YS Jagan: జిల్లా కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష సమావేశం! కీలక ఆదేశాలు..

జిల్లా కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష సమావేశం! కీలక ఆదేశాలు..

YS Jagan: గురువారం సీఎం జగన్ మోహన్ రెడ్డి..జిల్లా కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.  పెన్షన్లు, ఆసరా, చేయుతా పథకాలపై అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్.. అధికారులకు కీలక సూచనలు చేశారు

YS Jagan: గురువారం సీఎం జగన్ మోహన్ రెడ్డి..జిల్లా కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.  పెన్షన్లు, ఆసరా, చేయుతా పథకాలపై అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్.. అధికారులకు కీలక సూచనలు చేశారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేందుకు ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టారు. అర్హులైన ఏ ఒక్కరు పథకాలను కోల్పోకూడదనే ఆలోచనతో సీఎం జగన్ ముందుకెళ్తున్నారు. ఇటీవలే పెన్షన్ ను రూ.3000 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పెంచిన పెన్షన్ వచ్చే ఏడాది జనవరి నుంచి అమలు కానుంది.  ఇక తాజాగా సీఎం జగన్ ..జిల్లా కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.  పెన్షన్లు, ఆసరా, చేయుతా పథకాలపై అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్.. అధికారులకు కీలక సూచనలు చేశారు.

గురువారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో సమావేశమయ్యారు. పెన్షన్లు, ఆసరా, చేయూత పథకాలపై సీఎం సమీక్ష జరిపారు. అంబేద్కర్‌ విగ్రహం ప్రారంభోత్సవం తదితర కార్యక్రమాలపై కలెక్టర్లకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. వచ్చే ఏడాది మొదటి రెండు నెలల్లో జరగనున్న కార్యక్రమాలపై సమీక్షించారు.

జనవరిలో 3, ఫిబ్రవరి నెలలో 1, మొత్తంగా నాలుగు ప్రధానమైన కార్యక్రమాలు నిర్వహించనున్నామని సీఎం తెలిపారు. ఆ ప్రోగ్రామ్స్ లో ఎక్కడా కూడా చిన్న పొరపాటు లేకుండా చూసుకోవాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. ప్రతి కార్యక్రమానికి ప్రీ లాంచ్‌, లాంచ్‌, పోస్ట్‌ లాంచ్‌ అనేవి ఉంటాయని, వాటిని సక్రమంగా నడిచేలా కలెక్టర్లు షెడ్యూల్‌ చేసుకోవాలని సీఎం తెలిపారు. జనవరి నుంచి వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక రూ.3 వేలకు పెంచుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని పూర్తిగా నెరవేరుస్తున్నామని ఆయన తెలిపారు. విశ్వసనీయతకు ఈ ప్రభుత్వం మారు పేరు అని రుజువు చేస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు.

ఈ ప్రభుత్వం రాకముందు ఎన్నికలకు 2 నెలల ముందు వరకూ పెన్షన్ కేవలం రూ.1000 మాత్రమే ఇచ్చేవారని, వైఎస్సాఆర్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2,250 లు చేశామని సీఎం తెలిపారు. ఇప్పుడు రూ.3 వేల వరకూ పెంచుకుంటూ వచ్చామని పేర్కొన్నారు. అలానే గత ప్రభుత్వం నెలకు రూ.400 కోట్లు మాత్రమే సగటున పెన్షన్ల కోసం ఖర్చు చేసే వారని, ఇప్పుడు నెలకు రూ.1950 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. అదే విధంగా ఈ ప్రభుత్వం రాక ముందు పెన్షన్ల సంఖ్య 39 లక్షలు ఉండేదని, ఇప్పుడు 66 లక్షలు ఉన్నాయని తెలిపారు.

ప్రతి అడుగులోనూ కూడా ఏ లబ్ధిదారులు మిగిలిపోకూడదు, ప్రతి ఒక్కరికీ కూడా మంచి జరగాలి. ఎవ్వరూ కూడా ఇబ్బందులు పడకూడదని ఎప్పుడూ లేని విధంగా వాలంటీర్ – సచివాలయ వ్యవస్థను గ్రామస్థాయిలో తీసుకు వచ్చాం. ఆదివారమైనా, పండుగైనా సరే ఒకటో తారుఖీన చిక్కటి చిరునవ్వుతో పెన్షన్‌ను ఇంటివద్దే ఇచ్చే పరిస్థితిని, మార్పును తీసుకురాగలిగాం. ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఈ మార్పును తీసుకురాగలిగాం. ఈ మార్పును ఎలా తీసుకు రాగలిగామన్నది ప్రతి గడపకూ తెలియజేయాల్సిన అవసరం ఉంది’’ అని సీఎం పేర్కొన్నారు.

జనవరి 19న అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నామిని, అలానే జనవరి 23 నుంచి 31 వరకు ఆసరా కార్యక్రమం జరుగుతుందని సీఎం తెలిపారు.  అలానే వైఎస్సార్ చేయూత కార్యక్రమం ఫిబ్రవరి 5 నుంచి 14 వరకూ కొనసాగుతుందని, ఈ కార్యక్రమాలను ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. అలానే 66,34,742 మందికి రూ.1968 కోట్లకు పైగా పెన్షన్ల రూపంలో అందుతాయని సీఎం తెలిపారు. పెంచిన పెన్షన్ల అందించే కార్యక్రమం 8 రోజుల పాటు జరగనుందని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో వలంటీర్లు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలని సీఎం  పేర్కొన్నారు. అంతేకాక పలు అంశాలపై సీఎం జగన్.. కలెక్టర్లతో ప్రస్తావించారు. మరి.. సీఎం జగన్ సమావేశంలో తెలిపిన అంశాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments