Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తెలంగాణలో జూన్‌ నెల ఆరంభం నుంచి జోరు వానలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా వాతావరణ శాఖ కీలక అలర్ట్‌ జారీ చేసింది. రాష్ట్రాంలోని 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఆ వివరాలు..

తెలంగాణలో జూన్‌ నెల ఆరంభం నుంచి జోరు వానలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా వాతావరణ శాఖ కీలక అలర్ట్‌ జారీ చేసింది. రాష్ట్రాంలోని 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఆ వివరాలు..

ఈసారి దేశవ్యాప్తంగా వాతావరణం కాస్త భిన్నంగా ఉంది. ఎండలు మండిపోవాల్సిన మే నెలలో వరుసగా వర్షాలు కురిసాయి. జూన్‌ మొదటి వారంలోనే నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. అయితే అడపాదడపా వానలు కురుస్తున్నా.. ఇంకా కావావల్సిన మేర అయితే వర్షపాతం నమోదు కాలేదు. చాలా ప్రాంతాల్లో విత్తనాలు చల్లిన అన్నదాతలు.. వాటిని బతికించుకోవడం కోసం ట్యాంకర్ల ద్వారా నీరు పారిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక పల్లెల్లో పరిస్థితి ఇలా ఉంటే.. నగరంలో మాత్రం నాలుగు చినుకులు పడ్డా.. భారీ వర్షం కురిసినంత రేంజ్‌లో ట్రాఫిక్‌ జామ్‌, రోడ్ల మీద నీరు నిలవడం వంటివి జరుగుతున్నాయి. అయితే రానున్న ఈ నాలుగు రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జోరు వానలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఆ వివరాలు..

తెలంగాణల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చల్లని కబురు చెప్పారు. నేడు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు. నైరుతి రుతవనాలకు తోడు ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా మంగళవారం నాడు జోరు వానలు కురిసే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. మరీ ముఖ్యంగా నేడు రాష్ట్రంలోని వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, వరంగల్, హనుమకొండ, నిజామాబాద్, కామారెడ్డి, నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక హైదరాబాద్‌లో నేడు అనగా మంగళవారం ఉదయం నుంచి వాతావరణం పొడిగా ఉంటుందని చెప్పారు. సాయంత్రానికి నగరంలో జల్లులు పడే అవకాశం ఉందని వెల్లడించారు

భారీ వర్షాలకు తోడు బలమైన ఈదురు గాలులు వీస్తాయన్నారు. గంటకు దాదాపుగా 30-45 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పుకొచ్చారు. అనేక ప్రాంతాల్లో ఈదురు గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అవసరమైతేనే బయటకు వెళ్లాలని.. చెట్ల కింద ఉండకూడదని హెచ్చరించారు. వ్యవసాయ పనులు చేసుకునేవారు మరింత జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఇక జూన్‌ నెలలో రాష్ట్రంలో ఆశించిన మేర వర్షపాతం నమోదు కాలేదు.. కానీ జూలైలో జోరు వానలు కురుస్తాయని.. వాతావరణ శాఖ అధికారులు చెప్పుకొస్తున్నారు. ఇది నిజంగా రైతులకు చల్లని కబురే అని చెప్పవచ్చు.

Show comments