CDAC Recruitment 2024: కొడితే ఇలాంటి జాబ్ కొట్టాలి.. BTech పాసైతే చాలు.. ఏడాదికి రూ. 5 లక్షల జీతంతో Govt Jobs

కొడితే ఇలాంటి జాబ్ కొట్టాలి.. BTech పాసైతే చాలు.. ఏడాదికి రూ. 5 లక్షల జీతంతో Govt Jobs

CDAC Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. మీరు బీటెక్ ఉత్తీర్ణులై ఖాళీగా ఉన్నట్లైతే ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఏడాదికి రూ. 5 లక్షల జీతంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది.

CDAC Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. మీరు బీటెక్ ఉత్తీర్ణులై ఖాళీగా ఉన్నట్లైతే ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఏడాదికి రూ. 5 లక్షల జీతంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది.

బీటెక్ గ్రాడ్యుయేట్స్ అంతా ఐటీ సెక్టార్ లో సెట్ అయ్యేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. సాఫ్ట్ వేర్ జాబ్ చేయాలని కలలుకంటుంటారు. లక్షల ప్యాకేజీలతో కూడిన సాప్ట్ వేర్ జాబ్స్ ను సాధించేందుకు తె ప్రయత్నిస్తుంటారు. అయితే ప్రస్తుతం ఐటీ రంగంలో లేఆఫ్స్ కొనసాగుతుండడంతో ఐటీ జాబ్స్ సాధించడం గగనమైపోయింది. ఐటీ సంస్థలు ఉన్నపలంగా ఉద్యోగాలు తీసేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో బీటెక్ ఉత్తీర్ణులైన వారికి కేంద్ర ప్రభుత్వ సంస్థ గుడ్ న్యూస్ అందించింది. సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సంస్థ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.

సీడాక్ దేశవ్యాప్తంగా ఉన్న సెంటర్లలో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 857 పోస్టులను భర్తీ చేయనున్నది. ఒప్పంద ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. బీఈ/బీటెక్ (లేదా) ఎంఈ/ఎంటెక్ (లేదా) పీజీ డిగ్రీ (సైన్స్/కంప్యూటర్ అప్లికేసన్). సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు పీహెచ్‌డీ డిగ్రీ ఉండాలి. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆగస్ట్ 16 వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

  • ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు: 857
  • సెంటర్ల వారీగా ఖాళీలు:
  • సీడాక్‌-హైదరాబాద్ : 56 పోస్టులు
  • సీడ్యాక్‌-బెంగళూరు : 83 పోస్టులు
  • సీడ్యాక్‌-ఢిల్లీ : 24 పోస్టులు
  • సీడ్యాక్‌-చెన్నై : 135 పోస్టులు
  • సీడ్యాక్‌-ముంబయి : 18 పోస్టులు
  • సీడ్యాక్‌-మొహాలి : 11 పోస్టులు
  • సీడ్యాక్‌-నోయిడా : 170 పోస్టులు
  • సీడ్యాక్‌-పుణే : 230 పోస్టులు
  • సీడ్యాక్‌-పాట్నా: 19 పోస్టులు
  • సీడ్యాక్‌-తిరువనంతపురం : 91 పోస్టులు
  • సీడ్యాక్‌-సిల్చార్ : 20 పోస్టులు

అర్హతలు:

  • బీఈ/బీటెక్ (లేదా) ఎంఈ/ఎంటెక్ (లేదా) పీజీ డిగ్రీ (సైన్స్/కంప్యూటర్ అప్లికేసన్). సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు పీహెచ్‌డీ డిగ్రీ ఉండాలి. దీంతోపాటు సంబంధిత రంగంలో పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి:

  • 30 – 40 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌లైన్

ఎంపిక విధానం:

  • విద్యార్హతలు, అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ప్రారంభ తేదీ:

  • 20-07-2024

దరఖాస్తుకు చివరితేది:

  • 16-08-2024
Show comments