iDreamPost

హాలీవుడ్ నిర్మాణ సంస్థ అనౌన్స్ మెంట్.. గ్లోబల్ గా చెర్రీ క్రేజ్ చూడండి!

Ram Charan Global Level Craze: రామ్ చరణ్ క్రేజ్ అంతకంతకు పెరుగుతోంది. తాజాగా హాలీవుడ్ లెవల్లో చెర్రీకి ఉన్న క్రేజ్ ఏంటో చెప్పే విషయం ఒకటి వైరల్ అవుతోంది.

Ram Charan Global Level Craze: రామ్ చరణ్ క్రేజ్ అంతకంతకు పెరుగుతోంది. తాజాగా హాలీవుడ్ లెవల్లో చెర్రీకి ఉన్న క్రేజ్ ఏంటో చెప్పే విషయం ఒకటి వైరల్ అవుతోంది.

హాలీవుడ్ నిర్మాణ సంస్థ అనౌన్స్ మెంట్.. గ్లోబల్ గా చెర్రీ క్రేజ్ చూడండి!

ఇప్పుడు గ్లోబల్ గా రామ్ చరణ్ క్రేజ్ చూస్తుంటే అభిమానులకే కాదు.. బిగ్ స్టార్స్ కి కూడా పిచ్చెక్కి పోతోంది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత చెర్రీ క్రేజ్ గ్లోబల్ స్థాయికి పాకింది. ఒక్కో సినిమాతో తన రేంజ్ ని ఒక్కో మెట్టు పైకి తీసుకెళ్తూ వస్తున్నాడు. ఇప్పటికే ఇంతో మంది హాలీవుడ్ స్టార్లు, ప్రముఖులు రామ్ చరణ్ నటనను పొగుడుతూ వస్తున్నారు. తాజాగా మరోసారి హాలీవుడ్ లో రామ్ చరణ్ కు ఉన్న క్రేజ్ ఏంటో తెలిసొచ్చింది. ఏకంగా ఒక హాలీవుడ్ నిర్మాణ సంస్థ రామ్ చరణ్ విషయంలో తమ మనసులో మాటను బయటకు చెప్పింది. ప్రస్తుతం టాపిక్ టాక్ ఆఫ్ ది వరల్డ్ సినిమాగా మారిపోయింది.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ అంతకంతకు పెరిగిపోతోంది. ప్రతి సినిమాకి చెర్రీ ఎఫర్ట్స్ ఏంటో ఆడియన్స్ చూస్తూనే ఉన్నారు. రంగస్థలం సినిమాతో రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత చెర్రీ క్రేజ్ వరల్డ్ వైడ్ కి చేరింది. ఆ మూవీ తర్వాత రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఒక ఫిరోషియస్ యంగ్ అండ్ అగ్రెసివ్ పోలీసు ఆఫీసర్ గా చెర్రీ నటించిన తీరుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ మెస్మరైజ్ అయిపోయారు. అప్పటి నుంచే చెర్రీ హాలీవుడ్ ఎంట్రీ గురించి కూడా ఆసక్తి నెలకొంది. ఒక హాలీవుడ్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా డిస్కషన్స్ జరిగాయి అన్నారు.

తాజాగా మరోసారి చెర్రీ గ్లోబల్ క్రేజ్ చెప్పే వార్త ఒకటి వైరల్ అవుతోంది. అందేటంటే.. హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒక కాస్టింగ్ సైట్ ఒక అనౌన్స్ మెంట్ చేసింది. ఒక మూవీకి హీరో కావాలంటూ ప్రకటన చేసింది. అందుకు తగిన క్వాలిటీలు మాత్రమే కాకుండా.. వారికి కావాల్సిన హీరో ఎలా ఉండాలో కొందరు యాక్టర్స్ ని ఉదాహరణగా చెప్పుకొచ్చింది. అలా మొత్తం ఆరుగురు హీరోలను ప్రస్తావించింది. ఆ లిస్టులో రామ్ చరణ్ పేరును కూడా చెప్పుకొచ్చారు. ఆ లిస్టులో రామ్ చరణ్ మినహా మిగిలిన వాళ్లంతా హాలీవుడ్ నటులే ఉండటం గమనార్హం. మనోళ్లు హాలీవుడ్ హీరోలా ఉండాలి అని రఫ్ గా మన హీరోలకి కొన్ని శాంపిల్స్ చూపిస్తుంటారు. కానీ హాలీవుడ్ వాళ్ళే మన తెలుగు హీరోని అక్కడి వారికి శాంపిల్ చూపించారు.

ఈ వార్త మరోసారి గ్లోబల్ గా రామ్ చరణ్ కు ఉన్న క్రేజ్ ఏంటో తెలిసొచ్చేలా చేసింది. ఇండియన్ సినిమా నుంచి అంతటి గుర్తింపు పొందిన ఒకే ఒక్క హీరోగా ఆ లిస్టులో రామ్ చరణ్ స్థానం దక్కించుకోవడంపై ప్రసంశలు వెల్లివెత్తుతున్నాయి. ఇంక మెగా ఫ్యాన్స్ అయితే కాలర్ ఎగరేసుకుంటూ ఇదీ రామ్ చరణ్ క్రేజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రామ్ చరణ్ మూవీస్ విషయానికి వస్తే.. డైరెక్టర్ శంకర్ తో తీస్తున్న గేమ్ ఛేంజర్ కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రావడం లేదు. ఇప్పటికే అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. సెప్టెంబర్ లో వస్తుంది అనుకున్నంటున్న ఫ్యాన్స్ కు షాకిస్తూ.. ఆ నెలలో కూడా కష్టం అంటూ వార్తలు వస్తున్నాయి. గేమ్ ఛేంజర్ రిలీజ్ ని క్రిస్మస్ కు ప్లాన్ చేస్తున్నారు అంటూ ప్రస్తుతం ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ప్రస్తుతానికి సినిమా మాత్రం ఇంకా చిత్రీకరణ స్టేజ్ లోనే ఉంది. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబుతో ఆర్సీ16 మూవీని చేయనున్నాడు. బుచ్చిబాబు డైరెక్టర్ శంకర్ ఎప్పుడెప్పుడు గుమ్మడికాయ కొడతారా అని ఎదురుచూస్తున్నాడు. మరి.. గ్లోబల్ గా రామ్ చరణ్ కు పెరుగుతున్న క్రేజ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి