IMD Forecast Rains TS: తెలంగాణకు చల్లని కబురు.. నేడు, రేపు వర్షాలు

Rain Alert: తెలంగాణకు చల్లని కబురు.. నేడు, రేపు వర్షాలు

ఎండలు మండిపోతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు చూసి భయపడుతున్న జనాలకు వాతావరణ శాఖ చల్లని వార్త చెప్పింది. రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఆ వివరాలు..

ఎండలు మండిపోతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు చూసి భయపడుతున్న జనాలకు వాతావరణ శాఖ చల్లని వార్త చెప్పింది. రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఆ వివరాలు..

రెండు తెలుగు రాష‍్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ఫిబ్రవరిలోనే ఇంత వేడిగా ఉంటే.. ఇక ఈ ఏడాది వేసవికాలంలో ఇంకెంత ఉక్కపోత ఉండనుందో అని జనాలు బెంబేలెత్తుతున్నారు. అయితే పగలంతా ఉక్కపోత, వేడిగా ఉంటే.. రాత్రి మాత్రం చల్లగా ఉంటుంది. ఇక నేడు అనగా శనివారం నాడు తెలంగాణ వాతావరణంలో విచిత్రమైన మార్పు చోటు చేసుకుంది. ఆకాశం మేఘావృతం అయ్యింది. ఈ క్రమంలో హైదరాబాద్‌ వాతావరణ శాఖ రాష్ట్ర ప్రజలకు చల్లని కబురు చెప్పింది. రెండు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఆ వివరాలు..

వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలకు చల్లని వార్త చెప్పింది. నేడు, రేపు అనగా శని, ఆదివారం రెండు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రాష్ట్రంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా అక్కడక్కడ చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. ఇదిలా ఉంటే గత మూడు రోజులుగా రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఖమ్మం, నల్లగొండలో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

మారుతున్న వాతావరణం కారణంగా రాష్ట్రంలో ప్రజలు అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. చాలా ప్రాంతాల్లో ప్రజలు దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్నారు. ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. వాతావరణ మార్పుల కారణంగా చిన్నారులు సైతం ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని.. మరీ ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు బయటకు ఎక్కువగా రాకుండా ఇంటి వద్దనే ఉండాలని సూచిస్తున్నారు. అలానే అంటువ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు పోషాకాహారం తీసుకుంటూ.. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

వేసవి కాలం వడదెబ్బ సమస్య ఎక్కువగా ఉంటుంది. దాని బారిన పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. తగినంత నీరు, పళ్ల రసాలు తాగాలని.. మసలా ఫుడ్‌కు దూరంగా ఉండాలని.. కాటన్‌, తేలిక దుస్తులు ధరించాలని చెబుతున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బయటకు వెళ్లకపోవడం ఉత్తమం అని.. వెళ్లాల్సి వస్తే.. గొడుగు తీసుకెళ్లాలని సూచిస్తున్నారు.

 

Show comments