We Love Jagan Song: సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న CM జగన్ సాంగ్.. స్టార్ హీరోలకు ధీటుగా

సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న CM జగన్ సాంగ్.. స్టార్ హీరోలకు ధీటుగా

We Love Jagan Song: సీఎం జగన్ పాలన మీద వస్తోన్న పాటలు రికార్డులు క్రియేట్ చేస్తుండగా.. తాజాగా మరో పాట విడుదలై సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇంతకు ఆ పాట ఏది అంటే

We Love Jagan Song: సీఎం జగన్ పాలన మీద వస్తోన్న పాటలు రికార్డులు క్రియేట్ చేస్తుండగా.. తాజాగా మరో పాట విడుదలై సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇంతకు ఆ పాట ఏది అంటే

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు కౌంట్ డౌన్ ప్రాంరభమైంది. మేమంతా సిద్ధం పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా పర్యటన ప్రారంభించారు. సీఎం జగన్ సభలకు జనాలు భారీగా తరలి వస్తున్నారు. తనను చూసేందుకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరిస్తూ.. తమ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల గురించి చెబుతూ.. ప్రచారంలో దూసుకుపోతున్నారు సీఎం జగన్. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ పాలన మీద ఇప్పటికే కొన్ని పాటలు విడుదలయ్యి సోషల్ మీడియాను షేక్ చేయగా.. తాజాగా మరో సాంగ్ రిలీజ్ అయ్యి.. ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఇంతకు ఆ పాట ఏది అంటే..

ఏపీ సీఎం జగన్ పరిపాలన మీద మరో సరికొత్త పాట విడుదల అయ్యింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జగన్ పాలన, ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలపై విడుదలైన పాటలన్ని ఇప్పటికే సోషల్‌ మీడియాలో సరికొత్త ట్రెండ్‌ను క్రియేట్‌ చేస్తున్నాయి. ఇక, తాజాగా ఈ జాబితాలో మరో పాట చేరింది. ‘వీ లవ్‌ జగన్‌’అనే కొత్త సాంగ్ రిలిజ్ అయ్యింది. ఇక విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

వి లవ్ జగన్ అంటూ సాగే ఈ పాటలో ముఖ్యమంత్రి జగన్‌ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి వివరించడం జరిగింది. అలాగే, సీఎం జగన్‌పై ప్రజలకు ఉన్న అభిమానాన్ని కూడా చక్కగా వివరించారు. వీ లవ్‌ జగన్‌ అంటూ సాంగ్‌ సాగుతూ.. జగనన్న పాలనను గురించి పాటలో గొప్పగా చెప్పుకొచ్చారు. పాట వింటుంటూ జగన్ ప్రజల మీద చూపించే ఆదరాభిమానులు కళ్ల ముందు కనిపిస్తున్నాయి అంటున్నారు ఏపీ ప్రజలు. స్టార్ హీరోల సినిమా పాటలకు ధీటుగా సీఎం జగన్ మీద వస్తోన్న పాటలు వైరల్ అవుతుండటం విశేషం. మరి మీరు కూడా ఓ సారి ఈ పాటను వినండి.

Show comments