7 ప్రభుత్వ ఉద్యోగాలు.. AP యువతి టాలెంట్ కి హ్యాట్సాఫ్!

ఈ కాలంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం లక్షల మంది ఎదురు చూస్తుంటారు. పదవ తరగతి నుంచి మొదలు పెడితే.. డిగ్రీ, పీజీ చేసి మంచి ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుంటారు.

ఈ కాలంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం లక్షల మంది ఎదురు చూస్తుంటారు. పదవ తరగతి నుంచి మొదలు పెడితే.. డిగ్రీ, పీజీ చేసి మంచి ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుంటారు.

నేటి సమాజంలో ప్రభుత్వ ఉద్యోగానికి ఎంత ప్రాధాన్య ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఉన్నత విద్యనభ్యసించి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి మంచి పొజీషన్ లో ఉందాలని కోరుకుంటారు. ఉన్నత విద్యనభ్యసించడానికి పదవ తరగతి నుంచే పునాధి వేస్తుంటారు. ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించడం అంటే అంత ఆశామాశీ వ్యవహారం కాదు. అందుకోసం ఎంతో కష్టపడి చదావాల్సి ఉంటుంది.. ఒక్కసారి ప్రభుత్వ ఉద్యోగం సంపాదిస్తే.. లైఫ్ సెటిల్ మెంట్ అయినట్లే అని నిరుద్యోగ యువత భావిస్తుంటారు. ఇందుకోసం సంవత్సరాల తరబడి ఎదురు చూస్తుంటారు. కానీ ఓ యువతి ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఏడు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించి అందరినీ ఆశ్చర్యపరిచింది. వివరాల్లోకి వెళితే..

ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా దవళేశ్వరం కి చెందిన అంబటి కీర్తి నాయుడు తన టాలెంట్ తో ఇప్పుడు సోషల్ మీడియాలో అందరిచే శభాష్ అనిపించుకుంటున్నారు. కీర్తి నాయుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నోటిఫికేషన్లలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఏడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అందరిచే ప్రశంసలు అంటుకుంది. ఆమె టాలెంట్ కి ప్రతి ఒక్కరూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు. కీర్తి నాయుడు ఎడ్యూకేషన్ విషయానికి వస్తే.. 2019 లో డిగ్రీ పూర్తి చేసింది. సివిల్స్ సాధించాలన్న పట్టుదలతో అహర్శిశలూ కష్టపడి చదువుతూ వచ్చింది. సీనియర్ల నుంచి తగు సలహాలు, సూచనలు తీసుకుంటూ వచ్చింది. ఈ క్రమంలోనే మొదట 2019 లో కేంద్ర ప్రభుత్వం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రిలీజ్ చేసిన నోటిఫికేషన్ లో కీర్తి నాయుడు ఆదాయపన్ను శాఖ ఉన్నతాధికార ఉద్యోగాన్ని సంపాదించింది. కానీ ఆమె మనసు దానితో సంతృప్తి చెందలేదు.

కస్టమ్స్ విభాగంలో ట్యాక్స్ అసిస్టెంట్ ఉగ్యోగం సంపాదించింది.. ఆ తర్వాత 2022 మార్చిలో మరోసారి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇంటర్ బెస్డ్ జాబ్స్ విభాగంలో ఎంటీఎస్ ఉద్యోగం, భారత రైల్వే శాఖలో ఉన్నతాధికారి ఉద్యోగం, పోస్టల్ విజులెన్స్ విభాగంలో మరో ఉన్నత హోదాలో ఉద్యోగం సాధించింది. అంతే కాదు ఏపీలో ఇటీవల రిలీజ్ చేసిన నోటిఫికేషన్ లో గ్రామ కార్యదర్శి పోస్ట్ కి ఎంపికైంది. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్, జీఎస్టీ ఇన్స్ పెక్టర్ గా మరో ఉద్యోగం సంపాదించింది. కీర్తి నాయుడికి ఉన్న టాలెంట్ కి పలు ప్రైవేట్ కంపెనీలు కూడా సాధరంగా ఆహ్వానం పలికాయి. 2019 లో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత కీర్తి నాయుడికి ఆరు సాప్ట్ వేర్ కంపెనీల నుంచి ఉద్యోగాలు వచ్చాయిన ఆమె తండ్రి అడ్వకేట్ అయిన మురళీ కృష్ణ తెలిపారు. తనకు వచ్చిన ఉద్యోగాలు కాదని.. ప్రస్తుతం సివిల్స్ సాధించాలనే పట్టుదల, లక్ష్యంతో కీర్తి ప్రిపరేషన్ లో ఉన్నట్లు ఆయన తెలిపారు. విద్యా, విజ్ఞానం ఉంటే.. ఏ ఉద్యోగం అయినా సాధించవొచ్చు అని కీర్తి నాయుడు రుజువు చేసింది.. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments