IMD Heavy Rain Alert To AP & TG: వరుసగా 2 తుపాన్లు.. రానున్న 5 రోజులు ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన

Rain Alert: వరుసగా 2 తుపాన్లు.. రానున్న 5 రోజులు ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు కీలక సూచన చేశారు. రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచిస్తున్నారు. ఆ వివరాలు..

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు కీలక సూచన చేశారు. రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచిస్తున్నారు. ఆ వివరాలు..

ఇన్నాళ్ల పాటు మండే ఎండలతో అల్లాడిన జనాలకు జూన్‌ నెల ఆరంభం నుంచే కాస్త ఊరట లభించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో జూన్‌ ఆరంభం నుంచే వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే దేశంలోకి ప్రవేశించాయి. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ అధికారులు రెండు తెలుగు రాష్ట్రాలకు కీలక ప్రకటన చేశారు. రెండు వరుస తుపాన్ల కారణంగా.. ఏపీ, తెలంగాణలో నేటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు. ఈమేరకు వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది.

నైరుతి రుతుపవనాలు.. రెండు తెలుగు రాష‍్ట్రాల్లో పూర్తిగా వ్యాపించాయి.  ఈ క్రమంలో ప్రస్తుతం తమిళనాడు దగ్గర బంగాళఖాతంలో తుఫాను తరహా వాతావరణం ఉందనీ.. అలాగే ఏపీ పక్కన కూడా తుపాను తరహా వాతావరణం ఉందని.. వీటి వల్ల.. రానున్న 5 రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనిన వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఈ తుపానుల కారణంగా.. వచ్చే 5 రోజులపాటూ.. రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణలో పిడుగులు పడటమే కాక.. తేలికపాటి నుంచి మోస్తరు వాన పడుతుందనీ, గాలి వేగం గరిష్టంగా గంటకు 40 కిలోమీటర్లు ఉంటుందనివాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నేటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు సమయాల్లో జోరు వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇక నిన్న సాయంత్రం హైదరాబాద్‌ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఇక ఈ ఏడాది జోరు వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఇన్నాళ్ల పాటు తీవ్ర నీటి ఎద్దడి, నీళ్ల కరువుతో ఇబ్బంది పడ్డ బెంగళూరు దాహం తీరేలా భారీ వర్షం కురిసింది. ఏకంగా 133 ఏళ్ల రికార్డును బ్రేక్‌ చేసింది. అలానే దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని అంటున్నారు. ఇది రైతన్నలకు కాస్త ఊరట కలిగించే వార్త అని చెప్పవచ్చు. గతేడాది వర్షాలు అంతంతమాత్రమే కురవడంతో.. రైతులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. మరి ఈసారైనా వరుణుడు వారిని కరుణిస్తాడో లేదో చూడాలి. ఇక ఇప్పటికే భారీ వర్షాలు కురవడంతో.. అన్నదాతలు వ్యవసాయం పనులు ప్రారంభించారు.

Show comments