Chandrababu Eye Operation: చంద్రబాబు వచ్చిన పని ముగిసింది! తరువాత ఏంటంటే..

చంద్రబాబు వచ్చిన పని ముగిసింది! తరువాత ఏంటంటే..

మాజీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టై 52 రోజుల పాటు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చిన చంద్రబాబు కంటి ఆపరేషన్ విజయవంతంగా పూరైంది.

మాజీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టై 52 రోజుల పాటు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చిన చంద్రబాబు కంటి ఆపరేషన్ విజయవంతంగా పూరైంది.

మాజీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టై 52 రోజుల పాటు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇటీవ‌ల ఆయ‌న‌కు ఆరోగ్యపరమైన సమస్యల నేపథ్యంలో న్యాయ స్థానం మ‌ధ్యంత‌ర బెయిల్ ఇచ్చింది. అనారోగ్యం. కంటి ఆప‌రేష‌న్ చేయించుకోవాల‌ని వైద్యులు సూచించార‌ని, కావున మధ్యంతర బెయిల్ మంజూరు చేయాల‌ని చంద్ర‌బాబు విజ్ఞ‌ప్తికి  హైకోర్టు సానుకూలంగా స్పందించింది. చంద్రబాబుకు నాలుగు వారాల పాటు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. అయితే చంద్రబాబు వచ్చిన కంటి ఆపరేషన్ పని ముగిసింది.

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అరెస్టైన తొలి రోజే చంద్రబాబు బయటకు వస్తారని అందరూ భావించారు. కానీ రోజూలు గడుస్తూనే కొద్ది చంద్రబాబుకు కోర్టులో ఊరట కంటే ఎదురు దెబ్బలు తగులుతూ వచ్చాయి.  ఆయన తరపు లాయర్లు వేసిన పిటిషన్లను కోర్టులు కొట్టేశాయి. ఇక చంద్రబాబు జైల్లోనే ఉంటారనే టీడీపీ నేతలు నిరాశలో  ఉండిపోయారు. ఈక్రమంలోనే అనారోగ్య సమస్యల కారణం చూపించి.. చంద్రబాబు మధ్యతర బెయిల్ కి హైకోర్టు లో పిటిషన్ వేశారు.

నాలుగు వారాల పాటు ఆయ‌న‌కు మ‌ధ్యంత‌ర బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. ఈ నెల 28న తిరిగి జైలుకు వెళ్లాల్సి వుంటుంద‌ని న్యాయ స్థానం స్ప‌ష్టం చేసింది. అయితే ఈ లోపు చంద్ర‌బాబు ఆరోగ్యంగా వుంటే స‌రి, లేదంటే మ‌రికొంత కాలం బెయిల్‌ను పొడిగించే అవ‌కాశం వుందనే టాక్ వినిపిస్తోంది. చంద్ర‌బాబుకు ఏదో ఒక అనారోగ్యం వ‌స్తుంద‌ని , ఆయ‌న మ‌ధ్యంత‌ర బెయిల్‌పై మ‌రికొంత కాలం ఇంటిప‌ట్టునే వుంటూ, రాజ‌కీయాలు చేస్తార‌ని టీడీపీ నేత‌లు, కార్యకర్తలు ఆశతో వున్నారు. ఎల్వీ ప్ర‌సాద్ ఆస్ప‌త్రిలో చంద్ర‌బాబుకు మంగ‌ళ‌వారం కుడి కంటి ఆప‌రేష‌న్ విజ‌య‌వంతంగా ముగిసింది. దాదాపు 45 నిమిషాల పాటు ఆప‌రేష‌న్ చేసినట్లు వైద్యులు వెల్లడించారు. ఆప‌రేష‌న్ అనంత‌రం ఆయ‌న జూబ్లిహిల్స్ లోని తన నివాసానికి వెళ్లారు.

గ‌తంలో ఆయ‌న ఎడ‌మ కంటికి శ‌స్త్ర చికిత్స జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఆప‌రేష‌న్ ముగియ‌డంలో చంద్ర‌బాబు ఏ అవ‌స‌రం కోసం వ‌చ్చారో, ఆ ప‌ని నెర‌వేరింద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. చంద్ర‌బాబు కంటి ఆప‌రేష‌న్ ముగించుకుని , త్వరలో రాజ‌కీయ కార్య‌క‌లాపాల‌ను వేగ‌వంతం చేయ‌నున్నారని టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే  కోర్టు పెట్టిన షరులతో అలాంటివి జరగపోవచ్చని రాజకీయ  విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. కోర్టు ఆదేశాలను పాటించకుంటే తిరిగి చంద్రబాబు తిరిగి జైలుకి వెళ్తారని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక చంద్రబాబు కేసుల విషయానికి వస్తే.. స్కిల్ డెవలప్మెంట్ స్కాంతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్డు, మద్యం అక్రమాలు, అంగళ్ల అల్లర్లు, ఫైబర్ నెట్ వంటి కేసులు  ఉన్నాయి.

Show comments