Gold&Silver Price On July 16th 2023: పసిడి పరుగుకు బ్రేకులు.. నేడు తులం రేటు ఎంతంటే!

పసిడి పరుగుకు బ్రేకులు.. నేడు తులం రేటు ఎంతంటే!

ఈ ఏడాది బంగారం ధర ఆల్‌ టైం గరిష్టానికి చేరుకున్న సంగతి తెలిసిందే. 24 క్యారెట్‌ బంగారం ధర తులం 60 వేలకకు చేరుకుని.. ఆ తర్వాత నెమ్మదిగా దిగి వచ్చింది. ఈ న ఎల ఆరంభం నుంచి బంగారం ధర తగ్గుతూనే ఉంది. ఆషాఢమాసం కావడం..

ఈ ఏడాది బంగారం ధర ఆల్‌ టైం గరిష్టానికి చేరుకున్న సంగతి తెలిసిందే. 24 క్యారెట్‌ బంగారం ధర తులం 60 వేలకకు చేరుకుని.. ఆ తర్వాత నెమ్మదిగా దిగి వచ్చింది. ఈ న ఎల ఆరంభం నుంచి బంగారం ధర తగ్గుతూనే ఉంది. ఆషాఢమాసం కావడం..

బంగారం ధర ఎప్పుడు ఎలా ఉంటుందో అంచనా వేయలేకపోతున్నాం. కొన్ని రోజుల పాటు తగ్గిన ధర.. ఆ వెంటనే భారీగా పెరుగుతూ షాక్‌ ఇస్తోంది. ఈ ఏడాది బంగారం ధర ఆల్‌ టైం గరిష్టానికి చేరుకున్న సంగతి తెలిసిందే. 24 క్యారెట్‌ బంగారం ధర తులం 60 వేలకకు చేరుకుని.. ఆ తర్వాత నెమ్మదిగా దిగి వచ్చింది. ఈ న ఎల ఆరంభం నుంచి బంగారం ధర తగ్గుతూనే ఉంది. ఆషాఢమాసం కావడం.. శుభకార్యాలు లేకపోవడంతో పసిడికి గిరాకీ తగ్గింది. దాంతో జూలై ఆరంభం నుంచి తగ్గుతూ వచ్చిన పసిడి రేటు.. గత నాలుగు రోజుల నుంచి పెరుగుతోంది. తులం బంగారం ధర ఈ నెలలో మళ్లీ 60 వేల రూపాయలు దాటిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు బంగారం ధర ఎంత ఉంది అంటే..

నేడు ఢిల్లీ, హైదరాబాద్‌లో మార్కెట్‌లో బంగారం ధర ఎంత ఉంది అంటే.. నేడు భాగ్యనగరం బులియన్‌ మార్కెట్లో చూసుకుంటే బంగారం ధరలు ఆదివారం స్థిరంగా కొనసాగుతున్నాయి. శనివారం రోజున 24 క్యారెట్‌ 10 గ్రాముల ధర రూ. 60 వేలు మార్క్‌కి చేరిన విషయం తెలిసిందే. నేడు అనగా ఆదివారం కూడా అదే ధర కొనసాగింది. నేడు హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో 24 క్యారెట్‌ మేలిమి బంగారం ధర 60 వేల రూపాయలుగా ఉంది. అలానే 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాముల ధర ప్రస్తుతం రూ. 55 వేలు పలుకుతోంది. అలానే దేశ రాజధాని ఢిల్లీలో చూసుకుంటే ఆదివారం 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 55,150 వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 60, 150 గా ఉంది.

మళ్లీ పెరిగిన వెండి ధర..

బంగారం ధరలు రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతూ కాస్త ఊరట కలిగించినా.. వెండి రేటు మాత్రం పెరుగుతూనే ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో చూసుకుంటే గత నాలుగు రోజుల్లో కిలో వెండి ధర రూ. 4000 మేర పెరిగింది. ఇక నేడు అనగా ఆదివారం కూడా వెండి ధర పెరిగింది. ఇవాళ సిల్వర్‌ రేటు కిలో మీద రూ. 400 పెరిగి ప్రస్తుతం కిలో రేటు రూ. 77,500 మార్క్ దాటింది. ఇక హైదరాబాద్ మార్కెట్లో కూడా గత నాలుగు రోజుల నుంచి వెండి ధర విపరీతంగా పెరుగుతుంది. గడిచిన నాలుగు రోజుల్లో హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో చూసుకుంటే కిలో రేటు ఏకంగా రూ. 4,800 పెరిగింది. ప్రస్తుతం భాగ్యనగరంలో కిలో వెండి ధర రూ. 81,800 పలుకుతోంది. ఢిల్లీతో పోలిస్తే హైదరాబాద్‌లో వెండి రేటులో చాలా తేడా ఉంటుంది. అందుకు స్థానికంగా ఉన్న పన్నులే కారణం.

Show comments