Venkateswarlu
Venkateswarlu
పిజ్జా అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. దాన్ని చూడగానే నోట్లో నీళ్లూరుతూ ఉంటాయి. రోజుకో పిజ్జా తినేవాళ్లు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. ఇండియాలో కూడా పిజ్జాలు తినే వారి సంఖ్య భారీగానే ఉంది. ప్రపంచవ్యాప్తంగా డామినోస్ పిజ్జాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. క్వాలిటీ, క్వాంటిటీ బాగా ఉండటంతో జనం ఎక్కువగా డామినోస్ పిజ్జాలను తినడానికి ఇష్టపడుతుంటారు. అయితే, రేటు కారణంగా చాలా మంది డామినోస్ పిజ్జాల కంటే తక్కువ ధర ఉన్నవాటిని కొనడం జరుగుతోంది.
డామినోస్‌లో వెజ్ పిజ్జా ధర 799 రూపాయలుగా ఉంది. అదే విధంగా చికెన్ పిజ్జా ధర 919 రూపాయలుగా ఉంది. ఈ భారీ రేట్ల కారణంగా పిజ్జా ప్రియులు డామినోస్‌కు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ మధ్య కాలంలో సేల్స్ కూడా బాగా తగ్గిపోయాయి. కొత్త కస్టమర్లు రావటం తగ్గిపోయి.. పాత కస్టమర్లు బయటి చూపులు చూడ్డం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో డామినోస్ దిద్దుబాటు చర్యలకు సిద్ధమైంది. వరల్డ్ కప్ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. పిజ్జా ప్రియులకు శుభవార్త చెప్పింది.
పిజ్జా రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. 799 రూపాయలుగా ఉన్న వెజ్ పిజ్జా ధరను 499 చేసింది. అదే విధంగా 919 రూపాయలుగా ఉన్న చికెన్ పిజ్జా ధరను 549 చేసింది. మొత్తం పిజ్జాల రేట్లను సగానికి సగం కోసేసింది. కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి, పాత కస్టమర్లు పక్క చూపులు చూడకుండా ఉండేందుకు డామినోస్ ఈ నిర్ణయం తీసుకుంది. మరి, డామినోస్ పిజ్జాల రేట్లను సగానికి సగం తగ్గించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.