Nita Ambani: నీతా అంబానీ చేతిలో ఉన్న ఫోన్ రూ.400 కోట్లా..? నిజమేమిటంటే..?

నీతా అంబానీ చేతిలో ఉన్న ఫోన్ రూ.400 కోట్లా..? నిజమేమిటంటే..?

దేశంలో దిగ్గజ పారిశ్రామిక నేతల్లో ఒకరు ముఖేష్ అంబానీ. ఆయన సంపాదన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వ్యాపార సామ్రాజ్యం అనేక రంగాల్లో విస్తరించి ఉంది. అయితే ఓ ఫోటోతో వార్తల్లో నిలిచారు అంబానీ భార్య నీతా..

దేశంలో దిగ్గజ పారిశ్రామిక నేతల్లో ఒకరు ముఖేష్ అంబానీ. ఆయన సంపాదన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వ్యాపార సామ్రాజ్యం అనేక రంగాల్లో విస్తరించి ఉంది. అయితే ఓ ఫోటోతో వార్తల్లో నిలిచారు అంబానీ భార్య నీతా..

దేశంలోనే అత్యంత సంపన్నుడు, అపర కుబేరుడు అంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు ముఖేష్ అంబానీ. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేతగా, భారత్ దిగ్గజ వ్యాపారిగా పేరుగాంచిన ఆయన.. ప్రపంచంలోనే టాప్ బిలియనర్లలో ఒకరు. ముఖేష్ అంబానీ నికర విలువ సుమారు 90 బిలియన్ డాలర్లు. రిలయన్స్ పెట్రోకెమికల్స్, రిఫైనింగ్, ఆయిల్ అండ్ గ్యాస్, టెక్స్‌టైల్స్, రిటైల్, టెలికమ్యూనికేషన్స్‌తో సహా అనేక రంగాల్లో ఆయన వ్యాపార సామ్రాజ్యం విస్తరించి ఉంది. ఇక ఆయన ఇంట్లో ఏదైనా వేడుక జరిగితే.. ప్రపంచం మొత్తం చర్చించుకుంటూ ఉంటుంది. కాగా, ఇటీవల ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి అయోధ్య రామ మందిరాన్ని సందర్శించిన సంగతి విదితమే. అక్కడ సెంట్రాఫ్ ఎట్రాక్షన్ అయ్యారు ముఖేష్ భార్య నీతా అంబానీ, ఆమె చేతిలోని మొబైల్.

ముఖేష్ ఆయన అన్ని రంగాల్లో సక్సెస్ సాధించడంలో ఆయన భార్య నీతా అంబానీ పాత్ర కూడా ఉందన్న సంగతి విదితమే. రిలయన్స్ ఇండస్ట్రీస్ సహా వ్యవస్థాపకురాలిగా తనను తాను నిరూపించుకుంటుంది. సాధారణంగా బిలినియర్స్..జీవితం ఎలా ఉంటుందో తెలుసు. ఖరీదైన బంగ్లా, కార్లు ఉంటాయి. అలాగే ధరించే వస్తువుల నుండి తినే ఫుడ్ వరకు క్లాస్టీగా ఉంటాయి. తాజాగా ముఖేష్ అంబానీ అయోధ్యలోని రామ మందిర ఆలయ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరు కాగా, అక్కడ ఫోకస్ అంతా నీతా అంబానీ ఆమె చేతిలో ఫోన్ పై పడింది. ఇక ఆ ఫోన్ ఏంటిదీ.. ఎంత రేటు అన్న చర్చ మొదలైంది. ఆమె వాడుతున్న ఫోన్ అత్యంత కాస్ట్లీ ఫోన్ అని, సుమారు రూ. 400-500 కోట్లు ఉంటుందని వార్తలు హల్ చల్ చేశాయి. కానీ అదీ అవాస్తవం

ఇంతకు ఆ ఫోన్ ఏంటంటే..యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్. దీని ధర లక్షన్నర నుండి రెండు లక్షల వరకు ఉంటుంది. ఆమె చేతిలో ఉంది ఈ ఫోనే. ఇది లేటేస్ట్ వర్షన్. ఈ ఫోన్ సాధారణంగా టైటానియం, బ్లూ టైటానియం, వైట్ టైటానియం, బ్లాక్ టైటానియం అనే నాలుగు కలర్ ఆప్షన్లలలో లభిస్తుంది. ఈ ఐఫోన్‌లో లో మూడు కెమెరా లెన్స్‌లు ఉంటాయి. ఇక దీని ఫీచర్స్ విషయానికిి వస్తే.. పెరిస్కోప్ లెన్స్, టైటానియం ఛాసిస్, ఏ 17 బయోనిక్ చిప్ వంటి మరిన్ని ఫీచర్లను కలిగి ఉంటుంది. వీటి రేటును బట్టి జీబీ స్టోరేజీ ఉంటుంది. 128జీబీ, 256జీబీ, 512జీబీ స్టోరేజీ కెపాసిటీతో లభిస్తాయి. కంపెనీ తొలిసారిగా మొబైల్స్ కి యూఎస్బీ టైప్ సీ పోర్ట్, ప్రిమియం టైటానియం బాడీ, లేటెస్ట్ కెమెరా లెన్స్ వంటివి అందిస్తుంది. ఈ మొబైల్ కు సంబందించిన మరిన్ని ఫీచర్స్ గురించి మీకు తెలిసినట్లయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments