OTT Suggestions- Must Best Crime Thriller: ఒక్క కిడ్నాప్.. ఊరంతా అనుమానితులే.. OTTలో ఈ సిరీస్ కి నరాలు తెగిపోతాయ్!

ఒక్క కిడ్నాప్.. ఊరంతా అనుమానితులే.. OTTలో ఈ సిరీస్ కి నరాలు తెగిపోతాయ్!

OTT Suggestions- Must Watch Best Crime Thriller: మీరు ఒక మంచి ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ చూడాలి అనుకుంటున్నారా? అయితే ఓటీటీలో మీకోసం ఒక అదిరిపోయే సిరీస్ అందుబాటులో ఉంది. ఆ మూవీ ఏంటో చూడండి.

OTT Suggestions- Must Watch Best Crime Thriller: మీరు ఒక మంచి ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ చూడాలి అనుకుంటున్నారా? అయితే ఓటీటీలో మీకోసం ఒక అదిరిపోయే సిరీస్ అందుబాటులో ఉంది. ఆ మూవీ ఏంటో చూడండి.

ఎన్ని సినిమాలు చూసినా కూడా ఒక పర్ఫెక్ట్ క్రైమ్ థ్రిల్లర్ చూడకపోతే కచ్చితంగా శాటిస్ ఫ్యాక్షన్ ఉండదు. అలాంటి అలవాటు ఉన్న వారికోసం ఒక అదిరిపోయే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఒకటి ఓటీటీలో అందుబాటులో ఉందని తెలుసా? నిజానికి మీరు ఈ సిరీస్ ని కనీసం రెండేళ్ల క్రితమే చూసుండాల్సింది. కానీ, ఎవరైతే ఒక అద్భుతమైన సిరీస్ ని మిస్ అయ్యారో.. వారికోసం దీనిని సజీషన్ రూపంలో తీసుకొచ్చాం. హత్యలు, ఇన్వెస్టిగేషన్, ట్విస్టులు, ఛేజింగ్ లు వంటి అంశాలు మీకు గనుక ఇంట్రస్ట్ ఉంటే.. ఈ క్రైమ్ సిరీస్ మీకు కచ్చితంగా నచ్చేస్తుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. మరి.. ఆ సిరీస్ ఏంటో చూద్దాం.

ఈ మూవీ మొత్తం ఒక కిడ్నాప్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఒక ఫార్నర్ మహిళ కూతురు, ఆమె ప్రియుడు ఇద్దరూ కనిపించకుండా పోతారు. ఆ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. చుట్టూ మంచు కొండలు పెద్ద పెద్ద అడవులు ఉంటాయి. అంత పెద్ద అడవుల్లో ఇద్దరి ఆచూకీ కనుక్కోవడం అంటే అంత చిన్న విషయం కాదు. పైగా ఆ కేసు ఏంటి అనేది కూడా ఎవరికీ ఒక ఐడియా ఉండదు. నిజానికి ఒక మిస్సింగ్ కేసులాగానే ఫైల్ చేసినప్పటికీ అది చివరకు ఒక హత్య కేసుగా మారిపోతుంది. అక్కడ అందరూ అనుమానితులుగానే కనిపిస్తూ ఉంటారు.

ఈ కేసులో ఎవరి వర్షన్ వారికి ఉంటుంది. ఒక పట్టాన ఈ కేసు ఒక కొలిక్కి రాదు. మరోవైపు రవీనా టాండన్ ఆ కేసును టేకప్ చేస్తుంది. కెరీర్లో ఒక పెద్ద కేసును ఛేదించాలి అని ఆరాటపడుతూ ఉంటుంది. కానీ, పెద్ద కేసు వచ్చేసరికి ఆమె సీటు నుంచి తప్పుకుంటూ ఉంటుంది. ఈ కేసును మాత్రం ఎలాగైనా ఛేదించాల్సిందే అని కంకణం కట్టుకుంటుంది. అందుకోసం తన ఎస్ హెచ్ వోగా తప్పుకుని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది. ఇందులో ఉండే ప్రతి పాత్ర మీకు సస్పెక్ట్ లాగానే కనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఏదో ఒక నిజాన్ని దాచిపెడుతున్నారు అనే భావన కలుగుతుంది. కేసు ఎన్నో మలుపులు తిరుగుతూ ఉంటుంది.

ఇలాంటి ఒక ఇన్వెస్టిగేషన్ స్టోరీ మీరు చూసి నిజానికి చాలారోజులు అయ్యే ఉంటుంది. ఈ సిరీస్ కి కథ ప్రాణం.. ఆ తర్వాత నటీనటులు కూడా ఆ కథను నిలబెట్టడానికి ఎంతో అద్భుతంగా నటించారు. ఈ వెబ్ సిరీస్ పేరు ‘అరణ్యక్‘. ఇది నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అవుతోంది. నిజానికి ఈ వెబ్ సిరీస్ 2021లోనే విడుదలైంది. కాకపోతే చాలామంది దీనిని లైట్ తీసుకున్నారు. ఐఎండీబీలో దీనికి 7.8 రేటింగ్ ఉంది. మరి.. మీరు ఇప్పటికే ఈ సిరీస్ చూసుంటే మాత్రం మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments