Venkateswarlu
Venkateswarlu
రిస్క్ జోలికి పోకుండా పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి పోస్టుఫీసును మించింది లేదు. పోస్టుఫీస్ స్కీముల్లో డబ్బులు దాచుకోవటం ద్వారా మన డబ్బులు సురక్షితంగా ఉండటమే కాదు.. మంచి లాభాలను పొందవచ్చు. అలా తక్కువ రిస్క్‌తో.. ఎక్కువ రిటర్న్స్‌ను ఇచ్చే పోస్టాఫీస్ స్కీముల్లో ‘‘ గ్రామ్ సురక్ష స్కీము’’ కూడా ఒకటి. ఈ స్కీము ద్వారా అద్భుతమైన లాభాల్ని పొందవచ్చు. రిస్క్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ స్కీములో జాయిన్ అయి రోజుకు 50 రూపాయలు పొదుపు చేయటం ద్వారా ఒకేసారి 31 నుంచి 35 లక్షల రూపాయలు మన చేతికి వచ్చే అవకాశం ఉంది.
గ్రామ్ సురక్ష స్కీము పూర్తి వివరాలు..
ఈ స్కీములో చేరటానికి భారతీయుడై ఉండాలి. 19 నుంచి 55 సంవత్సరాలు వయసు ఉన్న వారు ఎవరైనా ఈ స్కీములో జాయిన్ కావచ్చు. ఈ స్కీములో చేరిన వారు నెలకు, మూడు నెలలకు, అర్థ సంవత్సరానికో.. సంవత్సరానికో డబ్బులు పొదుపు చేయవచ్చు. పెట్టుబడి పెట్టే వారు తమ ఆసక్తి , వెసులుబాటును బట్టి పెట్టుబడి పెట్టవచ్చు. ప్రీమియం పేమెంట్ల విషయంలో 30 రోజుల గ్రేస్ పీరియడ్ కూడా అందుబాటులో ఉంది. స్కీములో జాయిన్ అయిన వారు గరిష్టంగా 60 ఏళ్ల టెన్యూర్ వరకు పెట్టుబడులు పెట్టుకోవచ్చు.
ఒక వేళ మధ్యలో స్కీములోంచి బయటకు రావాలనుకుంటే.. మూడేళ్ల తర్వాత ఇందుకు అవకాశం ఉంటుంది. అప్పుడు స్కీములోంచి బయటకు రావచ్చు. అయితే, ఇలాంటి సమయంలో మనం మూడేళ్ల పాటు పెట్టుబడి పెట్టిన దానిపై ఎలాంటి లాభాలు రావు. 19 ఏళ్ల వయసు ఉన్నవారు ఈ స్కీములో చేరి నెలకు 1515 రూపాయలు.. అంటే రోజుకు 50 రూపాయలు పెట్టుబడి పెట్టడం ద్వారా 55 ఏళ్ల వయసు వచ్చే సమయానికి 31.60 లక్షలు పొందొచ్చు. నెలకు 1463 రూపాయలు కడితే 58 ఏళ్లు వచ్చే సమయానికి 33.40 లక్షలు వస్తాయి. 1411 రూపాయలు కడితే.. 60 ఏళ్లు వచ్చే సమయానికి 34.60 లక్షలు వస్తాయి.