దసరాకు ఇంటికి వచ్చి.. విగత జీవిగా మారిన విద్యార్థిని!

దసరాకు ఇంటికి వచ్చి.. విగత జీవిగా మారిన విద్యార్థిని!

ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తోన్న పదం గుండెపోటు.  దీని కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకప్పుడు గుండెపోటు అంటే చాలా వయస్సు మీద పడిన వారికి, మద్యం ఎక్కువగా సేవించే వారికి వస్తుంది. అయితే నేటి కాలంలో మాత్రం వయస్సుతో సంబంధం లేకుండా  పది నెలల పసిపాప నుంచి.. పండు ముసలి వారి వరకు అందరిలో ఈ గుండె పోటు వస్తుంది. ఇప్పటికే దీని కారణంగా ఎంతోమంది యువత ప్రాణాలను పొగొట్టుకున్నారు. తాజాగా ఓ బాలిక కూడా ఈ హర్ట్ ఎటాక్ కి బలైంది. ఈ విషాద ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు  తెలిపిన వివరాల ప్రకారం..

నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌ మండలం కంజర గ్రామానికి చెందిన అంగన్‌వాడీ ఉపాధ్యాయురాలు అందరంగి సాయి లక్ష్మికి గ్రెసీ, మైథిలి ఇద్దరు కుమార్తెలు. సాంఘిక సంక్షేమ గురుకులంలోనే గ్రెసీ ఇంటర్‌ ప్రథమ సంవత్సరం, మైథిలి(12) ఏడో తరగతి చదువుతున్నారు. ఇటీవలే  తెలంగాణాలో దసరా సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో అందరు విద్యార్థులు వారి వారి స్వగ్రామాలకు వెళ్లారు. అలానే మైథిలి కూడా దసరా సెలవులు కావడంతో శుక్రవారం కంజర గ్రామంలోని తన ఇంటికి వచ్చింది. శుక్రవారం సాయంత్రం వరకు హుషారుగా కనిపించిన మైథిలి రాత్రి ఒక్కసారిగా ఛాతిలో నొప్పి వస్తుందని తల్లికి చెప్పింది.

దీంతో ఆమె వెంటనే మైథిలిని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే గుండెపోటుతో విద్యార్థిని చనిపోయిందని వైద్యులు తెలిపారు. శనివారం గ్రామంలో బాలిక అంత్యక్రియలు నిర్వహించగా.. తోటి విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్థులు కన్నీటి వీడ్కోలు తెలిపారు. చిరునవ్వుతో ఇంటికి వచ్చిన తమ బిడ్డ..తమకు ఇలా కన్నీరు మిగులుస్తుందని అనుకోలేదంటూ మృతురాలి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధించారు. ఈ గుండెపోటు కారణంగా ఇలా ఎందరో విద్యార్థులు బలవుతున్నారు. మరి.. గుండెపోటు నివారణకు మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments