గృహ, వాణిజ్య, మి పారిశ్రామిక వినియోగదారులకు పైపుల ద్వారా నేచురల్ గ్యాస్ ను పంపిణీ చేసేందుకు మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ హైడ్రోకార్బన్స్ డివిజన్ సమగ్ర ప్రణాళికలను రూపొందించింది. ఆటోమోబైల్ రంగానికి గ్యాస్ సరఫరా కోసం ఇప్పటికే 9 సీఎన్జీ స్టేషన్లను ప్రారంభంచిన మేఘా గ్యాస్ మరో ఐదింటిని వచ్చే మూడు నెలల్లో ప్రారంభించనుంది. మూడు రాష్ట్రాల్లో ఇప్పటికే 40 వేల మందికి పైగా గృహ వినియోగదారులకు పైపుల ద్వారా ఇంటింటికీ నేచురల్ గ్యాస్ ను పంపిణీ చేస్తున్న మేఘా గ్యాస్ మరింతగా విస్తృతంగా పంపిణీ చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, కర్ణాటక రాష్ట్రాల్లో మొత్తం 16 జిల్లాల్లో గ్యాస్ పంపిణీ కోసం పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ అథారిటీ నుంచి అనుమతులను పొందింది. మేఘా గ్యాస్ బ్రాండ్ పేరుతో మేఘా ఇంజినీరింగ్ గ్యాస్ పంపిణీ వ్యవస్థను విస్తృత స్థాయిలో ఏర్పాటు చేస్తున్నది.
5000 కిలోమీటర్ల పైప్ లైన్
వినియోగదారులకు గ్యాస్ చేరవేసేందుకు మేఘా గ్యాస్ ఇప్పటికే 1200 కిలోమీటర్ల పైపులైను వేసింది. సమీప భవిష్యత్లో మరో 5000 కిలోమీటర్ల పైపులైను మూడు రాష్ట్రాల్లో వేయనుంది. గృహ, వాణిజ్య, పారిశ్రామిక అవసరాల కోసం పైపుల ద్వారా నేచురల్ గ్యాస్ (పీఎన్జీ)ను, ఆటో మోబైల్ రంగానికి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ)ని సరఫరా చేయనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలలో గ్యాస్ గ్రిడ్ ను అభివృద్ధి పరిచేందుకు గాను ఓఎన్జీసీ నుంచి నాగాయలంక, వెస్ట్ పెనుగొండ ఆన్షోర్ గ్యాస్ క్షేత్రాలను వ్యూహాత్మకంగా పొందింది. ఈ గ్యాస్ క్షేత్రాల నుంచి రోజుకి లక్షా 30 వేల ఎస్సీఎం గ్యాస్ను తరలించనుంది. ఇందుకోసం అమెరికా నుంచి రప్పించిన మెకానికల్ రిఫ్రిజేషన్ యూనిట్లు, కంప్రెసర్లు ఇతర మెకానికల్ ప్యాకేజీలను వినియోగిస్తున్నది. ఇప్పటికే నాగాయలంక క్రేత్రం నుంచి నేచురల్ గ్యాస్ ను ఆంధ్రప్రదేశ్లోని కృష్టాజిల్లాలోని వినియోగదారులకు పంపిణీ చేస్తోంది. గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (గెయిల్) ద్వారా వివిధ వనరుల నుంచి రోజుకి 40 వేల ఎస్సీఎం నేచురల్ గ్యాస్ ను సమీకరిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ కోసం ప్రత్యేక ప్రణాళిక
ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో విస్తృతంగా పైపుల ద్వారా నేచురల్ గ్యాస్ పంపిణీ చేయడానికి ప్రణాళికలను సిద్ధం చేసింది. దీనికి తోడు ఆటోమోబైల్ రంగానికి ఇప్పటికే 9 సీఎన్జీ స్టేషన్లను ప్రారంభించిన మేఘా గ్యాస్ మూడు నెలల్లో మరో ఐదు సీఎన్జీ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం ఉన్న 9 సీఎన్జీ స్టేషన్ల ద్వారా ప్రతి నెలా 4.5 లక్షల ఎస్సీఎం గ్యా స్ ను విక్రయిస్తోంది. కొత్తగా ఏర్పాటు చేయ తలపెట్టిన 5 సీఎన్జీ స్టేషన్ల ద్వారా మరో మూడు లక్షల ఎస్సీఎం గ్యాస్ ను సరఫరా చేసే అవకాశం వుంది.
ప్రస్తుతం కృష్ణా జిల్లాలో 13 వేల మంది గృహ వినియోగదారులకు పైపుల ద్వారా నేచురల్ గ్యాస్ ను పంపిణీ చేస్తోంది. ఈ నెలాఖరు మరో రెండు వేల మంది వినియోగదారులకు పీఎన్జీ ని పంపిణీ చేయనుంది.
ప్రస్తుతం వాణిజ్య వినియోగదారులకు ప్రతినెలా 60 వేల ఎస్సీఎం గ్యాస్ను పంపిణీ చేస్తోంది. త్వరలో మరో పది వాణిజ్య వినియోగదారులకు ప్రతినెలా లక్ష ఎస్సీఎం ల గ్యాస్ను సరఫరా చేసేందుకు రంగం సిద్ధం అయింది.
స్పందన అనూహ్యం
పైపుల ద్వారా నేచురల్ గ్యాస్ ను పొందేందుకు కర్ణాటకలోని బెల్గాం, తూంకూరు జిల్లాల గృహ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారుల నుంచి అనూహ్య స్పందన వస్తున్నది. ఈ రెండు జిల్లా అంచనాలకు మించిన డిమాండ్ వస్తున్నది. ఒక్క తూంకూరు జిల్లాలోనే మొత్తం 12,500 మంది వినియోగదారులకు ప్రస్తుతం పైపుల ద్వారా గ్యాస్ సరఫరా చేస్తుండగా, ఈ నెలాఖారుకు మరో నాలుగు వేల గ్యాస్ కనెక్షన్లను ఇవ్వనుంది. వాణిజ్య వినియోగదారుల నుంచి ప్రతి నెలా లక్షా 40 వేల ఎస్సీఎం గ్యాస్ ను పంపిణీ చేస్తుండగా, త్వరలోనే ఈ డిమాండ్ రెట్టంపు కానుంది. బెల్గాం జిల్లాలో ఇప్పటికే 15వేల మంది వినియోగదారులకు పీఎన్జీని సరఫరా చేస్తుండగా త్వరలో మరో 2500 వేల మందికి సరఫరా చేసేందుకు రంగం సిద్ధం అయింది. ఈ జిల్లాలో వాణిజ్య వినియోగదారులకు సరఫరా చేస్తున్న గ్యాస్ నెలకు 2,10,000 ఎస్సీఎం కు చేరుకుంది. సమీప భవిషత్ లో మరో 3 లక్షల ఎస్సీఎం గ్యాస్ సరఫరా చేసే అవకాశం వుంది. ఈ రెండు జిల్లాల్లో నాలుగు సీఎన్జీ స్టేషన్లను ఏర్పాుటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. పరిశ్రమల్లో నేచురల్ గ్యాస్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు గాను పరిశ్రమల కోసం ప్రత్యేక ప్రణాళికను మేఘా గ్యాస్ రూపొందించింది.
అతి తక్కువ పెట్టుబడి అవసరమయ్యే ఆకర్షణీయ ప్యాకేజీలతో పథకాలను సిద్ధం చేసింది. పెట్టే పెట్డుబడిని తర్వాతి కాలంలో తరుగుదల రూపంలో తిరిగి పొందే విధంగా ఈ ప్రణాళికలను ఉండడంతో పరిశ్రమలు గ్యాస్ వినియోగానికి ఆసక్తి చూపుతున్నాయి.
తెలంగాణాలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్ అర్భన్, వరంగల్ రూరల్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అతి త్వరలో గ్యాస్ పంపిణీకి సన్నహాలను చేస్తోంది. ఇప్పటికే యాదాద్రి భువనగిరి, వరంగల్ రూరల్ జిల్లాల్లో 12 కిలోమీటర్ల మేర పైపులైను వేయగా వచ్చే మూడు నెలల్లో మిగతా జిల్లాల్లో పైప్లైను పనులను విస్తరించి సేవలను ప్రారంభించడానికి సన్నద్ధం అవుతున్నది.
గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను రూపొందించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రణాళిక కలలను సాకారం చేసేందుకు మేఘా గ్యాస్ కృతనిశ్చయంతో ఉంది. ప్రతి ఇంటికి పరిశుభ్రమైన ఇంధనాన్ని సరఫరా చేయడంతో పాటు తమకు కేటాయించిన ప్రాంతాలలో పర్యవరణం కలుషితం కాకుండా బాధ్యతను మేఘా గ్యాస్ నెరవేర్చేందుకు సిద్ధమవుతున్నది.