పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా దిగి వచ్చిన వెండి, బంగారం ధర!

పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా దిగి వచ్చిన వెండి, బంగారం ధర!

గత కొన్ని రోజులుగా బంగారం ధర చుక్కలను తాకుతుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర దిగి వచ్చినా.. మన దగ్గర మాత్రం బంగారం రేటు దిగి రాలేదు. ఇక వెండి ధర గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అన్నట్లు ఉన్నాయి పరిస్థితులు. అన్‌ సీజన్‌లో కూడా బంగారం ధర దిగి రాకపోవడంతో పసిడి కొనుగోలు చేయాలనుకునేవారు వెనకడుగు వేస్తున్నారు. ఇక త్వరలోనే వివాహాల సీజన్‌ ప్రారంభం అవుతుండటంతో.. బంగారం ధర భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. పెరుగుతూ పోతున్న బంగారం ధరలకు నేడు బ్రేక్‌ పడింది. ఇవాళ దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు కుప్పకూలాయి. అంతర్జాతీయ కమోడిటి మార్కెట్లో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ వైపు మొగ్గు చూపడంతో శనివారం నాడు బంగారం రేటు దిగి వచ్చింది. మరి నేడు మన దగ్గర బంగారం, వెండి రేటు ఎంత దిగి వచ్చింది.. అంటే..

హైదరాబాద్‌లో క్రితం రెండు సెషన్లలో సుమారు 450 రూపాయలు దిగి వచ్చిన బంగారం ధర.. నేడు ఒక్కసారిగా కుప్పకూలింది. నేడు హైదరాబాద్‌ బులియన్ మార్కెట్లో చూసుకుంటే నగల తయారీకి వినియోగించే 22 క్యారెట్ బంగారం 10 గ్రాముల మీద రూ. 350 దిగివచ్చింది. నేడు భాగ్యనగరంలో 22 క్యారెట్‌ గోల్డ్‌ 10 గ్రాముల ధర రూ. 55,100 కు పడిపోయింది. ఇక 24 క్యారెట్‌ మేలిమి బంగారం రేటు 10 గ్రాముల మీద రూ. 380 తగ్గి ప్రస్తుతం రూ. 60,110 వద్ద ఉంది. ఇక దేశరాజధాని ఢిల్లీ మార్కెట్లో చూసుకుంటే 22 క్యారెట్‌ గోల్డ్ రేటు 10 గ్రాముల మీద రూ. 350 తగ్గి రూ. 55, 250 వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్‌ స్వచ్ఛమైన గోల్డ్ రేటు 10 గ్రాముల మీద రూ. 380 పడిపోయి రూ. 60, 260కి దిగివచ్చింది.

2 వేల రూపాయలు తగ్గిన వెండి ధర..

నేడు సిల్వర్‌ రేటు గరిష్ట స్థాయిలో పడిపోయింది. శనివారం ఒక్క రోజే హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వెండి రేటు కిలో మీద ఏకంగా 2 వేల రూపాయలు తగ్గింది. సిల్వర్‌ ధర ఒక్క రోజే రూ. 2 వేలు దిగి రావడంతో.. జనాలు వెంవడి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో రేటు 2000 రూపాయలు పడిపోయి.. రూ.79,500 వద్ద ట్రేడవుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా సిల్వర్‌ రేటు కిలో మీద రూ. 2000 పడిపోయి ప్రస్తుతం రూ. 76,400లకు దిగివచ్చింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో నేడు బంగారం ధరలు భారీగా వచ్చాయి. ప్రస్తుతం ఇంటర్నేషనల్‌ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1959.85 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 24.36 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

Show comments