Breaking : శ్రీలంక అధ్యక్షుడు మహీందా రాజపక్స రాజీనామా

Breaking : శ్రీలంక అధ్యక్షుడు మహీందా రాజపక్స రాజీనామా

గత కొన్నిరోజులుగా శ్రీలంకలో ఆర్ధిక సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. నిత్యావసర వస్తువులతో పాటు, అన్ని వస్తువులు భారీగా ధరలు పెరిగాయి. ప్రజలకి తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రజలు రోడ్ల మీదకొచ్చి నిరసనలు తెలియచేశారు. అధికార పార్టీ నేతలు రాజీనామా చేయాలని ఆందోళనలు నిర్వహించారు.

ఈ నేపథ్యంలో ఇప్పటికే లంకలో రెండు సార్లు ఎమర్జెన్సీ విధించారు. అయినా ప్రజలు, విపక్ష నేతలు నిరసనలు కొనసాగిస్తున్నారు. ప్రధాని మహీందా రాజపక్స రాజీనామా చేయాలని ఆందోళనలు రోజు రోజుకి ఉధృతం చేస్తున్న నేపథ్యంలో తాజాగా శ్రీలంక ప్రధానమంత్రి మహీంద రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఒక్కసారిగా శ్రీలంకలో రాజకీయ సంక్షోభం నెలకొంది. అయన రాజీనామా తర్వాత అక్కడి పరిస్థితులు ఎలా మారనున్నాయి అని ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తుంది.

Show comments