హైదరాబాద్ లో కలకత్తా డాక్టర్ లాంటి ఘటన! హోటల్లో నర్సింగ్ విద్యార్థిని!

Hyderabad: కలకత్తా డాక్టర్ లాంటి ఘటన మరువక ముందే తాజాగా నగరంలో మరో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. అప్పటి వరకు స్నేహితులతో కలిసి సంతోషంగా ఉన్నా యువతికి విషయంలో ఇలా జరగడం పై స్థానికంగా సంచలనంగా మారింది.

Hyderabad: కలకత్తా డాక్టర్ లాంటి ఘటన మరువక ముందే తాజాగా నగరంలో మరో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. అప్పటి వరకు స్నేహితులతో కలిసి సంతోషంగా ఉన్నా యువతికి విషయంలో ఇలా జరగడం పై స్థానికంగా సంచలనంగా మారింది.

ఈ మధ్యకాలంలో చాలామంది అమ్మాయిలు అనుమానాస్పదంగా మృతి చెందుతున్న ఘటనలు నగరంలో రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. అయితేఇలా మృతి చెందినవారిలో చాలామంది మంచి ఉద్యోగం సంపాదించుకోవాలనే నేపథ్యంలో.. ఉన్న ఊరును, కుటుంబాన్ని విడిచి కోటి ఆశలతో నగరంకు చేరుకుంటున్నారు. కానీ, అంతలోనే ఏం జరుగుతుందో తెలియడం లేదు. దారుణంగా హత్యకు గురవ్వడం, ఆత్మహత్య చేసుకోవడం వంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.  ఈ క్రమంలోనే.. హైదరాబాద్ లో ఓ నర్సింగ్ విద్యార్థిని కూడా అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

హైదరాబాద్ లోని గచ్చిబౌలి రెడ్ స్టన్ హోటల్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ నర్సింగ్‌ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఈ కేసులో పోలీసులు తెలిపిన కథనం మేరకు.. జడ్చర్లకు చేందిన శృతి (23) అనే యువతి గత రెండు రోజుల క్రితం గణేశ్ నిమజ్జనోత్సవ వేడుకలను చూసేందుకు హైదరాబాద్ వచ్చింది. ఈ క్రమంలోనే.. ఆదివారం రాత్రి శ్రుతి.. ఆమె స్నేహితురాలు, మరో ఇద్దరు అబ్బాయిలంతా కలిసి గచ్చిబౌలి రెడ్‌ స్టోన్‌ హోటల్‌కి వెళ్లి రెండు రూమ్ లు అద్దెకు తీసుకున్నారు. ఇక అక్కడ స్నేహితులతో కలసి ఆ రాత్రి పార్టీ చేసుకున్న శృతి.. సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు ఫ్యాన్ కు ఊరేసుకొని ఆత్మహత్య చేసుకునట్లు తెలుస్తుంది.

అయితే శృతి మృతి పై ఆమె స్నేహితులు పోలీసులకు తెలిపిన సమాచారం ప్రకారం.. ఆదివారం రాత్రి తామంతా పార్టీ చేసుకొని హోటల్‌ నుంచి బయటకు వెళ్లామని, కానీ, శృతి మాత్రం తనకు తలనొప్పిగా ఉందని తమతో రాలేనని చెప్పిందని స్నేహితులు చెబుతున్నారు. అయితే  సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు మళ్లీ తామంతా హోటల్ కు తిరిగి వచ్చామని.. కానీ, రూమ్ లోపలి నుంచి గడియ వేసుకున్న శృతి ఎంతకీ తలుపు తెరవకపోవడంతో.. హోటల్‌ సిబ్బందికి చెప్పడంతో వారు మాస్టర్‌ కీతో తలుపు తీశారని చెప్పారు. తీరా లోపలకి వెళ్లి చూశాక శృతి ఫ్యానుకు ఉరివేసుకుని కనిపించిదని స్నేహితులు పోలీసులకు తెలిపారు.

ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న తాము వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించిగా.. ఆ గదిలో బీరుబాటిల్స్‌ తో పాటు గది నిండా రక్తం మరకలు ఉండటం గుర్తించమని పోలీసులు తెలిపారు. అలాగే యువతి స్నేహితులు ఇచ్చిన సమాచారం మేరకు ఇది హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో కేసును దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. ఇకపోతే యువతి  మృతి పై తల్లిదండ్రులు, బంధువులుకు సమాచారం అందించిన పోలీసులు.. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉంటే.. కూతిరి మృతిపై సమాచారం అందుకున్న తల్లిదండ్రులు వెంటనే హైదరాబాద్ కు తరలివచ్చారు. కానీ, అప్పటికే శృతి మృతదేహం పోస్టుమార్టంకు తరలించడంతో.. వారు పోలీసులను తాము వచ్చేంత వరకు ఎందుకు తమ కూతురి మృతదేహం ఘటన స్థలంలో ఉంచలేదని ప్రశ్నించారు.

అంతేకాకుండా..ఆదివారం కాల్‌ చేస్తే మంచిగానే మాట్లాడిన తమ కూతురు ఇలాంటి ఘోరానికి పాల్పడిందంటే నమ్మశక్యంగా లేదంటూ అనుమానం వ్యక్తం చేశారు. పైగా తమ కూతురు మృతదేహం చూసిన తల్లిదండ్రులు ఒంటిపై గాయాలున్నాయని.. ఆమెను ఎవరో హత్యచారం చేశారని, అనంతరం ఉరేసి ఆత్మహత్యల క్రియేట్ చేశారని పోలీసులకు ఆరోపించారు. తమ కూతురి మృతిపై అనుమానంగా ఉందని, వెంటనే తమ కూతురి మృతి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని శృతి తల్లిదండ్రులు పోలీసులకు కోరారు.  ఇక ఈ విషయం పక్కన పెడితే.. గతంలో శృతి  యశోద హాస్పటల్‌గా ట్రైనీ నర్సుగా పని చేసింది. కానీ, ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి సొంతూరు వెళ్లిపోయింది. అయితే మళ్లీ  జాబ్ సెర్చింగ్ కోసం హైదరాబాద్ వచ్చిందని, అంతలోనే ఇలాంటి ఘటన చోటు చేసుకుందని యువతి తల్లిదండ్రులు పోలీసులుకు తెలిపారు.

Show comments