OTT Suggestions- Best Sci Fi Web Series: అక్కడ బతకడం కంటే చావే సుఖం.. OTTలో ఓపెన్ హైమర్ ని మించిన సిరీస్!

అక్కడ బతకడం కంటే చావే సుఖం.. OTTలో ఓపెన్ హైమర్ ని మించిన సిరీస్!

OTT Suggestions- Best Sci Fi Series: మీరు ఇప్పటివరకు కనీసం ఒకటైనా సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ సినిమానో, సిరీసో చూసుంటారు. కానీ, ఈ సిరీస్ చూస్తే మాత్రం అవన్నీ మర్చిపోతారు. ఇన్నాళ్లు ఈ సిరీస్ ని ఎలా మిస్ అయ్యాం అంటూ నోరెళ్లబెట్టేస్తారు.

OTT Suggestions- Best Sci Fi Series: మీరు ఇప్పటివరకు కనీసం ఒకటైనా సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ సినిమానో, సిరీసో చూసుంటారు. కానీ, ఈ సిరీస్ చూస్తే మాత్రం అవన్నీ మర్చిపోతారు. ఇన్నాళ్లు ఈ సిరీస్ ని ఎలా మిస్ అయ్యాం అంటూ నోరెళ్లబెట్టేస్తారు.

సినిమా అంటే ఎప్పుడూ యాక్షన్, కామెడీ, ఎమోషన్ మాత్రమే కాకుండా.. వివధ రకాల కథలు, కథనాలు ఉంటాయి. వాటిలో వార్ బేస్డ్, సైఫై సినిమాలు సిరీస్లు కూడా ఉంటాయి. సరిగ్గా తీస్తే సైంటిఫిక్ థ్రిల్లర్స్ కి పిచ్చెక్కిపోతుంది. ఇప్పటివరకు మీరు అలాంటి కొన్ని సైఫై సినిమాలు చూసే ఉంటారు. ఇటీవలి కాలంలో ఓపెన్ హైమర్ కూడా వచ్చింది. యావత్ ప్రపంచాన్ని ఈ ఓపెన్ హైమర్ ఒక ఊపు ఊపేసింది. అయితే అంతకన్నా ముందే.. ఓపెన్ హైమర్ ని మించిన ఒక కథతో ఒక వెబ్ సిరీస్ వచ్చిందని మీకు తెలుసా? ఒక్కో ఎపిసోడ్ కి మీకు ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఒక్కో సీన్ కి పిచ్చెక్కిపోతారు.

సాధారణంగా వెబ్ సిరీస్లు చూసే అలవాటు ఉన్నవారికి ఈ సిరీస్ పేరు తెలిసే ఉంటుంది. ఎక్కువగా నెట్ ఫ్లిక్స్ ఫాలో అయ్యేవారికి ఈ సిరీస్ తారసపడే ఉంటుంది. ఇది ఒక కంప్లీట్ సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్. సైన్స్ తో వీళ్లు చేసే దారుణాలు, ప్రయోగాలు, వింత పనులు చూసి నోరెళ్లబెట్టాల్సిందే. ఓపెన్ హైమర్ సినిమా మొత్తం న్యూక్లియర్ బాంబుని తయారు చేయడం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అలాగే ఈ మూవీలో కూడా ఒక న్యూక్లియర్ వెపన్ చుట్టూనే కథ తిరుగుతూ ఉంటుంది. అయితే ఆ ప్రయోగం వల్ల అక్కడ జరిగిన నష్టం ఎంత? అక్కడ అసలు మనిషి జీవితం ఎంత అస్తవ్యస్తమైంది? వంటి విషయాలను వివరిస్తూ ఈ కథ సాగుతూ ఉంటుంది.

కొందరి దుర్భుద్ది కారణంగా భూమి మీద మనిషి మనుగడే ప్రశ్నార్థకం అయ్యేలా పరిస్థితులు మారిపోతాయి. ఆ ప్రయోగంలో ఒక కుర్రాడు అదృశ్యమవుతాడు. అసలు ఆ పిల్లాడు ఎక్కడకు వెళ్లాడు? ఆ ప్రయోగం చేశాక వారి జీవితాలు ఎలా మారిపోయాయి? అంతమంది జీవితాలను బలి తీసుకుని ఆ ప్రయోగంతో వాళ్లు సాధించింది ఏంటి? ఈ కథలో ఒక గుహ ఉంటుంది. ఆ గహలో ఏముంది? అనే విషయాలను చాలా ఇంట్రెస్టింగ్ వేలో వివరించారు. అంతేకాకుండా.. ఈ సిరీస్ ల మొతత్ం ఒక మూడు టైమ్ లైన్స్ లో నడుస్తూ ఉంటుంది. ఒక దగ్గర జరిగిన ఘటన మరో టైమ్ లైన్ పై ప్రభావం చూపుతూ ఉంటుంది.

అసలు ఆ కనెక్షన్ ఎలా వచ్చింది? ఈ ట్రైయాలజీ సంగతి ఏంటి? ఈ మూడు టైమ్ లైన్స్ లో ఏం జరుగుతోంది? వంటి ఆసక్తికర విషయాలు తెలియాలి అంటే మీరునెట్ ఫ్లిక్స్ లో ఈ బెస్ట్ సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ చూసేయాల్సిందే. ఈ సిరీస్ పేరు “డార్క్”. ఈ డార్క్ సిరీస్ లో మొత్తం 3 సీజన్స్ ఉన్నాయి. అన్నీ సీజన్స్ లో కలిపి మొత్తం 26 ఎపిసోడ్లు ఉన్నాయి. 2020 నుంచి ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మీరు ఇప్పటికే ఈ డార్క్ వెబ్ సిరీస్ చూసుంటే మీకు ఎలా అనిపించిందో? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments