Dharani
వేసవి సెలవులు ముగిసి.. సూళ్లు తిరిగి తెరిచే సమయం దగ్గర పడుతుంది. ఈ క్రమంలో విద్యార్థులకు పండగలాంటి వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. పాఠశాలలకు సెలవులు పెంచాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఆ వివరాలు..
వేసవి సెలవులు ముగిసి.. సూళ్లు తిరిగి తెరిచే సమయం దగ్గర పడుతుంది. ఈ క్రమంలో విద్యార్థులకు పండగలాంటి వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. పాఠశాలలకు సెలవులు పెంచాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఆ వివరాలు..
Dharani
ఏడాదంతా పుస్తకాలతో కుస్తీ పట్టి.. పరీక్షల టెన్షన్‌తో అలసిపోయిన విద్యార్థులు ఉపశమనం పొందేది.. వేసవి సెలవుల్లో. సుమారు 50-60 రోజులు ఉండే ఈ హాలీడేస్‌లో విద్యార్థులు పూర్తిగా రిలాక్స్ అవుతారు. సరికొత్త ఉత్సాహంతో నూతన తరగతిలోకి ఎంటర్ అవుతారు. ఇక విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే విద్యా శాఖ ఆ ఏడాది రాబోయే సెలవులకు సంబంధించి క్యాలెండర్ విడుదల చేస్తుంది. ఇక 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి.. కొన్ని రోజుల క్రితమే విద్యా శాఖ అకడమిక్ క్యాలెండర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అంటే వచ్చే విద్యా సంవత్సరంలో ఉండబోయే సెలవులను ఫిక్స్ చేసింది అన్న మాట.
ఇక మరి కొన్ని రోజుల్లో వేసవి సెలవులు ముగిసి.. జూన్‌లో పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. విద్యా శాఖ ఇప్పటికే విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. జూన్ 12, 2024 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతాయి. స్కూల్స్ తెరవడానికి సమయం దగ్గర పడుతున్న వేళ.. సెలవులు పెంచాలనే కొత్త డిమాండ్ తెర మీదకు వచ్చింది. ఆ వివరాలు..
ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన తెలంగాణ విద్యా శాఖ ఇప్పటికే అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిలో మార్పులు చేయాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. సెలవులు పెంచాలంటూ.. తెలంగాణ స్టేట్ టీచర్స్ యూనియన్ డిమాండ్ చేస్తోంది. అయితే అది వేసవి సెలవులు గురించి కాదు.. పండుగలకు ప్రకటించిన హాలీడేస్ గురించి.
ప్రభుత్వం తాజాగా ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్‌లో పండుగలకు ఇచ్చే సెలవుల్లో శాస్త్రీయత లేదని.. తెలంగాణ టీచర్స్ యూనియన్ అభిప్రాయపడింది. తొలి ఏకాదశి పండుగకు సెలవు ఇవ్వాలని సూచించింది. అలానే దీపావళి పండుగకు రెండు రోజులు సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. అలానే మహాశివరాత్రి మరుసటి రోజు కూడా సెలవు ఇవ్వాలని కోరింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని అకడమిక్ క్యాలెండర్‌లో మార్పులు చేయాలని కోరింది. ప్రభుత్వం గనక వీరి అభ్యర్థనలను పరిగణలోకి తీసుకుంటే.. స్కూల్ సెలవులు పెరిగే అవకాశం ఉంది.
తెలంగాణ విద్యా శాఖ విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్‌లో 1-10 వ తరగతి వరకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. దీని ప్రకారం జూన్ 12, 2024న తెలంగాణలో పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతాయి. అలానే ఏప్రిల్ 24, 2025న ముగుస్తాయి. ఈ విద్యా సంవత్సరంలో 229 రోజులు పాఠశాలలు పని చేస్తాయి. అలానే వచ్చే ఏడాది వేసవి సెలవుల గురించి కూడా ఈ అకడమిక్ క్యాలెండర్‌లో ప్రస్తావించారు. ఏప్రిల్ 24, 2025 నుంచి జూన్ 11, 2025 వరకు అనగా 49 రోజులు వేసవి సెలవులు ఉంటాయి.
2024 దసరా సెలవులు అక్టోబర్ 2-14 వరకు సుమారు 13 రోజుల పాటు ఉంటాయి. 2025 సంక్రాంతి సెలవులు జనవరి 13-17 వరకు మొత్తం 5 రోజులు ఉంటాయి. అలానే 2024లో సాధారణ సెలవులు 27, ఆప్షనల్ హాలిడేస్ 25 ఉన్నాయి. జనవరి 15న సంక్రాంతి సెలవు, మార్చి 8న మహాశివరాత్రి, మార్చి 25న హోలీ, ఏప్రిల్ 9న ఉగాది, ఏప్రిల్ 17న శ్రీరామనవమి, జూన్ 17న బక్రీద్, సెప్టెంబర్ 7న వినాయక చవితి, అక్టోబర్ 10న దసరా, అక్టోబర్ 31న దీపావళికి సెలవులు ఇస్తున్నారు.