PPF Alerts: PPF ఖాతాదారులకు అలర్ట్.. 2 రోజులే అవకాశం.. మిస్ అయితే భారీగా నష్టపోతారు!

PPF ఖాతాదారులకు అలర్ట్.. 2 రోజులే అవకాశం.. మిస్ అయితే భారీగా నష్టపోతారు!

దీర్ఘకాలంలో భారీ మొత్తంలో లాభాలు రావాలని భావించే వారు పీపీఎఫ్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే వారికి కీలక అలర్ట్.. రెండు రోజుల్లో ఇలా చేయకపోతే భారీ నష్టం. ఏంటి అంటే..

దీర్ఘకాలంలో భారీ మొత్తంలో లాభాలు రావాలని భావించే వారు పీపీఎఫ్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే వారికి కీలక అలర్ట్.. రెండు రోజుల్లో ఇలా చేయకపోతే భారీ నష్టం. ఏంటి అంటే..

పొదుపు చేయాలనుకు వారికి అందుబాటులో ఉన్న అత్యుత్తమ మార్గాల్లో ఒకటి పబ్లిక్ ప్రావిండెంట్ ఫండ్. ఇది ఒక దీర్ఘకాలిక పెట్టుబడి మార్గం. దీనిలో ఇన్వెస్ట్ చేస్తే.. భారీ ఆదాయంతో పాటు పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. అయితే అందుకు కొన్ని షరతులు పాటించాలి. ఇక అదలా ఉంచితే పీపీఎఫ్ పెట్టుబడిదారులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉందని.. ఈలోపు ముఖ్యమైన పని పూర్తి చేయకపోతే భారీగా నష్టపోతారని హెచ్చరిస్తున్నారు. ఇంతకు ఏంటా పని అంటే..

పీపీఎఫ్ పెట్టుబడి దారులు ఈ ఆర్థిక ఏడాది 2024-25కి సంబంధించిన కంట్రిబ్యూషన్‌ ఏప్రిల్ 5 లోపు డిపాజిట్ చేయాల్సి ఉంది. అంటే నేడు, రేపు రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. గడువు ముగిసిన తర్వాత కంట్రిబ్యూషన్ చేయకూడదా అంటే చేయవచ్చు.. కాకపోతే భారీగా నష్టపోవాల్సి వస్తుంది అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. ఈ ఆర్థిక ఏడాదికి సంబంధించిన ప్రీమియంను పీపీఎఫ్ ఖాతాలో ఏప్రిల్ 5వ తేదీ తర్వాత జమ చేస్తే మీరు తక్కువ వడ్డీ పొందుతారు. ఫలితంగా మీ ఆదాయం తగ్గుతుంది అంటున్నారు.

పీపీఎఫ్ పథకం నిబంధనల ప్రకారం.. ప్రతి నెల 5వ తేదీ నుంచి నెల ఆఖరు రోజు వరకు ఉన్న కనిష్ఠ బ్యాలెన్స్ ను లెక్కలోకి తీసుకుని వడ్డీని లెక్కిస్తారు. పెద్ద మొత్తంలో ఒకేసారి పీపీఎఫ్ ఖాతాలో ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే.. వారు ఏప్రిల్ 5 లోపు తమ కంట్రిబ్యూషన్ డిపాజిట్ చేస్తే మంచిది. అప్పుడే వారికి ఎక్కువ వడ్డీ లభిస్తుంది అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. అంటే పెద్ద మొత్తంలో డిపాజిట్ చేసే వారు ప్రతి ఏటా ఏప్రిల్ 5వ తేదీలోపు చేయాలి. దీని ద్వారా మీరు జమ చేసిన డబ్బులు వడ్డీ లెక్కలోకి వస్తాయి. దీనిని అర్థం చేసుకోవడానికి ఈ కింద ఉదాహరణను చూడండి..

పీపీఎఫ్ ఖాతాలో ఏప్రిల్ 4 వ తేదీ లోపు ఒక వ్యక్తి రూ.1.5 లక్షలు జమ చేశాడు అనుకుందాం. దీంతో ఆ డిపాజిట్ ఏప్రిల్ 5వ తేదీలోపు చేసినట్లు అవుతుంది. అంటే ఆ అకౌంట్లో ఏప్రిల్ 5 నుంచి నుంచి నెలాఖరు వరకు ఉన్న కనిష్ఠ బ్యాలెన్స్ రూ.1.5 లక్షలు అవుతుంది. దీంతో ఈ మొత్తం నగదు వడ్డీ లెక్కలోకి వస్తుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పీపీఎఫ్ ఖాతాపై 7.1 శాతం వడ్డీ అందిస్తోంది. దీని ప్రకారం చూసుకుంటే.. రూ.1.5 లక్ష డిపాజిట్ పై ఏడాదికి రూ.10,050 వడ్డీ లభిస్తుంది.

అదే మీరు ఏప్రిల్ 5 తర్వాత రూ.1.5 లక్షలు డిపాజిట్ చేశారు అనుకుందాం. అప్పుడు మీ ఖాతాలో కనిష్ఠ బ్యాలెన్స్ జీరోగా ఉంటుంది. ఈ కారణంగా రూ.1.5 లక్షల డిపాజిట్ పై మొదటి నెల వడ్డీ కోల్పోవాల్సి వస్తుంది. ఆ డిపాజిట్ పై 11 నెల వడ్డీ మాత్రమే లభిస్తుంది.

ఏప్రిల్ 5 తర్వాత రూ.1.5 లక్షలు డిపాజిట్ చేసిన వారికి కేవలం రూ.9,762.50 వడ్డీ మాత్రమే వస్తుంది. అంటే ఒకనెల ఇంట్రెస్ట్ లాస్ అవుతారు అన్నమాట. అంతేకాక ఏప్రిల్ 5 వ తేదీలోపు డిపాజిట్ చేస్తే ట్యాక్స్ బెనిఫిట్స్ సైతం లభిస్తాయి. లేదంటే వాటిని కూడా వదులుకోవాల్సి వస్తుంది అంటున్నారు. కనుక అధిక మొత్తంలో డిపాజిట్ చేసే వారు ఈ రెండు రోజుల్లో డిపాజిట్ చేస్తే మంచిది అంటున్నారు.

Show comments