Rain Alert: తెలుగు రాష్ట్రాలకు మరోసారి వర్ష సూచన.. ఈ జిల్లాల్లో వానలు

తెలుగు రాష్ట్రాలకు మరోసారి వర్ష సూచన.. ఈ జిల్లాల్లో వానలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి విభిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. కొన్ని జిల్లాల్లో వర్షాలు పడుతుంటే.. విచిత్రంగా మరికొనిని చోట్ల ఎండలు మండిపోతున్నాయి. సాధారణం ఉష్ణోగ్రతలు కంటే ఎక్కువ నమోదవుతున్నాయి. అలాగే నైరుతి రుతు పవనాలు తిరోగమనం అవుతాయని వాతావరణశాఖ తెలిపింది. అయితే మంగళవారం  రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని వాతావరణశాఖలు అంచనా వేశాయి. మిగిలిన ప్రాంతాల్లో మాత్రం ఎండలు మండిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

ఏపీ, తెలంగాణ రాష్టార్ల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. ఉత్తర అండమాన్‌ సముద్రంలో ఉన్న ఉపరితల ఆవర్తనం మంగళవారం బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్, అమరావతి వాతావరణశాఖలు అంచనా వేస్తోన్నాయి.  రానున్న 24 గంటల్లో కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు. ఇవాళ ఉమ్మడి విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షం కురుస్తుంది అంటున్నారు.

వర్షాల సంగతి అలా ఉంచితి.. ఎండలు కూడా పోటీ వస్తున్నాయి. పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3.1 డిగ్రీల అధికంగా 36 డిగ్రీల సెల్సియస్‌ నమోదయ్యాయే అవకాశం ఉందని వెల్లడించింది. నైరుతి రుతుపవనాల తిరోగమనం అవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో రుతుపవనాలు చురుగ్గా ఉండడంతో దేశంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయన్నారు. గత నెల ఆగస్టులో విచిత్రంగా ఎండలు, ఉక్కపోతలతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. సెప్టెంబర్‌లో మాత్రం వానలు పడతాయని అంచనా వేశారు. కానీ పరిస్థితి మాత్రం కాస్త  మిశ్రమంగానే ఉన్నాయని చెప్పాలి. మొదటి 10 రోజుల పాటూ వర్షాలు కురిసినా మళ్లీ ఎండలు మండిపోతున్నాయి. అలానే పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురుస్తోన్నాయి.

Show comments