Gold and Silver Prices: మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు ఎంతంటే?

మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు ఎంతంటే?

గత పదిరోజులుగా పసిడి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఏకంగా రూ.1400 మేర పెరిగాయి. ప్రస్తుతం దేశంలో పెళ్లిళ్ల సీజన్ కావడంతో గోల్డ్ కి విపరీతమైన డిమాండ్ ఏర్పడుతుంది.

గత పదిరోజులుగా పసిడి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఏకంగా రూ.1400 మేర పెరిగాయి. ప్రస్తుతం దేశంలో పెళ్లిళ్ల సీజన్ కావడంతో గోల్డ్ కి విపరీతమైన డిమాండ్ ఏర్పడుతుంది.

దేశంలో బంగారం అంటే ప్రతి ఒక్కరో ఎంతగా ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. దీంతో రోజు రోజుకీ పసిడి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో వస్తున్న మార్పుల కారణంగా బంగారం ధరల్లో తరుచూ మార్పులు వస్తున్నాయి. వరుసగా పెరిగిన బంగారం ధరలు చూసి వినియోగదారులు కొనుగోలు చేసేందుకు సందిగ్ధంలో పడిపోయారు. పదిరోజుల్లోనే ఏకంగా రూ.1400 మేర పెరిగింది. దీనితోపాటు వెండి ధరలు కూడా ఆకాశాన్నంటిపోయాయి. 10 రోజులుగా దూసుకుపోతున్న పసిడి ధరలకు శనివారం కాస్త బ్రేక్ పడింది. నిన్నటితో పోల్చుకుంటే బంగారం ధరలు తగ్గినట్లు తెలుస్తుంది. నేడు మార్కెట్ లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

దేశంలో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది. జనవరిలో సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. గత రెండు నెలల నుంచి పసిడి ధరలు పెరుగుతూ వచ్చాయి. 24 క్యారెట్ బంగారం ధర రూ.63 వేలు దాటింది. ఇదిలా ఉంటే.. గడిచిన పదిరోజులుగా పెరిగిన పసిడి ధరలు శనివారం కాస్త శాంతించాయి. నిన్నటితో పోల్చుకుంటే.. 22క్యారెట్ గోల్డ్ రేట్ ధరపై రూ.350 తగ్గగా, 24 క్యారెట్ గోల్డ్ పై రూ.380 వరకు తగ్గాయి. ఇదే బాటలో వెండి ధరలు కూడా తగ్గాయి.. కిలో వెండి ధర రూ.1200 వరకు తగ్గింది. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ఎలా ఉన్నాయంటే.. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,550 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,870కి చేరింది. ఇక కిలో వెండి ధర రూ. 79,200 వద్ద కొనసాగుతుంది.

దేశంలోని ప్రధాన నగరాలు అయిన ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,700 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ..63,970 వద్ద కొనసాగుతుంది. ముంబై, బెంగుళూరు, కోల్‌కొతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.58,550 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,870 వద్ద ట్రెండ్ అవుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.59,100 ఉండగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ.64,470 వద్ద కొనసాగుతుంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కొతాలో కిలో వెండి ధర రూ.78,300 కు చేరింది. బెంగుళూరులో రూ.76,000 ఉండగా, చెన్నైలో కిలో వెండి ధర రూ. 79,700 వద్ద ట్రెండ్ అవుతుంది. ధరలు తగ్గినపుడు గోల్డ్ కొనుగోలు చేస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Show comments