మహిళలకు గోల్డెన్ ఆఫర్.. తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు ఎంతంటే?

Gold and Silver Rates: ఇటీవల బంగారం ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. ఒకదశలో బంగారం కొనగలమా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. కొన్నిసార్లు అమాంతం ధరలు తగ్గిపోతున్నాయి. దీంతో కొనుగోలుదారులు కన్ఫ్యూజన్ లో పడిపోతున్నారు. ధరలు తగ్గినపుడే పసిడి కొంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Gold and Silver Rates: ఇటీవల బంగారం ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. ఒకదశలో బంగారం కొనగలమా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. కొన్నిసార్లు అమాంతం ధరలు తగ్గిపోతున్నాయి. దీంతో కొనుగోలుదారులు కన్ఫ్యూజన్ లో పడిపోతున్నారు. ధరలు తగ్గినపుడే పసిడి కొంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

గత నెల నుంచి జులై మొదటి రెండు వారాలు బంగారం ధరలు పెరుగుతూ వచ్చాయి. అనూహ్యంగా గత మూడు నాలుగు రోజుల నుంచి పసిడి, వెండి ధరలు అమాంతం తగ్గుతూ వచ్చాయి. ధరలు చూసి పసిడి కొనాలని వెనుకంజ వేసిన వారికి ఇది గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పొచ్చు. మూడు రోజుల వ్యవధిలో ఏకంగా 1000 రూపాల మేర దిగివచ్చింది. వెండి పై ఏకంగా రూ.4000 వేలకు పైగా ధరలు దిగివచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణామాలు పసిడి, వెండి ధరలపై పడుతున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో పసిడి కొనుగోలు చేస్తే చాలా బెటర్ అని అంటున్నారు. నేడు మార్కెట్ లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. వివరాల్లోకి వెళితే..

బంగారం కొనుగోలు చేసేవారికి గోల్డెన్ ఆఫర్.. ఈ ఛాన్స్ అస్సులు మిస్ కావొద్దని అంటున్నారు నిపుణులు.ప్రపంచంలో అత్యంత విలువైన లోహం బంగారం, అందుకే మహిళలు, పురుషులు దీన్ని ఎంతగానో ఇష్టపతారు. ఇక దేశంలో పండుగలు, పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలకు ఖచ్చితంగా పసిడి కొనుగోలు చేస్తుంటారు. గత వారం రోజులగా భారీగా పెరిగిన పసిడి ధరలు మూడు రోజులుగా పతనమవుతూ వచ్చాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి పై రూ.10 తగ్గి, రూ.67,790 వద్ద కొనసాగుతుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ.10 తగ్గి, రూ.73,960 వద్ద కొనసాగుతుంది. ఇక తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.67,790 గా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.73,960 వద్ద కొనసాగుతుంది.

ఇక దేశంలోని ముఖ్య నగరాల్లో ధరల చూస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.67,940 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.74,110 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,340 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.74,560 వద్ద కొనసాగుతుంది. ముంబై, కోల్‌కొతా, కేరళా, బెంగుళూరు లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,790 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.73,960 వద్ద కొనసాగుతుంది. దేశంలో కిలో వెండి పై రూ.100 తగ్గింది. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ.95,900, ఢిల్లీ,ముంబై, కోల్ కొతా లో కిలో వెండి ధర రూ.91,400గా,బెంగుళూరులో రూ.91,650 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో కిలో వెండి ధర.95,900 వద్ద కొనసాగుతుంది.

గమనిక : పేన తెలిపిన పసిడి, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి.. కొనుగోలుదారులు అప్పటి ధరలు పరిశీలించి కొనుగోలు చేయ సూచన.

Show comments