iDreamPost

IPL 2024 ఛాంపియన్​గా KKR.. కప్ గెలిచినందుకు ఎన్ని కోట్లు వచ్చాయంటే?

  • Published May 27, 2024 | 11:19 AMUpdated May 27, 2024 | 11:28 AM

ఐపీఎల్-2024లో ఛాంపియన్​గా అవతరించింది కోల్​కతా నైట్ రైడర్స్. ఫైనల్ ఫైట్​లో సన్​రైజర్స్​ను ఓడించి కప్పును సొంతం చేసుకుంది అయ్యర్ సేన. ఈ నేపథ్యంలో ఆ టీమ్​కు ఎన్ని కోట్లు ప్రైజ్​మనీగా వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ఐపీఎల్-2024లో ఛాంపియన్​గా అవతరించింది కోల్​కతా నైట్ రైడర్స్. ఫైనల్ ఫైట్​లో సన్​రైజర్స్​ను ఓడించి కప్పును సొంతం చేసుకుంది అయ్యర్ సేన. ఈ నేపథ్యంలో ఆ టీమ్​కు ఎన్ని కోట్లు ప్రైజ్​మనీగా వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published May 27, 2024 | 11:19 AMUpdated May 27, 2024 | 11:28 AM
IPL 2024 ఛాంపియన్​గా KKR.. కప్ గెలిచినందుకు ఎన్ని కోట్లు వచ్చాయంటే?

ఐపీఎల్ నయా ఛాంపియన్​గా అవతరించింది కోల్​కతా నైట్ రైడర్స్. 10 ఏళ్ల కప్పు దాహాన్ని తీర్చుకుంది. చెన్నై వేదికగా సన్​రైజర్స్ హైదరాబాద్​తో జరిగిన సండే ఫైట్​లో కేకేఆర్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన కమిన్స్ సేన 113 పరుగులకే కుప్పకూలింది. స్వల్ప లక్ష్య ఛేదనలో కోల్​కతా 10.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలను చేరుకుంది. పదేళ్ల తర్వాత ట్రోఫీని ముద్దాడిన కేకేఆర్ సంబురాల్లో మునిగిపోగా.. ఫైనల్ వరకు అద్భుతంగా ఆడుతూ వచ్చిన ఎస్​ఆర్​హెచ్ ఓటమితో రన్నరప్​తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ సీజన్​లో టైటిల్ విన్నర్​, రన్నరప్​తో పాటు బెస్ట్ పెర్ఫార్మెన్స్ చూపిన ఆటగాళ్లకు భారీ మొత్తం ప్రైజ్​మనీ దక్కింది. కప్పు గెలిచిన కోల్​కతాకు ఎన్ని కోట్లు వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం..

సన్​రైజర్స్​ను ఓడించి కప్పు గెలిచిన కోల్​కతాకు అత్యధికంగా రూ.20 కోట్లు ప్రైజ్​మనీ దక్కింది. ఫైనల్​లో ఓడినప్పటికీ ఆరెంజ్ ఆర్మీకి కూడా భారీ మొత్తం సొంతమైంది. రన్నరప్​గా నిలిచిన కమిన్స్ సేన రూ.12.5 కోట్లు అందుకుంది. ఈ ఏడాది బెస్ట్ గ్రౌండ్​ అండ్ పిచ్​గా ఎంపికైంది ఉప్పల్ స్టేడియం. అందుకు గానూ రూ.50 లక్షలు అందుకుంది. ఈ సీజన్ ఆసాంతం బ్యాట్​తో రఫ్ఫాడించిన కింగ్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ విన్నర్​గా నిలిచాడు. అందుకు గానూ రూ.10 లక్షలు దక్కించుకున్నాడు. పర్పుల్ క్యాప్ హోల్డర్ అయిన పంజాబ్ కింగ్స్ పేసర్ హర్షల్ పటేల్​కు రూ.10 లక్షలు, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న సన్​రైజర్స్ హైదరాబాద్ ఆల్​రౌండర్ నితీష్​ కుమార్ రెడ్డికి రూ.10 లక్షలు దక్కాయి.

క్లీన్ హిట్టింగ్​తో బంతుల్ని అవలీలగా స్టాండ్స్​లోకి తరలిస్తూ పోయిన ఢిల్లీ క్యాపిటల్స్ చిచ్చర పిడుకు జేక్ ఫ్రేజర్ సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్​గా నిలిచాడు. ఈ అవార్డు కింద ఫ్రేజర్​కు రూ.10 లక్షల ప్రైజ్​మనీ అందింది. ఫాంటసీ ప్లేయర్​ అవార్డు కింద కేకేఆర్ ఆల్​రౌండర్ సునీల్ నరైన్​కు రూ.10 లక్షలు దక్కాయి. దీంతో పాటు అత్యంత విలువైన ఆటగాడిగా మరో రూ.10 లక్షల్ని అతడు కొట్టేశాడు. అత్యధిక సిక్సులు (42 సిక్సులు) బాదిన ఎస్​ఆర్​హెచ్​ ఓపెనర్ అభిషేక్ శర్మ రూ.10 లక్షలు సొంతం చేసుకున్నాడు. అత్యధిక బౌండరీలు కొట్టిన మరో సన్​రైజర్స్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ (64 ఫోర్లు) కూడా అంతే మొత్తాన్ని సొంతం చేసుకున్నాడు. కేకేఆర్ బ్యాటర్ రమణ్​దీప్ సింగ్ క్యాచ్ ఆఫ్ ది సీజన్​ కింద రూ.10 లక్షలు అందుకున్నాడు. కప్పు మిస్సైనా ఫెయిర్ ప్లే అవార్డును సొంతం చేసుకుంది సన్​రైజర్స్. ఈ పురస్కారం కింద రూ.10 లక్షలు కూడా దక్కాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి