కేంద్రం గుడ్ న్యూస్.. మహిళల ఖాతాల్లోకి రూ.50 వేలు..!

మహిళా సాధికారితే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను తీసుకు వస్తుంది. తాజాగా మరో పథకాన్ని తీసుకు వచ్చింది. మహిళలు స్వయం ఉపాధి పొందేలా ఈ స్కీం అమలు చేస్తుంది. ఇంతకు అది ఏంటంటే..?

మహిళా సాధికారితే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను తీసుకు వస్తుంది. తాజాగా మరో పథకాన్ని తీసుకు వచ్చింది. మహిళలు స్వయం ఉపాధి పొందేలా ఈ స్కీం అమలు చేస్తుంది. ఇంతకు అది ఏంటంటే..?

నేటి కాలంలో పురుషులతో సమానంగా మహిళలు వివిధ రంగాల్లో దూసుకెళుతున్నారు. తమ కాళ్ల మీద తాము నిలబడుతూ.. ఆర్థికంగా ఫ్యామిలీకి సపోర్టుగా నిలుస్తున్నారు. ఒక వైపు ఉద్యోగం లేదా ఏదో ఒక వర్క్ చేస్తూనే.. మరో వైపు ఇంటిని చక్కదిద్దుకుంటున్నారు. ప్రతి కుటుంబానికి మహిళ డెసిషన్ మేకర్‌గా మారిపోయింది. దీంతో సమాజంలో స్త్రీ పాత్ర కీలకంగా మారింది. ఈ క్రమంలో మహిళా సాధికారికతే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నాయి. ఇటువంటి పథకాలను ప్రజలకు చేరవేయడంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది. ఇందులో భాగంగానే సెంట్రల్ గవర్నమెంట్ మరో పథకాన్ని తీసుకువచ్చింది. వెనుకబడిన వర్గాల మహిళలకు ఆర్థిక సాయాన్ని అందించేందుకు ఓ స్కీం ప్రవేశపెట్టింది. అదే ప్రధాన మంత్రి అనుశుచిత్ జాతి అభ్యుదయ్ యోజన ((PM-AJAY).

ఈ పథకాన్ని ప్రధాన మంత్రి అజయ్ యోజన అని కూడా పిలుస్తారు. వెనుకబడిన తరగతుల మహిళలను ఆదుకునేందుకు రెండేళ్ల క్రితం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఎస్సీ,ఎస్టీ మహిళలకు సహాయం చేయాలనే లక్ష్యంతో ఈ పథకం 2021-22 సంవత్సరంలో అమలు చేసింది మోదీ సర్కార్.  ఈ పథకం ద్వారా  మహిళలకు రూ. 50 వేల వరకు ఆర్థిక సహాయం అందుతుంది. మహిళా స్వయం ఉపాధిని ఏర్పరుచుకుని, కుటుంబానికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తుందన్న ఉద్దేశంతో ఈ స్కీం తీసుకు వచ్చింది.  ఇందులో మరో విశేషమేమిటంటే.. సబ్సిడీ కూడా వర్తిస్తుంది.  దీనికి 50 శాతం వరకు సబ్సిడీ కూడా ఉంటుంది. అంటే ఓ మహిళ లక్ష రూపాయలు రుణం పొందితే.. రూ. 50 వేలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. మిగిలినది సబ్సిడీ కిందకు వర్తిస్తుంది. అంటే 50 వేలు తిరిగి కట్టనక్కర్లేదు, దీనికి వడ్డీ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.

అలాగే ఈ పథకం కింద రూ. 3 లక్షల వరకు రుణాలు అందజేస్తుంది. అయితే ఆ మహిళలు డ్వాక్రాలో సభ్యులే ఉండాలి. డ్వాక్రా ఉన్న మహిళకు ఈ రుణం పొందే వెసులు బాటు ఉంది. వార్షిక ఆదాయం 2.50 లక్షలు ఉన్న అభ్యర్థులకు ఈ పథకంలో ప్రాధాన్యత ఉంటుంది. మరీ ఎలా దరఖాస్తు  చేసుకోవచ్చు అంటే..  అర్హత ఉన్న మహిళలు తమ స్థానిక డ్వాక్రా గ్రూప్ లీడర్ లేదా CC ని సంప్రదించి ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. షెడ్యూల్డ్ కులాలకు చెందిన ఆసక్తిగల అభ్యర్థులు పబ్లిక్ ఫెసిలిటేషన్ సెంటర్ లేదా కామన్ సర్వీస్ సెంటర్‌ను సందర్శించి, PM-AJAY యోజన పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఈ పథకం కింద జాబితా చేయబడిన కులాలకు చెందిన లబ్ధిదారులు వ్యవసాయం, ఉద్యానవనం, పశుపోషణ, ఫుడ్ ప్రాసెసింగ్, మత్స్య,  చేనేత, హస్తకళలు మొదలైన వాటిలో ఉపాధి పొందవచ్చు. మరెందుకు ఆలస్యం..దరఖాస్తు చేసుకునేందుకు మీ డ్వాక్రా గ్రూప్ లీడర్‪ను సంప్రదించండి.

 

Show comments