OTT Movie Suggestion: మగాళ్లను తొక్కి సామ్రాజ్యాన్ని సృష్టించింది.. OTTలో ఈ మహిళ తెగువకు ఫిదా అవ్వాల్సిందే!

OTT Movie Suggestion: మగాళ్లను తొక్కి సామ్రాజ్యాన్ని సృష్టించింది.. OTTలో ఈ మహిళ తెగువకు ఫిదా అవ్వాల్సిందే!

ప్రస్తుతం ఈ మధ్య కాలం వచ్చిన వెబ్ సిరీస్ లలో ఇప్పుడు బాగా పాపులర్ అవుతున్న వెబ్ సిరీస్ హీరమండి. ఈ సిరీస్ ను చూసిన ప్రేక్షకులు ఇంకా ఇలాంటి వెబ్ సిరీస్ లు కానీ, మూవీస్ కానీ ఓటీటీ లో ఉన్నాయేమో అని సెర్చ్ చేసేస్తూ ఉన్నారు. అటువంటి వారి కోసం ఈ మూవీ.

ప్రస్తుతం ఈ మధ్య కాలం వచ్చిన వెబ్ సిరీస్ లలో ఇప్పుడు బాగా పాపులర్ అవుతున్న వెబ్ సిరీస్ హీరమండి. ఈ సిరీస్ ను చూసిన ప్రేక్షకులు ఇంకా ఇలాంటి వెబ్ సిరీస్ లు కానీ, మూవీస్ కానీ ఓటీటీ లో ఉన్నాయేమో అని సెర్చ్ చేసేస్తూ ఉన్నారు. అటువంటి వారి కోసం ఈ మూవీ.

ఏదైనా ఓ వెబ్ సిరీస్ కానీ, సినిమా కానీ బాగా పేరు తెచ్చుకుందంటే చాలు.. దానికి సంబంధించిన సిరీస్ లు, సినిమాలు ఇంకా ఏమైనా ఉన్నాయేమో అని వెతుకుతూ ఉంటారు మూవీ లవర్స్. ఇటీవల మంజుమ్మేల్ బాయ్స్ సూపర్ సక్సెస్ సాధించిన తర్వాత ఆ తరహాలో వచ్చిన వచ్చిన కొన్ని సినిమాల కోసం సెర్చ్ చేసి వాటిని కూడా చూసేసారు ప్రేక్షకులు. ఇక ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన వెబ్ సిరీస్ లలో బాగా ఫేమస్ అవుతున్న వెబ్ సిరీస్ ఏదంటే.. హీరమండి:ది డైమండ్ బజార్. ప్రస్తుతం అందరి చూపు ఈ వెబ్ సిరీస్ మీదనే ఉంది. ఇక ఈ సిరీస్ చూసిన ప్రేక్షకులు.. ఇంకా ఇలాంటి వెబ్ సిరీస్ లు కానీ, మూవీస్ కానీ ఓటీటీ లో ఉన్నాయేమో అని సెర్చ్ చేస్తూ ఉన్నారు. అచ్చం అలాంటి ఓ సినిమానే ఓటీటీ లో ఉంది కూడా.. మరి ఆ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో.. ఆ విషయాలను చూసేద్దాం.

ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా నిజజీవితాలను ఆధారంగా తీసుకుని రూపొందించిందే. ఈ సినిమా కథేంటంటే.. గుజరాత్ లోని ఓ ఉన్నత కుటుంబంలో పుట్టి పెరిగిన ఓ అమ్మాయి కథ ఇది. ఆమెకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం. ఎప్పటికైనా వెండి తెరపైన కనిపించాలని ఆమె కల. అయితే దానిని ఆసరాగా తీసుకుని ఆమె ప్రేమించిన ఓ వ్యక్తి.. ఆమెను ముంబై కు తీసుకుని వచ్చి.. ఆమెను మోసం చేసి.. ఓ వేశ్య గృహంలో అమ్మేస్తాడు. ఆమె అనుకోకుండా ఆ వేశ్య వృత్తిలోనే బందీ అయిపోతుంది. ఆ తర్వాత ఆమె జీవితం ఎలా గడిచింది ! వేశ్యగా తన జీవితాన్ని ప్రారంభించిన ఆమె ఓ నాయకురాలిగా ఎలా ఎదిగింది ! అక్కడున్న మిగిలిన మహిళల హక్కుల కోసం ఆమె ఎలా పోరాడింది ! ఈ క్రమంలో ఆమెకు ఎదురైన పరిస్థితులేంటి ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. చాలా మంది ఈ సినిమాను ఇప్పటికే ఈ సినిమాను చూసి ఉంటారు. కానీ ఇంకా ఎవరైనా ఈ సినిమాను మిస్ చేసి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి.

ఇంతకీ ఈ సినిమా పేరేంటంటే.. “గంగూభాయ్ కతియవాడి“. 2022 లో వచ్చిన ఈ సినిమా ఎంతో మంది ప్రేక్షకుల మన్ననను సంపాదించుకుంది. ఇప్పుడు హీరమండి వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించిన దర్శకుడే.. ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించారు. అతనే సంజయ్ లీలా భన్సాలీ. అలియా భట్, అజయ్ దేవగన్, సీమా పహ్వా, హుమా ఖురేషి, శాంతను మహేశ్వరి, విజయ్ రాజ్, ఇందిరా తివారీ, ఇమ్రాన్ హష్మీ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. అప్పట్లో ఈ చిత్రంలోని అలియా భట్ నటనకు విశేష ఆదరణ లభించింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంది. ఇప్పటివరకు ఈ సినిమాను పూర్తిగా ఎవరైనా చూడకుంటే మాత్రం వెంటనే చూసేయండి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments