బాబు వ్యూహాలకి చెక్ పెడుతున్న కాపులు! గురిచూసి కొట్టారా?

ఏపీలో ఎన్నికల వాతావరణం ప్రారంభమైంది. ఎలక్షన్ నోటిఫికేషన్ రాక ముందే అన్ని ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇదే సమయంలో వివిధ వర్గాల వారు..తమ డిమాండ్లను నిరవేర్చుకునేందుకు పార్టీలను హెచ్చరిస్తున్నాయి.

ఏపీలో ఎన్నికల వాతావరణం ప్రారంభమైంది. ఎలక్షన్ నోటిఫికేషన్ రాక ముందే అన్ని ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇదే సమయంలో వివిధ వర్గాల వారు..తమ డిమాండ్లను నిరవేర్చుకునేందుకు పార్టీలను హెచ్చరిస్తున్నాయి.

రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో ఎవ్వరం చెప్పలేం. ఎవరితో ఎవరికి అవసరం పడుతుందో, ఎవరితో ఎవరు జతకడతారో కూడా చెప్పలేము. ఇదే సమయంలో కొన్ని కొన్ని అంశాలు పార్టీలను భయపెడుతుంటాయి. తాజాగా ఏపీలోని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ విషయంలోనూ అదే జరుగుతుంది. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేనతో కలిసి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికి వరకు సీట్ల షేరింగ్ పై స్పష్టత మాత్రం రాలేదు. వచ్చే ఎన్నికల్లో  ఎలాగైనా గెలవాలని భావిస్తున్న చంద్రబాబుకు కాపులు చెక్ పెడుతున్నారనే టాక్ వినిపిస్తోంది.

మరికొద్ది నెలల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే అధికార వైసీపీ, ఆ పార్టీ అధినేత సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల సమరంలోకి దిగారు. ఈక్రమంలోనే  175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ అధినేత సీఎం జగన్ ముందుకెళ్తున్నారు. ఇప్పటికే అనేక నియోజవర్గాల్లో మార్పులు చేర్పులు చేస్తూ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. అలానే వివిధ కార్యక్రమాలు చేపడుతూ..తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, ఇతర అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరిస్తున్నారు. ఇలా అధికార వైసీపీ ఎన్నికల సమరంలో దూసుకెళ్తోంది.

ఇదే సమయంలో ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేనాలు మాత్రం అసలు తాము పోటీలోనే లేము అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఇరుపార్టీలు సీట్ల పంపకాలపై, అభ్యర్థుల విషయంలో స్పష్టత రాలేదు. జనసేనను  అడ్డుపెట్టుకుని అధికారంలోకి రావాలని చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. ఇదే సమయంలో బీసీల తరువాత  ఎక్కువ ఓటు బ్యాంక్ క‌లిగిన కాపులు చంద్ర బాబు వ్యూహాలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. తమకు గౌరప్రదమైన స్థితి లేకుంటే మౌనంగా ఉండే ప్ర‌శ్నే లేదంటున్నారు.

జ‌న‌సేన‌ను త‌మ పార్టీగా మెజార్టీ కాపులు భావిస్తున్నారని చాలా మంది అభిప్రాయం. టీడీపీతో జ‌న‌సేన పొత్తు పెట్టుకోవ‌డం, త‌మ డియాండ్ల‌ను నెర‌వేర్చుకోవ‌డానికి ఇంత‌కంటే మంచి త‌రుణం రాద‌ని ఆ సామాజిక వ‌ర్గంలోని చాలా మంది న‌మ్ముతున్నారని టాక్. ఇక టీడీపీతో పొత్తులో భాగంగా జ‌న‌సేన‌కు 50 అసెంబ్లీ, ఐదు లోక్‌స‌భ స్థానాల ఇవ్వాలని కాపులు కోరుకుంటున్నారని పొలిటికల్ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది.  సీట్లతో పాటు రెండు లేదా రెండున్న‌రేళ్ల పాటు ప‌వ‌న్‌కు సీఎం ప‌ద‌వి ఇవ్వాల‌నే ప్రధాన ఎజెండాతో కాపులంతా జ‌న‌సేన కాపులు ఐక్యం అవుతున్నారని తెలుస్తోంది. ఒక‌వేళ సీట్ల‌లో భారీ కోత విధిస్తే,  అలానే అధికారంలో భాగం ఇవ్వ‌క‌పోవ‌డం చేస్తే.. గ‌తంలో మాదిరిగానే చంద్ర‌బాబును ఓడిస్తామ‌ని కాపులు హెచ్చ‌రిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

త‌మ‌ను గౌర‌వించేలా సీట్ల కేటాయింపు, అలాగే అధికారంలో భాగం ఇస్తే ఏ గొడ‌వా వుండ‌ద‌ని కాపులు భావిస్తున్నారు. ఒకవేళ కాదు, కూడ‌దంటే మాత్రం టీడీపీ త‌గిన మూల్యం చెల్లించుకోవాల్సి వ‌స్తుంద‌ని కాపు నేతలు బహిరంగానే హెచ్చరిస్తున్నారు. జ‌న‌సేన కాపుల వార్నింగ్ టీడీపీలో ఆందోళ‌న రేకెత్తిస్తోందని పొలిటికల్ సర్కిల్ లో గుసగుసలు వినిపిస్తోన్నాయి. మొత్తంగా జనసేనను అడ్డుపెట్టుకుని తాను అధికారంలోకి రావాలనుకుంటున్న బాబు వ్యూహాలకు కాపులు చెక్ పెడుతున్నట్లు తెలుస్తోంది. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments