APవిద్యుత్ సంస్థలకు ప్రతిష్టాత్మక అవార్డులు!

ఆంధ్రప్రదేశ్ లోని విద్యుత్ సంస్థలు తాజాగా పలు ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకున్నాయి. ఈ క్రమంలో సీఎం జగన్ ఆ సంస్థల ఉన్నత అధికారులను అభినందించారు.

ఆంధ్రప్రదేశ్ లోని విద్యుత్ సంస్థలు తాజాగా పలు ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకున్నాయి. ఈ క్రమంలో సీఎం జగన్ ఆ సంస్థల ఉన్నత అధికారులను అభినందించారు.

ఆంధ్రప్రదేశ్ లో సమర్ధవంతమైన పాలన కొనసాగుతుందని నిరూపించేందుకు.. విద్యుత్ శాఖ జాతీయ స్థాయిలో అవార్డులను తన సొంతం చేసుకుంది. దేశంలో సమర్ధవంతమైన నిర్వహణతో మెరుగైన ఫలితాలను కనబరిచిన విద్యుత్ శాఖలకు.. ఇలాంటి అవార్డులను ఇస్తారు. ఈ క్రమంలో ఇటీవల ఢిల్లీలో జరిగిన నిర్వహించిన 15వ ఎనర్షియా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో.. ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, డెవలప్‌మెంట్‌ విషయంలో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఏపీ ఎంపికైంది. ఈ క్రమంలోనే విద్యుత్‌ సమర్థ వినియోగంలో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్ధాయిలో మూడు అవార్డులు గెలుచుకుంది. ఈ విషయమై సీఎం జగన్ ఈ శాఖకు సంబంధించిన అధికారులను అభినందించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ అవార్డులకు ఎంపిక అవ్వడంతో పాటు.. దేశంలోనే అత్యుత్తమ ట్రాన్స్‌మిషన్‌ యుటిలిటీగా ఏపీ ట్రాన్స్‌కో ఈ అవార్డును సొంతం చేసుకుంది. అలానే న్యూ అండ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌(NREDCAP) కూడా ఎనర్షియా అవార్డును గెలుచుకుంది. ఈ క్రమంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే.విజయానంద్, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ బి. శ్రీధర్, NREDCAP ఎండీ ఎస్‌. రమణా రెడ్డి, ట్రాన్స్‌కో జేఎండీ ఐ. పృథ్వి తేజ్, ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ (విజిలెన్స్‌) బి.మల్లారెడ్డి, APCPDCL సీఎండీ పద్మాజనార్ధన్‌ రెడ్డి లాంటి అధికారులు చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌ రెడ్డితో కలిసి సీఎం జగన్ ను కలిశారు. వారు గెలుచుకున్న అవార్డులను ముఖ్యమంత్రికి చూపించి.. వాటి గురించి పూర్తి వివరాలను తేలియజేశారు. ఈ విషయమై వారికీ అభినందనలు తెలియజేసిన జగన్.. ఇకపై మరింత ఉత్సాహంతో పనిచేస్తూ.. ప్రభుత్వానికి సహరిస్తూ.. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సేవలను అందించాలని పేర్కొన్నారు. విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం ఎప్పుడూ తమ వంతు సహకారం అందిస్తుందని కూడా వ్యక్తపరిచారు.

కాగా, ప్రస్తుతం ప్రభుత్వం నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే సమయానికి.. ప్రజలకు విద్యుత్, మంచి నీరు, డ్రైనేజీ సదుపాయాలు అందుబాటులోకి వచ్చేలా వసతులు కల్పించాలని.. అధికారులను ఆదేశించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. APTIDCO మాత్రమే కాకుండా ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం కూడా రూ. 6,435 కోట్లను ఖర్చు చేసిందని వెల్లడించారు. ఇక సీఎం జగన్ జనవరి 3న రాజమండ్రిలో జరగనున్న పెంచిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఏదేమైనా ఏపీ విద్యుత్ శాఖ సంస్థలు తమదైన శైలిలో సమర్థవంతంగా పని తీరును కనబరుస్తున్నాయని చెప్పి తీరాలి. మరి, ఏపీ విద్యుత్ సంస్థలు గెలుచుకున్న ప్రతిష్టాత్మకమైన అవార్డులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments