అందం, తెలివి ఉన్న భార్య.. ఆశ చావని భర్త.. చివరికి?

అందం, తెలివి ఉన్న భార్య.. ఆశ చావని భర్త.. చివరికి?

హైదరాబాద్ లో ఘోరం చోటుచేసుకుంది. బంగారం లాంటి భార్యను భర్త ఘోరంగా అంతమొందించాడు. కుటుంబకలహాలతో దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన బాచుపల్లిలో చోటుచేసుకుంది.

హైదరాబాద్ లో ఘోరం చోటుచేసుకుంది. బంగారం లాంటి భార్యను భర్త ఘోరంగా అంతమొందించాడు. కుటుంబకలహాలతో దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన బాచుపల్లిలో చోటుచేసుకుంది.

నిండు నూరేళ్లు అన్యోన్యంగా కలిసి జీవించాల్సిన భార్యాభర్తలు క్షణికావేశాలతో దారుణాలకు ఒడిగడుతున్నారు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సర్వసాధారణమే. గొడవల కారణంగా షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆర్థిక సమస్యలు, ఒకరిపై ఒకరు పెత్తనం చెలాయించడం, ఈగోలకు పోవడం వంటి కారణాలు భార్యాభర్తల మధ్య గొడవలకు కారణమవుతున్నాయి. కుటుంబకలహాలకు కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ భర్త సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అయిన తన భార్యను అతి కిరాతకంగా అంతమొందించాడు. ఈ ఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

హైదరాబాద్ లో కుటుంబకలహాలకు ఓ వివాహిత బలైపోయింది. భర్త నాగేంద్ర భరద్వాజ.. భార్య మధులత(సాఫ్ట్ వేర్) ని హత్య చేశాడు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సాయి అనురాగ్ కాలనీలో భార్య మధులతను కత్తితో పొడిచి అంతమొందించాడు భర్త నాగేంద్ర భరద్వాజ. ఆ తర్వాత శరీరాన్ని ముక్కలుగా చేసేందుకు ప్రయత్నించాడని.. అది విఫలం కావడంతో గ్యాస్ లీకేజ్ చేసి ప్రమాదంగా చిత్రీకరించే యత్నం చేశాడని మృతురాలి తండ్రి తెలిపారు. మృతురాలి తండ్రి రంగనాయకులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈనెల ఐదున ఈ ఘటన జరిగినట్లు పోలీసుల నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడిని తాజాగా అరెస్టు చేశారు.

అయితే కొంత కాలంగా ఈ దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయని ఆమె తండ్రి తెలిపారు. అదనపు కట్నం కోసం తమ కూతురుని వేధించే వాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. నిందితుడి కుటుంబసభ్యులు కూడా తమ కూతురును వేధించేవారని చెప్పారు. వీరికి 2020లో వివాహం జరిగిందని వీరికి ఒక కుమారుడు ఉన్నట్లు వెల్లడించారు. కూతురే లోకంగా బ్రతికిన తల్లిదండ్రులకు ఆమె దారుణ హత్యకు గురికావడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని పోలీసులను వేడుకుంటున్నారు.

Show comments