Nara Chandrababu: బాబు సభలు అట్టర్ ఫ్లాప్.. దండం పెడుతున్న జనాలు!

బాబు సభలు అట్టర్ ఫ్లాప్.. దండం పెడుతున్న జనాలు!

Chandrababu: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన 'రా..కదలి రా' అనే పేరుతో నిర్వహిస్తున్న సభలు అట్టర్ ప్లాప్ అవుతున్నాయి. జనాలు లేక వెలవెలబోవడంతో స్థానిక టీడీపీ నేతలపై బాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. తాజాగా కర్నూలు, నెల్లూరు జిల్లాలో జరిగిన సభలో అదే కనిపిస్తోంది.

Chandrababu: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన 'రా..కదలి రా' అనే పేరుతో నిర్వహిస్తున్న సభలు అట్టర్ ప్లాప్ అవుతున్నాయి. జనాలు లేక వెలవెలబోవడంతో స్థానిక టీడీపీ నేతలపై బాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. తాజాగా కర్నూలు, నెల్లూరు జిల్లాలో జరిగిన సభలో అదే కనిపిస్తోంది.

శనివారం భీమిలి వైఎస్సార్ సీపీ నిర్వహించిన ‘సిద్ధం’ సూపర్ హిట్ అయ్యింది. ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల రణరంగంలోకి దిగితే ఎలా ఉంటుందో.. ఆ సభే ప్రత్యక్ష ఉదాహరణ. ‘అన్న అడుగు పెట్టనంత వరకే.. ప్రత్యర్థుల ఆటలు,  అన్న వన్స్ స్టెప్ ఇన్ ఎలక్షన్ మూడ్.. అదర్ పార్టీస్ ఆల్ ఆర్ అవుట్’ అంటూ ఈ సభను చూసిన చాలా మంది నుంచి వ్యక్తమవుతున్న అభిప్రాయం. ఇదే సమయంలో టీడీపీ చంద్రబాబు నిర్వహిస్తున్న’రా కదలి రా’ సభలు మాత్రం అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. అంతేకాక చంద్రబాబుకు సభలకు రామంటూ దండాలు పెడుతున్నారు. అందుకు నిదర్శనం గతంలో జరిగిన చంద్రబాబు సభలో కాకుండా.. ఆదివారం నెల్లూరు, కర్నూలు జిల్లాలో కూడా ఖాళీ కుర్చీలే దర్శనం ఇచ్చాయి.

ఆదివారం నెల్లూరు సిటీ, కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో టీడీపీ ‘రా కదలి రా’ సభను నిర్వహించింది. ఈ సభలకు పేరు అయితే అదే కానీ.. జనాలు మాత్రం అందుకు విరుద్ధంగా నీ సభకు రాము..మేము కదలి రాం.. అన్నట్లు ఆ సభలో కనిపించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పాల్గొన్న ‘రా.. కదలి రా’ సభలు జనం లేక వెలవెలబోయాయి. చేసేది ఏమిలేక బాబు ఖాళీ కుర్చీలను చూస్తూ ప్రసంగించాల్సి వచ్చింది. నిన్న నిర్వహించిన రెండు సభల్లో ఒక్కో సభకు లక్ష మంది చొప్పున రప్పించాలనుకున్న టీడీపీ వ్యూహం బెడిసికొట్టింది. కనీసం ఏడెనిమిది వేల మంది జనం కూడా ఈ సభలకు హాజరు కాలేదు. ఆ వచ్చిన కొందరు కూడా బాబు చేసిన చికాకు ప్రసంగానికి వెళ్లిపోయారు. తాను ఏం చేస్తాను అనేది చెప్పకుండా.. సీఎం జగన్ పై తిట్టడమే పనిగా పెట్టడంతో జనాలు విసుగు చెందారు. ఇక ఈ రెండు సభలు అట్టర్ ప్లాప్ కావడంతో స్థానిక నేతలపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారని తెలుస్తోంది.

ఇలా జనం లేకుండా సభలు జరిగితే.. ప్రజల్లోకి వేరే సంకేతాలు వెళ్తాయని, ప్రజా వ్యతిరేకత ఉందని స్పష్టం అవుతుందని టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరు, పత్తికొండలో భారీ జన సమీకరణకు ఆ పార్టీ నేతలు యత్నించినా ఫలితం లేకుండా పోయింది. చాలాచోట్ల డబ్బులిస్తామన్నా…తాము మీ సభలకు రామంటూ ప్రజలు టీడీపీ నేతల ముఖంమీదే తేల్చి చెప్పడంతో వారు చేతులెత్తేశారు. రెండు జిల్లాల్లోనూ సభలు జనం లేక వెలవెలబోవడంతో పార్టీ అధిష్టానంతో పాటు క్యాడర్‌ కూడా తీవ్ర నైరాశ్యంలోకి వెళ్లిపోయింది.

ఇదే సమయంలో జనాలు సీఎం జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన సిద్ధం సభను గుర్తు చేసుకున్నారు. అది కదా సభ అంటే.. జనసంద్రాని తలపించిందని అభిప్రాయా పడుతున్నారు. ఇసుకేస్తే రాలనంత జనం  సీఎం జగన్ సభలో ఉంటే.. ఇసుక మాత్రమే ఉందా అన్నట్లు ఖాళీ ప్రాంగణం చంద్రబాబు సభలో కనిపిస్తుంది. ఇందుకు కారణం విశ్వసనీయతని, విలువతో కూడిన రాజకీయం అని పలువురు విశ్లేషకులు అభిప్రాయా పడుతున్నారు. సీఎం జగన్ భీమిలి సభ సూపర్ హిట్ అయితే.. చంద్రబాబు సభలు మాత్రం అట్టర్ ప్లాప్ అయిందని ఈ రెండిటిని చూసిన జనం అనుకుంటున్నారు.

నెల్లూరు నగరంలో టీడీపీ నిర్వహించిన సభకు డబ్బులు, మద్యం ఎర చూపినా ప్రజలు ఆ సభ వైపు రాలేదు. కేవలం రెండు వేల మంది మాత్రం ఎస్‌వీజీఎస్‌ కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో హడావుడి చేశారు. అలానే సభకు వచ్చిన కార్యకర్తలకు రూ.250 డబ్బులు, క్వార్టర్‌ మద్యం బాటిల్‌ పంపిణీ చేయడం స్థానికంగా కనిపించింది. చంద్రబాబు ప్రసంగిస్తునంత సమయం కుర్చీలు ఖాళీగా కనిపించడంతో స్థానిక నేతలపై బాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. సభ మొత్తం ప్రజలను ఉంచలేక పోతున్నారు.. కనీసం తాను మాట్లాడే సమయానికైనా ప్రజలను నిలబెట్టలేకపోయారా అని నెల్లూరు నగర రూరల్‌  నేతలపై మండిపడ్డారని టాక్ వినిపిస్తోంది. పత్తికొండలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. చాలా తక్కువ మంది రావడమే కాకుండా..వచ్చిన కొద్ది మంది కూడా సభ మధ్యలోనే వెళ్లిపోవడంతో ఆ పార్టీ నేతలకు దిక్కుతోచలేదు. మరి.. జగన్ సభ హిట్.. బాబు సభ అట్టర్ ప్లాప్ అంటూ పొటిలికల్ సర్కిల్ లో వినిపిస్తోన్న మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపం తెలియజేయండి.

Show comments