నటి హేమ లవ్ స్టోరీ తెలుసా..? వీరి ప్రేమ కథ ఎక్కడ మొదలైందంటే?

నటి హేమ లవ్ స్టోరీ తెలుసా..? వీరి ప్రేమ కథ ఎక్కడ మొదలైందంటే?

వందలకొద్ది సినిమాల్లో నటించిన హేమ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. నటి హేమ విభిన్నమైన పాత్రలు పోషించి అలరించింది. నటి హేమకు ఓ లవ్ స్టోరీ ఉంది. వారి ప్రేమ ఎలా మొదలయ్యిందంటే?

వందలకొద్ది సినిమాల్లో నటించిన హేమ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. నటి హేమ విభిన్నమైన పాత్రలు పోషించి అలరించింది. నటి హేమకు ఓ లవ్ స్టోరీ ఉంది. వారి ప్రేమ ఎలా మొదలయ్యిందంటే?

ఇటీవల మీడియా, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన అంశం ఏదైనా ఉందంటే అది బెంగళూరు రేవ్ పార్టీ మాత్రమే. ఈ పార్టీలో తెలుగు సినీ ఇండస్ట్రీలోని పలువురు నటులు పాల్గొన్నట్లు టాక్ వినిపించగా ఇండస్ట్రీలో కలకలం రేగింది. అయితే ఈ రేవ్ పార్టీ కేసు లిస్ట్ లో నటి హేమ ఉన్నట్టు బెంగళూరు పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారింది. అయితే నటి హేమ తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో కలిపి వందలాది సినిమాల్లో నటించి మెప్పించింది. కాగా నటి హేమకు ఓ లవ్ స్టోరీ ఉంది. ఆమె ప్రేమ ఎలా ప్రారంభమైందంటే?

ఎన్నో ఏళ్ల నుంచి నటి హేమ పలు సినిమాల్లో విభిన్నమైన పాత్రలను పోషిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. 1989లో బలకృష్ణ హీరోగా నటించిన ‘భలేదొంగ’ చిత్రం ద్వారా ఆమె వెండితెరకు పరిచయమయ్యారు. కాగా హేమ అసలు పేరు కృష్ణవేణి. ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లా, రాజోలుకి చెందిన వారు. హేమకి గుర్తింపు తీసుకొచ్చిన సినిమా క్షణక్షణం. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హేమ శ్రీదేవికి స్నేహితురాలుగా నటించారు. ఈ సినిమాతో హేమకి గుర్తింపు లభించింది.

నటి హేమ ప్రేమ విషయానికి వస్తే.. సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తితోనే ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. హేమ భర్త పేరు సయ్యద్ జాన్ అహ్మద్. గతంలో ఓ ఇంటర్య్వూలో హేమ మాట్లాడుతూ.. నేను దూరదర్శన్ లో వర్క్ చేసినప్పుడు ఆయన పరిచయం అయ్యారు. అక్కడే తను కూడా అసిస్టెంట్ గా కెమెరా మెన్ గా పనిచేస్తూ ఉండేవారు. ఓరోజు కలిసిన ఫస్ట్ మీటింగ్ లోనే జాన్ పెళ్లి చేసుకుంటానని ప్రపోజల్ పెట్టారు. అప్పుడు నా వయస్సు18 దాటుతోంది. కలిసిన వెంటనే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో మోసం చేసే వ్యక్తి కాదని అర్థమైంది. దీనికి హేమ ఎస్ చెప్పడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఈషా అనే కూతురు ఉంది.

Show comments