Arjun Suravaram
TDP In Rajayasabha: సోమవారం రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడులైంది. మొత్తంగా 56 స్థానాలు, ఏపీ నుంచి 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా పెద్దల సభలో టీడీపీ అడ్రెస్ గల్లంతు కానుందని టాక్ వినిపిస్తోంది.
TDP In Rajayasabha: సోమవారం రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడులైంది. మొత్తంగా 56 స్థానాలు, ఏపీ నుంచి 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా పెద్దల సభలో టీడీపీ అడ్రెస్ గల్లంతు కానుందని టాక్ వినిపిస్తోంది.
Arjun Suravaram
సోమవారం రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. దేశ వ్యాప్తంగా 56 రాజ్యసభ స్థానాల ఎన్నికకు ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇక ఏపీ నుంచి మూడు స్థానాలకు ఎన్నికలు జరగనుంది. బీజేపీ ఎంపీ సీఎం రమేశ్, టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు ఈ లిస్టులో ఉన్నారు. టీడీపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న కనకమేడల పదవీ కాలం ఏఫ్రిల్ 4తో ముగియనుంది. అయితే ఈ స్థానం తిరిగి గెలుచుకోవడం టీడీపీకి కష్టమే అనే భావనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో 41 ఏళ్ల తరువాత రాజ్యసభలో టీడీపీ ఖాళీ కానుందని పొటిలికల్ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది.
తెలుగు దేశం పార్టీని నందమూరి తారక రామారావు 1983లో స్థాపించారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. ఇక అప్పటి కేంద్రంలో టీడీపీ బలమైన ప్రాంతీయ పార్టీగా ఉంది. అలానే 41 ఏళ్లుగా రాజ్యసభలో టీడీపీ..తన ఉనికి కొనసాగిస్తూ వచ్చింది. ఇక 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం చవిచూసింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం వైసీపీ నుంచి 9 మంది, బీజేపీ నుంచి ఒక్కరు, టీడీపీ నుంచి కూడా ఒక్కే ఒక్కరు రాజ్యసభలోఉన్నారు. తాజాగా ఏప్రిల్ 4వ తేదీన వీరందరి పదవీకాలం ముగియనుంది. అయితే తిరిగి టీడీపీ తమ స్థానం నిలబెట్టుకోవాలని ఆలోచిస్తుంది. అయితే ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న పార్టీ బలాల దృష్ట్యా టీడీపీ ఆస్థానం కూడా వచ్చే అవకాశం లేదు.
ప్రస్తుతం ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో 151 మంది వైసీపీ, 23 మంది టీడీపీ,1 జనసేన ఎమ్మెల్యే ఉన్నారు. ఇక ఇక్కడ ఒక ఎంపీ స్థానం గెలుచుకోవాలంటే..44 మంది ఎమ్మెల్యే మద్దతు ఉండాలి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ మూడు స్థానాలు వైసీపీ నే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. టీడీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో నలుగురు అధికార పార్టీకి మద్దతుగా నిల్చారు. దీంతో వారు టీడీపీ బలం 19కి పడిపోయింది. ఇదే సమయంలో ఇటీవలే టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా లేఖను స్పీకర్ ఆమోదించారు. దీంతో టీడీపీ బలం 18 మందికి పడిపోయింది. వీరిలో కూడా కొందరు బాబుపై అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఇలాంటి నేపథ్యంలో కేవలం 18 సీట్లు ఉన్న టీడీపీకి రాజ్యసభ స్థానం గెలవాలంటే..మరో 26 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి.
ఇప్పడున్న పరిస్థితుల్లో టీడీపీకి అది అసాధ్యమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఇదే సమయంలో ఆ మూడు స్థానాలను వైసీపీకే గెల్చుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదే నిజం అయితే దాదాపు 41 ఏళ్ల తరువాత రాజ్యసభలో టీడీపీ అడ్రెస్ గల్లంతు అయినట్లే. ఇలా టీడీపీకి దారుణమైన పరిస్థితి రావడానికి చంద్రబాబే కారణమని ఆ పార్టీలోని కొందరు నేతలే చెప్పుకుంటున్నారు. 2019లో దారుణంగా ఓటమి చెందడం, ఆ తరువాత గెలిచిన ఎమ్మెల్యేల విషయంలో కూడా సంతృప్తికరంగా లేకపోవడంతో.. ఈ పరిస్థితి వచ్చిందని టాక్ వినిపిస్తోంది. మరి.. రాజ్యసభలో టీడీపీ అడ్రెస్ గల్లంతు కాబోతుందనే పొలిటికల్ టాక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.