చంద్రబాబు, పవన్ అసమర్థతే జగన్ కు బలం..!

YS Jagan: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని రాజకీయం చాలా రసవత్తరంగా సాగుతోంది. ఇదే సమయంలో ఓ విషయంలో ప్రతిపక్షాల ఆలస్యం అధికార పార్టీ వైఎస్సార్ సీపీకి అమృతంలా మారుతుంది.

YS Jagan: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని రాజకీయం చాలా రసవత్తరంగా సాగుతోంది. ఇదే సమయంలో ఓ విషయంలో ప్రతిపక్షాల ఆలస్యం అధికార పార్టీ వైఎస్సార్ సీపీకి అమృతంలా మారుతుంది.

ఆంధ్రప్రదేశ్ రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడ కురుక్షేత్ర వాతావరణం కనిపిస్తోంది. ముఖ్యంగా అధికార వైఎస్సార్ సీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య ఎన్నికల సంగ్రామం తీవ్ర స్థాయిలో ఉంది. 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యూహాలు రచిస్తో.. ఎన్నికల సమరంలో దూసుకెళ్తున్నారు. ఇదే సమయంలో తాము పొత్తుతోనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని టీడీపీ, జనసేనలు చెబుతున్నాయి. అలా చెబుతున్నా ఇప్పటి వరకు సీట్ల పంపకంపై క్లారిటీ లేదు. ఇదే వైసీపీకి బలంగా మారుతుందనే వాదనలు వినిపిస్తోన్నాయి.

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. రోజులు గడుస్తున్నా కొద్దీ వైసీపీ దూకుడు పెంచుతోంది. ఇప్పటికే  పలు విడతల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది. పైగా సిద్ధం పేరుతో సభలను కూడా నిర్వహిస్తూ ప్రజల్లోకి సీఎం జగన్ దూసుకెళ్తున్నారు. ఇదే సమయంలో టీడీపీ, జనసేనలు మాత్రం ఇంకా అమోయమంలోనే ఉన్నాయి. పేరుకే పొత్తులు పెట్టుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కలిసి సీట్ల విషయంలో పూర్తి స్థాయిలో చర్చించిన దాఖలాలు లేవు. జగన్ గెలుపును ఆపాలనే కంకణం అయితే కట్టుకున్నారు.. గానీ.. ఇద్దరూ ఒక్కతాటిమీదకు రాలేకపోతున్నారనే టాక్ వినిపిస్తోంది.

అలానే క్షేత్ర స్థాయిలో వారి కార్యకర్తలు కూడా  కలవలేకపోతున్నారు. ఆ పార్టీల నేతలు, కార్యకర్తలు ఎంతలా కత్తులు దూసుకుంటున్నారో గతంలో జరిగిన కొన్ని ఘటనలే ప్రత్యక్ష ఉదాహరణలు.   ఇటు వైపు వైఎస్సార్ సీపీ వరుసగా నియోజకవర్గ ఇన్ ఛార్జీలను మారుస్తోంది. కొందరికి వేరే నియోజకవర్గాలు కేటాయిస్తూ మార్పులు, చేర్పులు చేస్తున్నా పార్టీలో జోష్ పెరుగుతోందే తప్ప అస్సలు తగ్గట్లేదు. కానీ టీడీపీ, జనసేన మాత్రం అభ్యర్థులను ప్రకటించుకుండానే ఆ పార్టీల్లో నిప్పు రాజుకుంటుందని తెలుస్తోంది. ఒకవేళ జనసేన వల్ల తమకు సీట్లు రాకపోతే అల్లకల్లోలం చేసేందుకు టీడీపీ అభ్యర్థులు రెడీగా ఉన్నారు.

ఇప్పట్లో అభ్యర్థులను ప్రకటిస్తే అధికార పార్టీ ముందు పరువు పోయేలా అభ్యర్థులు కత్తులు దూసుకుంటారని ఇరుపార్టీల అధినేతలు భయపడుతున్నారు. అందుకే చంద్రబాబు, పవన్ ఎక్కడ ధైర్యం చేసి.. అభ్యర్థులను ప్రకటించలేదు. ఇలా వారు అసమర్థంగా వ్యవహరించడం వల్లనే అభ్యర్థుల ప్రకటన ఆలస్యం అవుతోందని టాక్ వినిపిస్తోంది. ఇదే ఇప్పుడు వైసీపీకి బలంగా మారుతోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. టీడీపీ, జనసేన అభ్యర్థులను ప్రకటించి.. అసంతృప్తులను చల్లార్చే లోపు వైసీపీ ప్రచారం మరోస్థాయిలో ఉంటుంది.

ఇలా అభ్యర్థుల ప్రకటన విషయంలో చంద్రబాబు, పవన్ లా ఆలస్యమే వైసీపీకి అమృతంలా మారుతుందని పలువురు అభిప్రాయా పడుతున్నారు. ఇదే విషయాన్ని ప్రముఖ న్యాయవాది కల్యాణ్ దిలీప్ సుంకర్ కూడా చెప్పుకొచ్చారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిని గద్దె దించడం జనసేన, టీడీపీకిలకు అంత సులభం కాదని, వారు వీళ్లైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించి.. ప్రచారం దూసుకెళ్తే మేలని తెలిపారు. అలా కాకుండా అభ్యర్థులను ప్రకటించడంలో ఆలస్యం చేస్తే.. అదే సీఎం జగన్ కి అమృతంలా మారీ… మరోసారి అధికారం కట్టబెడుతుందని ఆయన చెప్పుకొచ్చారు.

Show comments