iDreamPost

బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి కేంద్రం నిధులు.. అభివృద్ధి పనులకు రూ. 4 కోట్లు

బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయంలో భక్తులకు మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. కేంద్రం ఆలయ అభిృద్ధికి రూ. 4 కోట్లు కేటాయించింది.

బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయంలో భక్తులకు మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. కేంద్రం ఆలయ అభిృద్ధికి రూ. 4 కోట్లు కేటాయించింది.

బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి కేంద్రం నిధులు.. అభివృద్ధి పనులకు రూ. 4 కోట్లు

హైదరాబాద్ మహానగరంలో భక్తుల పాలిట వరాలిచ్చే తల్లిగా కొలువుదీరిన బల్కంపేట ఎల్లమ్మ ఆలయం గురించి తెలియని వారుండరేమో. నిత్యం వందలాది మంది భక్తులు ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటుంటారు. ప్రతీయేట బల్కంపేట ఎల్లమ్మ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇక ఇప్పుడు ఎల్లమ్మ తల్లి భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఆలయ అభివృద్ధికి కేంద్రం శ్రీకారం చుట్టింది. ఎల్లమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో పలు సౌకర్యాల అభివృద్ధికి రూ. 4.4 కోట్ల నిధులు కేటాయించింది. ప్రధాని మోడీ ఈ రోజు(గురువారం) పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధి పథకాలను వర్చువల్ గా ప్రారంభించారు.

పర్యాటక మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వదేశ్ దర్శన్, ప్రసాద్ పథకంలో భాగంగా బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో కేంద్రం వివిధ సౌకర్యాలను కల్పించనుంది. ఎల్లమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో అన్నదానం భవనం, వర్షపు నీటి సంరక్షణ వసతులు, వరద నీటి డ్రైనేజ్ వ్యవస్థ, బయో టాయిలెట్స్ కాంపౌండ్ వాల్స్, గేట్లు, సీసీటీవీలు, డీజీ సెట్, కేఫ్టేరియా వంటి వసతులను క్పలించనుంది. కేంద్రం చొరవతో ఎల్లమ్మతల్లి భక్తులకు సౌకర్యం కలగనుందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జోగులాంబలో రూ. 38 కోట్లతో చేపట్టిన పనులు పూర్తయ్యాయని వెల్లడించారు.

భువనగిరి కోట చరిత్ర భావితరాలకు తెలిసేలా రూ. 57 కోట్లతో గైడెడ్ టూర్లు, లైట్ షోలు లాంటి సౌకర్యాలను కల్పిస్తున్నామని, రోప్ వే అభివృద్ధి, ఇంటర్-ప్రిటేషన్ సెంటర్ సౌకర్యాలను కల్పిస్తున్నామని మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అనంతగిరిలో కొలువైన అనంత పద్మనాభ స్వామి ఆలయ అభివృద్ధికి రూ. 38 కోట్లు ప్రకటించినట్లు తెలిపారు. భద్రాచలంలో కొలువైన శ్రీ సీతారామచంద్రుల ఆలయం వద్ద రూ. 41 కోట్లతో వసతులను ఏర్పాట్లు చేస్తున్నట్లు కిషన్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో పర్యాటక కేంద్రాల అభివృద్ధికి కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి