తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖ లో నేటి గోల్డ్ రేటు ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,590 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,100 వద్ద కొనసాగుతుంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.79,900 వద్ద కొనసాగుతుంది.

ఇక ప్రధాన నగరాల్లో నేటి ధరలు ఎలా ఉన్నాయంటే.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 60,740 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,250 వద్ద కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై, బెంగుళూరు, కోల్‌కొతా, కేరళాలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.60,590 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.66,100 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,240ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,810 వద్ద కొనసాగుతుంది. బెంగుళూరు లో కిలో వెండి ధర రూ.76,100, ముంబై, కోల్‌కొతాలో కిలో వెండి ధర రూ.76,900 వద్ద ట్రెండ్ అవుతుంది. చెన్నై కిలో వెండి ధర రూ. 79,900లు ఉండగా, ఢిల్లీ లో రూ.76,900 వద్ద ట్రెండ్ అవుతుంది.

Show comments