టీచర్ అభ్యర్థులకు అలర్ట్.. టెట్ హాల్ టికెట్లు వచ్చేశాయ్.. ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..

AP TET Hall tickets: టీచర్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ హాల్ టికెట్స్ రిలీజ్ అయ్యాయి. వెంటనే ఇలా డౌన్ లోడ్ చేసుకోండి. వ్రాత పరీక్షలు అక్టోబర్ 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరుగనున్నాయి.

AP TET Hall tickets: టీచర్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ హాల్ టికెట్స్ రిలీజ్ అయ్యాయి. వెంటనే ఇలా డౌన్ లోడ్ చేసుకోండి. వ్రాత పరీక్షలు అక్టోబర్ 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరుగనున్నాయి.

టీచింగ్ ప్రొఫెషన్ కు రావాలనుకునే వారు ఖచ్చితంగా వృత్తి విద్యా కోర్సులు చేయాల్సి ఉంటుంది. డీఈడీ, బీఈడీ కోర్సులు అభ్యసించాలి. ఆ తర్వాత ప్రభుత్వం నిర్వహించే డీఎస్సీకి అర్హత సాధించాలంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్టును కూడా రాయాల్సి ఉంటుంది. టెట్ లో సాధించిన మార్కులు డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ కల్పిస్తారు. అందుకే టెట్ స్కోర్ కు ఇంపార్టెన్స్ పెరిగింది. టెట్ లో ఒక్కసారి క్వాలిఫై అయితే లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఉంటుంది. స్కోర్ పెంచుకునేందుకు ఎన్నిసార్లు అయిన టెట్ పరీక్ష రాయొచ్చు. ఈ క్రమంలో ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో టెట్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. తాజాగా దీనికి సంబంధించిన హాల్ టికెట్లు రిలీజ్ అయ్యాయి.

వ్రాత పరీక్షలు అక్టోబర్ 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరుగనున్నాయి. టెట్ పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్టు విధానంలో నిర్వహించనున్నారు. అభ్యర్థులు టెట్ అధికారిక వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్స్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. అభ్యర్థులు టెట్ అధికారిక వెబ్ సైట్ లో తమ క్యాండిడేట్ ఐడీ, డేట్ ఆఫ్ బర్త్, వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఏపీ టెట్ కు 4 లక్షలమందికి పైగా అప్లై చేసుకున్నారు. టెట్ పరీక్షలు రెండు సెషన్లలో 18 రోజులు పాటు జరుగుతాయి. మొదటి సెషన్ ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు జరుగుతుంది. రెండో సెషన్ మధ్యా హ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జరుగుతుంది.

హాల్ టికెట్లు ఇలా డౌన్ లోడ్ చేసుకోండి:

  • అభ్యర్థులు https://aptet.apcfss.in/# వెబ్ సైట్లోకి వెళ్లాలి.
  • హోం పేజీలో కనిపించే Hall Tickets క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి
  • ఆ తర్వాత అభ్యర్థి ఐడీ, పుట్టిన తేదీతోపాటు వెరిఫికేషన్ కోడ్ ను ఎంటర్ చేయాలి. -లాగిన్ పై క్లిక్ చేస్తే టెట్ హాల్ టికెట్ డిస్ల్పే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్ లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి కాపీని పొందొచ్చు.
Show comments