DIG Ravi Kiran: చంద్రబాబు ఆరోగ్యంపై బయటపడ్డ TDP నాటకం.. జైళ్ల శాఖ DIG క్లారిటీ!

చంద్రబాబు ఆరోగ్యంపై బయటపడ్డ TDP నాటకం.. జైళ్ల శాఖ DIG క్లారిటీ!

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన జైలుకు వెళ్లి  నెల దాటింది. అలానే జైల్లో చంద్రబాబు నాయుడికి అధికారులు  భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఆయనకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని సదుపాయాలను జైళు అధికారులు కల్పిస్తున్నారు. చంద్రబాబుకు పోలీసులు అన్నిసౌకర్యాలు కల్పిస్తున్న టీడీపీ నేతలు మాత్రం అసత్య ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. ఇటీవలే చంద్రబాబు ఆరోగ్యం విషయంలో టీడీపీ ఓ అసత్య ప్రచారం చేసింది. బాబు బరువు తగ్గారంటూ టీడీపీ చేసిన దొంగ ప్రచారం బయపడింది. చంద్రబాబు ఆరోగ్యం విషయంపై జైళ్ల శాఖ డీఐజీ క్లారిటీ ఇచ్చారు.

నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై ఏపీ జైళ్ల శాఖ డీఐజీ రవి కిరణ్ కీలక విషయాలను వెల్లడంచారు.  చంద్రబాబు బరువు పెరిగారని డీఐజీ గురువారం వెల్లడించారు. “కోర్టు చంద్రబాబు నాయుడుకి సదుపాయాలు కల్పించమని సూచనలు ఇచ్చారు.  వారి ఆదేశాల ప్రకారం ఆహారం, ఇతర సదుపాయాలను మేము కల్పించాము. చంద్రబాబు ఆరోగ్యాన్నిఎప్పటికప్పుడు వైద్యులను ద్వారా పరీక్షిస్తున్నాము. జైల్లో2000 మంది ఖైదీలు ఉంటారు. ప్రతి ఒక్కరి ఆరోగ్యం మాపైనే ఉంది. వైద్యుల పర్యవేక్షణతో పాటు మేము చంద్రబాబు ఆరోగ్యం గురించి తెలుసుకుంటుంటాము” అని డీఐజీ రవి తెలిపారు. బాబు జైల్లోకి వచ్చినప్పుడు 66 కేజీలు ఉండగా..ప్రస్తుతం 67 కేజీలకు చేరుకున్నారని తెలిపారు. చంద్రబాబు జైల్లో ఆరోగ్యంగానే ఉన్నారని  ఆయన పేర్కొన్నారు. ఇక చంద్రబాబు ఆరోగ్యంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని డీఐజీ తెలిపారు.

స్టెరాయిడ్స్  అంటూ వస్తున్న దుష్ప్రచారాన్ని డీఐడీ ఖండించారు. చంద్రబాబుకు స్కిన్ అలర్జీ ఉన్న మాట వాస్తవమేనని ఆయన తెలిపారు. అయితే జైలులో బాబు ఆరోగ్యాన్ని అధికారులు పట్టించుకోవడం లేదని, సరైన వైద్యం అందించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని నారా లోకేశ్ తో సహా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ కారణాలతో బాబు 5 కిలోల బరువు తగ్గారని, నారా లోకేశ్, బ్రాహ్మణిలు ట్వీట్ కూడా చేశారు. చంద్రబాబు ఆరోగ్యానికి తీవ్ర ముప్పు కలుగుతుందంటూ ప్రజలను నమ్మించే ప్రయత్నం టీడీపీ నేతలు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. తాజాగా చంద్రబాబు కేజీ బరువు పెరిగారంటూ జైళ్ల అధికారులు చెప్పడంతో టీడీపీ నేతల దొంగ నాటకాలు బయట పడ్డాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి.. జైళ్ల శాఖ డీఐజీ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments