Today Gold And Silver Price: పసిడి ప్రియులకు అలర్ట్‌.. నేడు బంగారం ధర ఎంత ఉందంటే!

పసిడి ప్రియులకు అలర్ట్‌.. నేడు బంగారం ధర ఎంత ఉందంటే:

ప్రపంచ దేశాల సంగతి ఏమో గాని.. మన దేశంలో మాత్రం.. బంగారానికి ఎప్పటికి డిమాండ్‌ తగ్గదు. ధర ఎంత పెరిగినా సరే జనాలు పసిడి కొనుగోలు మాత్రం ఆపరు. అయితే మన దేశంలో డిమాండ్‌కు సరిపడా బంగారం ఉత్పత్తి లేదు. దాంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. అందుకే మన దగ్గర పసిడి ధర చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ ఏడాది పసిడి ధర ఇప్పటికే రెండు సార్లు.. గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ నెల ఆరంభం నుంచి వరుసగా తగ్గుతూ వస్తోన్న పసిడి రేటు.. ఒక్కసారిగా పెరిగి.. 10 గ్రాముల ధర ఏకంగా 60 వేల రూపాయలకు చేరుకుంది. అలానే 22 క్యారెట్‌ బంగారం 10 గ్రాముల ధర 55 వేల రూపాయలకు చేరుకుంది. క్రితం సెషన్‌లో వరుసగా రెండు రోజులు తగ్గిన బంగారం ధర నేడు కూడా అదే బాటలో పయనిస్తోంది. మరి హైదరాబాద్‌, ఢిల్లీలో బంగారం, వెండి ధర ఎంత ఉందంటే..

అంతర్జాతీయ బులియన్‌ మార్కెట్‌లో సైతం బంగారం ధరలు పైపైకి పోతున్నాయి. దానికి తగ్గట్టే మన దగ్గర కూడా పసిడి రేటు పైపైకి ఎగబాకుతోంది. అయితే గత మూడు రోజులుగా బంగారం ధర స్థిరంగా ఉంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి రేటు గత మూడు రోజులుగా స్థిరంగా కొనసాగుతుంది. నేడు భాగ్యనగరంలో 22 క్యారెట్‌ బంగారం 10 గ్రాముల ధర స్థిరంగా రూ. 55 వేలు పలుకుతోంది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన పుత్తడి రేటు 10 గ్రాముల ధర రూ. 60 వేల వద్ద ట్రేడవుతోంది. అలానే దేశ రాజధాని ఢిల్లీ బులియన్ మార్కెట్లో సైతం పసిడి ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. 22 క్యారెట్‌ గోల్డ్ రేటు 10 గ్రాముల ధర ప్రస్తుతం రూ. 55,150 వద్ద ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 60,150 వద్ద ట్రేడవుతోంది

బంగారం బాటలోనే వెండి ధర..

వెండి ధర కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. గత వారంలో వెండి ధర కిలో మీద వేల రూపాయల్లో పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో వెండి ధర గత మూడు రోజుల్లోనే ఏకంగా కిలో మీద రూ. 4,800 మేర పెరిగింది. క్రితం సెషన్‌లో కూడా వెండి ధర పెరగ్గా నేడు మాత్రం స్థిరంగా ఉంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 81,800 మార్క్ వద్ద కొనసాగుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో వెండి ధర ఇవాళ స్థిరంగా ఉంది. అయితే, గత నాలుగు రోజుల్లో చూసుకుంటే వెండి ధర కిలో మీద ఏకంగా రూ.4,100 పెరిగింది. ప్రస్తుతం ఢిల్లీలో కిలో వెండి రేటు రూ. 77,500 వద్ద ట్రేడవుతోంది.

Show comments