Hyderabad శివార్లలో కొత్త నగరం.. మీకు అక్కడ భూములున్నాయా.. ఇక మీరు కోటీశ్వరులే..

CM Revanth Reddy-Net Zero Carbon City, Hyderabad: మీకు హైదరాబాద్‌ నగర శివార్లలో భూమలున్నాయా.. అయితే మీరు కోటీశ్వరులే. ఎందుకంటే ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం వల్ల అక్కడ భూముల ధరలకు రెక్కలు రాబోతున్నాయి అంటున్నారు. ఆ వివరాలు.

CM Revanth Reddy-Net Zero Carbon City, Hyderabad: మీకు హైదరాబాద్‌ నగర శివార్లలో భూమలున్నాయా.. అయితే మీరు కోటీశ్వరులే. ఎందుకంటే ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం వల్ల అక్కడ భూముల ధరలకు రెక్కలు రాబోతున్నాయి అంటున్నారు. ఆ వివరాలు.

హైదరాబాద్‌ నగరంలో భూముల ధర ఎంత భారీగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గజం ధర లక్షల రూపాయలు పలుకుతుంది. నగర శివార్లు మొదలు.. సిటి నడి బొడ్డు వరకు భూముల ధరలు కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. భాగ్యనగరంలో 100, 200 గజాల భూములు కొనాలన్నా.. లక్షలు, కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి. ఇప్పటికే నగరంలో భూముల ధరలు భారీగా పెరగ్గా.. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేసిన ప్రకటనతో.. హైదరాబాద్‌ శివార్లలో భూములకు రెక్కలు రానున్నాయి అంటున్నారు. ఇంతకు ఏంటా నిర్ణయం.. ఎందుకు భూముల ధరలు పెరగనున్నాయి అంటే..

హైదరాబాద్ నగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే ఇక్కడ అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. అందుకు తగ్గట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా నగర అభివృద్దిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా నగర శివార్లలోని ప్రాంతాల అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా హైదరాబాద్‌ నగర శివారుల్లో అద్భుత సిటీ నిర్మాణానికి రేవంత్‌ సర్కార్‌ ప్రణాళికలు రెడీ చేస్తోంది. కాలుష్య రహితంగా, కర్బన ఉద్గారాల రహితంగా ‘నెట్‌ జీరో సిటీ’ నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లోనే రేవంత్‌ సర్కార్‌ ఈ నెట్‌ జీరో సిటీని నిర్మించనుంది. రంగారెడ్డి జిల్లా కందుకూరు, యాచారం మండలాల్లో ఫార్మాసిటీ కోసం గత ప్రభుత్వం దాదాపు 19 వేల ఎకరాల భూమిని సేకరించాలని టార్గెట్‌గా పెట్టుకుంది. అయితే ఇప్పటికే 12వేల ఎకరాలకు పైగా భూమిని సేకరించారు. దీనిపై ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ.. తాము అధికారంలోకి వచ్చాక.. ఫార్మాసిటీని ఒకే ప్రాంతంలో కాకుండా హైదరాబాద్ నగరం చుట్టూ క్లస్టర్లుగా ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఇప్పుడు దాన్ని అమలు చేసేందుకు రెడీ అవుతోంది.

ఫార్మాసిటీ కోసం గతంలో సేకరించిన భూముల్లోనే మల్టీ మోడల్‌ ప్రాజెక్టులు నిర్మిస్తామని రేవంత్ సర్కార్ తెలిపింది. దీనిలో భాగంగానే కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలో నెట్‌ జీరో సిటీని అభివృద్ధి చేయలని భావిస్తోంది. ఏదైనా ఓ ప్రాంతాన్ని 100 శాతం కాలుష్య, కర్బన ఉద్గార రహితంగా తీర్చిదిద్దడాన్నే నెట్‌ జీరో సిటీ అని పిలుస్తారు. ఆ ప్రాంతంలో వెలువడే కర్బన ఉద్గారాలు, ఇతర గ్రీన్‌ హౌస్‌ వాయువులను పూర్తిగా పీల్చుకునేలా భారీగా చెట్లను పెంచి కాలుష్య రహితంగా మారుస్తారు. గ్లోబల్‌ వార్మింగ్‌ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా 25 నగరాలను నెట్‌ జీరో సిటీలుగా మార్చేందుకు ఆయా దేశాలు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఇక ఇప్పుడు రేవంత్‌ సర్కార్‌ కూడా ఆ దిశగా చర్యలు తీసుకోవడం మంచి పరిణామం అంటున్నారు.

ఈ నేపథ్యంలో ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట్‌లో నెట్ జీరో సిటీని నిర్మించే ప్రాంతాన్ని సందర్శించారు. దీనిపై రూపొందించిన ప్రణాళికలను పరిశీలించి చేయాల్సిన మార్పుచేర్పులపై అధికారులకు సూచనలిచ్చారు.  కాగా, ఇదే ప్రాంతంలో స్కిల్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక రేవంత్‌ సర్కార్‌ నిర్ణయంతో నెట్‌ సిటీ చుట్టూ ఉన్న భూముల ధరలకు రెక్కలు వచ్చే అవకాశం ఉంది. మీకు గనక అక్కడ భూములుంటే.. మీరు కోటీశ్వరులైనట్లే అంటున్నారు.

Show comments