Local News: వీడియో: యువతి జుట్టుపట్టుకుని కింద పడేసిన లేడీ కానిస్టేబుల్స్

వీడియో: యువతి జుట్టుపట్టుకుని కింద పడేసిన లేడీ కానిస్టేబుల్స్

తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్.. సుమారు 100 ఎకరాల భూమిని నూతన హైకోర్టు కోసం కేటాయించింది. అయితే ఈ నిర్ణయంపై విద్యార్థి లోకం వ్యతిరేకత వ్యక్తం చేసింది. నిరసనలు చేపడుతున్నారు. అయితే..

తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్.. సుమారు 100 ఎకరాల భూమిని నూతన హైకోర్టు కోసం కేటాయించింది. అయితే ఈ నిర్ణయంపై విద్యార్థి లోకం వ్యతిరేకత వ్యక్తం చేసింది. నిరసనలు చేపడుతున్నారు. అయితే..

రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్‌లో జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ ఉద్యాన యూనివర్శిటీకి చెందిన దాదాపు 100 ఎకరాల భూమిని హైకోర్టు నూతన భవానినికి కేటాయించింది తెలంగాణలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం. భూములు హైకోర్టు కేటాయిస్తూ తీసుకు వచ్చిన జీవో నెం. 55పై విద్యార్థులు ఆందోళనలు చేపడుతున్నారు. సాధారణంగా ఏవైనా జీవోలు విడుదల అయినప్పుడు వ్యతిరేకత వ్యక్తం వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఈ జీవో విషయంలో అలాంటి వ్యతిరేకతనే వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. రాజేంద్ర నగర్ విశ్వ విద్యాలయం పరిపాలన భవనం ఎదుట కొన్ని రోజుల నుండి ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ జీవోను రద్దు చేయాలంటూ డిమాండ్స్ చేస్తున్నారు స్టూడెంట్స్.

జీవో నెం 55ను ఉపసంహరించుకోవాలంటూ శాంతియుతంగానే నిరసనలు చేపడుతున్నారు విద్యార్థులు. కానీ పోలీసులు ప్రవర్తించిన తీరు మాత్రం విమర్శలను సృష్టించింది. హైకోర్టు నిర్మాణ ప్రతిపాదనను మరో చోటుకు మార్చాలని లేకపోతే ఆందోళను మరింత ఉధృతం చేస్తామంటూ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్శిటీ స్థలాన్ని హైకోర్టుకు కేటాయిస్తే చూస్తూ ఊరుకోమని నిరసలు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న రాజేంద్ర నగర్ పోలీసులు యూనివర్శిటీ వద్దకు చేరుకున్నారు. ఆందోళన చేపడుతున్న విద్యార్థులను సర్ది చెప్పాల్సింది పోయి.. యూనివర్శిటీ వద్ద కాదని, హైకోర్టు నిర్మాణ స్థలం వద్దకు వెళ్లి నిరసనలు తెలపండని పేర్కొన్నారు.

అయితే విద్యారర్థులు పరిపాలన విభాగం నుండి వెళ్లేందుకు ఇష్టపడలేదు. దీంతో వారి చేత నిరసన ఉపక్రమించేందుకు ప్రయత్నాలు చేపట్టారు పోలీసులు. ఈ క్రమంలో మహిళా విద్యార్థినులను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు మహిళా కానిస్టేబుల్స్. దీంతో ఓ విద్యార్థిని పారిపోతుండగా.. ఆమెను పట్టుకునేందుకు స్కూటీపై వెంబడించారు ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్. ఆమెను పట్టుకునేందుకు చివరికీ.. ఆమె జుట్టుపట్టుకుని కింద పడేశారు. వెంటనే తేరుకున్న ఆ అమ్మాయి.. జుట్టును వారి  చేతుల్లో నుండి విడిపించుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటిని షేక్ చేసేస్తుంది. పోలీసుల అమానుష తీరుపై మరోసారి విమర్శలు మొదలయ్యాయి. సాటి మహిళ పట్ల లేడీ పోలీసులు ప్రవర్తించిన తీరుపై మండిపడుతున్నారు నెటిజన్లు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments