Gold and Silver Rates: మహిళలకు గొప్ప శుభవార్త.. మళ్లీ తగ్గిన పసిడి ధరలు.. నేడు ఏంతంటే?

మహిళలకు గొప్ప శుభవార్త.. మళ్లీ తగ్గిన పసిడి ధరలు.. నేడు ఏంతంటే?

Gold and Silver Rates: బంగారం అంటే ఇష్టపడని వారు ఉండరు.. ఇటీవల పసిడి ధరలు రోజు రోజుకీ భారీగా పెరిగిపోవడంతో కొనుగోలుదారులు ఇబ్బంది పడ్డారు. కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత బంగారం ధరలు భారీగా పతనం అయ్యాయి.

Gold and Silver Rates: బంగారం అంటే ఇష్టపడని వారు ఉండరు.. ఇటీవల పసిడి ధరలు రోజు రోజుకీ భారీగా పెరిగిపోవడంతో కొనుగోలుదారులు ఇబ్బంది పడ్డారు. కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత బంగారం ధరలు భారీగా పతనం అయ్యాయి.

ప్రపంచంలో బంగారం అంటే ఎంత విలువ ఇస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. పసిడి గత ఏడాది నుంచి వరుసగా ధరలు పెరుగుతూ సామాన్యులకు చుక్కలు చూపించింది. ఆషాఢ మాసంలో కాస్త తగ్గుముఖం పడుతూ వస్తున్న సమయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెల్ లో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే పసిడి పై సుంకం తగ్గించడంతో అనూహ్యంగా ధరలు పడిపోయాయి. ఏకంగా నాలుగు వేలకు పైగా పసిడి ధరలు దిగిరావడంతో కొనుగోలుదారులు సంబరాలు చేసుకుంటున్నారు. ఎక్కడ చూసినా జ్యులరీ షాపులు కిట కిటలాడుతున్నాయి. ఈ రోజు పసిడి ధరలు మళ్లీ తగ్గాయి. వివరాల్లోకి వెళితే..

ఆషాఢ మాసం మొదలైనప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం మొదలైంది. రాబోయే రోజుల్లో పండుగలు, శుభకార్యాల సీజన్.. ఇదే సమయానికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పసిడి కొనుగోలుదారులకు గొప్ప ఉపశమనం కల్పించారు.  బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత పసిడి, వెండి ధరలు వేలల్లో తగ్గుముఖం పట్టాయి. మొన్నటి వరకు వరుసగా పెరిగిన పసిడి ధరలు ఒక్కసారే పతనం కావడంతో మహిళలు బంగారం కొనుగోలు చేసేందుకు జ్యులరీ షాపులకు క్యూ కడుతున్నారు. సోమవారం (జులై 29) పసిడి ధరలు మళ్లీ తగ్గాయి. 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం పై రూ.10 తగ్గి, 63, 240కి చేరింది, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం పై రూ.10 తగ్గి 68,990కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.63,240 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.68,990 వద్ద కొనసాగుతుంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.63,390 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.69,140వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.64,640 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.70,520 వద్ద కొనసాగుతుంది. ముంబై, కోల్‌కొతా, బెంగుళూరు, కేరళా, పూణేలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.63,240 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.68,990 వద్ద కొనసాగుతుంది. ఇక వెండి విషయానికి వస్తే.. ప్రస్తుతం కిలో వెండిపై రూ.100 తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ.88,900 ఉండగా, ఢిల్లీ, ముంబై, కోల్‌కొతాలో కిలో వెండి రూ.84,400, బెంగుళూరు లో రూ.84,150 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.88,900 వద్ద కొనసాగుతుంది.

Show comments